కరెంట్ బిల్లు పేలుతోందా? జస్ట్, ఇలా చేయండి చాలు, బోలెడంత డబ్బు ఆదా
ఇంధనాన్ని ఎంత తక్కువ ఉపయోగిస్తే.. అంత డబ్బును ఆదా చేసినట్టే. విద్యుత్ విషయంలో కూడా అంతే.. ఎంత పొదుపుగా విద్యుత్ వాడతామో.. అంత డబ్బు మిగులుతుంది.
ఈ రోజుల్లో విద్యుత్ వాడకం ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. వాడకం తగినట్లే విద్యుత్ బిల్లులు కూడా పేలుతున్నాయి. నెల నెలా ఆ బిల్లులు కట్టేసరికి జేబుకు చిల్లులు పడుతున్నాయి. అలా కాకుండా ఉండాలంటే.. మీరు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. ముఖ్యంగా ఇంట్లోని విద్యుత్తు దీపాలు, ఫ్యాన్లను ఒక పద్ధతిలో వాడితే బిల్లు పేలుతుందనే భయమే అక్కర్లేదు. ఉపయోగంలో లేనపుడు ఇంట్లో వెలిగే లైట్లను ఆఫ్ చెయ్యడం ద్వారా కరెంటు బిల్లులు తగ్గించడానికి మంచి మార్గం. వాడకంలో లేనపుడు ఇతర ఎలక్ట్రిక్ వస్తువులను కూడా అన్ ప్లగ్ చెయ్యడం మంచిది. అవసరం లేనపుడు లైట్లు ఆపేయడం వల్ల కేవలం కరెంట్ ఆదా మాత్రమే కాదు, పర్యావరణానికి హాని చేసే కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గించిన వాళ్లం అవుతాం.
లైట్లు ఆపేయ్యడం వల్ల ఎంత కరెంట్ ఆదా చెయ్యగలం?
ఇంట్లో మనం ఎలాంటి బల్బులను వాడుతున్నామనే దానిమీదే మన విద్యుత్ ఆదా అనేది ఆధారపడి ఉంటుంది. బల్బ్ వాటేజి సామర్థ్యాన్ని బట్టి అది అందించే వెలుగు, వినియోగించే విద్యుత్ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 40 వాట్ల బల్బు వాడుతున్నపుడు ఒక గంటలో 0.04 kWh విద్యుత్ ఖర్చవుతుంది. అవసరం లేనపుడు లైట్ ఆఫ్ చెయ్యడం ద్వారా సగం విద్యుత్ ఆదా అవుతుంది. ఇలా ఒక నెల పాటు చేసి చూస్తే ఎంత విద్యుత్ ఆదా చెయ్యగలుగుతున్నామో మనకే అర్థం అవుతుంది.
కేవలం 40 వాట్ల బల్బును జాగ్రత్తగా వాడితేనే విద్యుత్ ఆదా అవుతుందంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన బల్బుల వాడకాన్ని నియంత్రించగలిగితే మరింత విద్యుత్ ఆదా చెయ్యవచ్చు. నెల రోజుల్లో రోజుకు ఒక గంట పాటు బల్బులు ఆపేస్తే కరెంటు బిల్లులను గణనీయంగా తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.
కరెంటు ఆదా చేసే కొన్ని మార్గాలు
☀ వేడిగా అనిపించినపుడు సీలింగ్ ఫ్యాన్ ఆన్ చెయ్యడం మంచిది. సీలింగ్ ఫ్యాన్ వల్ల దాదాపు 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఏయిర్ కండిషనర్ తో పోలిస్తే ఫ్యాన్ 10 శాతం తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది.
☀ మీ ఇంట్లో ఇప్పటికీ ఇంకా LED బల్చులకు మారకపోతే మీరు చాలా నష్టపోతున్నారనే అర్థం. మామూలు బల్బులతో పోలిస్తే.. LED బల్బులు 75 శాతం తక్కువ కరెంట్ వినియోగిస్తాయి.
☀ వంటకు ఎలక్ట్రిక్ స్టవ్‌లను ఉపయోగించేవారు వంట పూర్తిగా ఉడకడానికి కాస్త ముందే ఆఫ్ చెయ్యడం వల్ల కలిగే నష్టం ఏమీ ఉండదు. స్టవ్ లో మిగిలి ఉన్న వేడితో వంట పూర్తవుతుంది. చాలా వంటకాలను అలా పూర్తి చెయ్యవచ్చు.
☀ వంట పూర్తయిందో లేదో చూసేందుకు ఒవెన్ తలుపు తెరిచిన ప్రతి సారీ ఓవెన్ లోపలి టెంపరేచర్ 25 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు తగ్గుతుంది. తిరిగి మునుపటి ఉష్టోగ్రతకు చేరడానికి మరింత విద్యుత్ ను ఉపయోగిస్తుంది.
☀ వీలైనంత వరకు తక్కువ వాట్ల కెపాసిటి ఉండే బల్బుల వాడకం వల్ల విద్యుత్ ఆదాపెరుగుతుంది. అవసరమైతే తప్ప ఎక్కువ వాల్టుల బల్బులు వాడుకోవాలి. వీలైనంత వరకు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే బల్బులు వినియోగించాలి. మిగతావి ఆపేస్తూ ఉండాలి.
☀ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వీలైనంత వరకు స్టాండ్ బై మోడ్ లో పెట్టుకోవడం ద్వారా చాలా విద్యుత్ ఆదా చేసే వీలుంటుంది. ఈ ఆదా నెలవారీ విద్యుత్ బిల్ లో పది శాతం వరకు ఉండొచ్చు.
☀ వీలైనంత వరకు చల్లని నీటితో బట్టలు ఉతకండి. వాషింగ్ మిషన్ వేడి నీటి కోసం ఎక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. అంతేకాదు చాలా వరకు డిటర్జెంట్స్ అన్నీ కూడా చల్లని నీటిలోనే మంచి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి.
☀ పాత గాడ్జెట్స్ ఎక్కువ విద్యుత్ ను వాడుతాయి. కనుక వీలైనంత వరకు లేటెస్ట్ గాడ్జెట్స్ వాడడం మంచిది. పది సంవత్సరాలకు మించి పాతవైన ఫ్రిజ్ లు, వాషింగ్ మిషన్ల వంటివి మార్చేసి కొత్తవి కొనుక్కోవడమే మంచిది. మీరు పాత వాషింగ్ మిషన్ వాడుతుంటే వీలైనంత వరకు డ్రైయర్ వాడకపోవడమే మంచిది పాత డ్రయర్లు ఎక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయి.
☀ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మన విద్యుత్ బిల్ ను తగ్గిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Also read: చలికాలంలో తెల్లవారుజామున గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ, ఎందుకు? - ఎలా కాపాడుకోవాలి?