అన్వేషించండి

Oily Skin: జిడ్డు చర్మం వదిలించుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు

మొహం మీద ఎప్పుడు జిడ్డు, నూనె కారుతూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దాని నుంచి బయట పడాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించి చూడండి.

జిడ్డు చర్మాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. స్నానం చేసిన కాసేపటికే మొహం మీద నూనె వచ్చేసి చిరాకు పెట్టేస్తుంది. అటువంటి వాళ్ళు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడేందుకు కూడా ఇష్టపడరు. కానీ పురాతన ఆయుర్వేద సూచనల ప్రకారం ఇలా చేశారంటే మాత్రం మీ జిడ్డు చర్మం నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చు.

గోరువెచ్చని నీరు: గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోవడం ద్వారా రోజుని స్టార్ట్ చేయండి. బాగా వేడిగా నీటిని అసలు ఎంచుకోవద్దు. ఇది మీ చర్మం మీద ఉండే సహజమైన నూనెని కూడా తొలగించేస్తుంది.

సున్నితమైన క్లెన్సర్: వేప, తులసి లేదా కలబంద వంటి పదార్థాలతో చేసిన తేలికపాటి సహజమైన క్లెన్సర్స్ ఉపయోగించాలి. వీటిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి.

ఎక్స్ ఫోలియేట్: ఓట్ మీల్, శనగపిండి, బియ్యం పిండి వంటి పదార్థాలతో ఎక్స్ ఫోలియేట్ చేసుకోవాలి. ఇంట్లో దొరికే వాటితో స్క్రబ్ చేసుకోవడం మంచిది. ఇవి చర్మ మీద చనిపోయిన మృత కణాలని తొలగిస్తాయి. అదనపు నూనె రాకుండా నిలువరిస్తాయి.

కఠినమైన రసాయనాలు వద్దు: సహజమైన నూనెలు తొలగించేందుకు కఠినమైన రసాయనాలు ఆధారిత ఉత్పత్తులు నివారించాలు. ఇది ఉపయోగిస్తే జిడ్డు మరింత ఎక్కువ అవుతుంది.

సమతుల్య ఆహారం: పిత్త దోషాన్ని సమతుల్యం చేసే ఆహారాలు డైట్లో చేర్చుకోవాలి. ఇది జిడ్డుతో సంబంధం కలిగి ఉండే దోషం. దోసకాయ, పుదీనా, కొత్తిమీర, నెయ్యి వంటి శరీరానికి చలువ చేసే ఆహారాలు తీసుకుంటే మంచిది.

హెర్బల్ టీ: పుదీనా, చామోమిలీ లేదా కొత్తిమీర వంటి హెర్బల్ టీలు తాగాలి. ఇవి శరీరంలోని అధిక వేడిని సమతుల్యం చేయడానికి సహాయాపడతాయి. శీతలీకరణ లక్షణాలు కలిగి ఉంటాయి.

మాయిశ్చరైజర్: జోజోబా లేదా బాదం వంటి సహజ నూనెలను తక్కువ పరిమాణంలో ఫేస్ కి అప్లై చేసుకోవాలి. ఇవి నూనె వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా నియంత్రిస్తుంది.

ఆస్ట్రిజెంట్ మూలికలు: గులాబీ, హాజెల్, గంధపు చెక్క వంటి ఆస్ట్రిజెంట్ మూలికలతో చేసిన టోనర్లు లేదా ఫేస్ మాస్క్ లు వేసుకోవాలి. ఇవి చర్మ రంధ్రాలు బిగుసుకుపోయేలా చేసి జిడ్డుని తగ్గించడంలో సహాయపడతాయి.

హెర్బల్ ఫేస్ ప్యాక్: ముల్తానీ మట్టి, గంధపు చెక్క వంటి పదార్థాలతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే అదనపు నూనె తొలగిపోతుంది. చర్మ ఆకృతి మెరుగుపడుతుంది.

ఒత్తిడి తగ్గించుకోవాలి: ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యత కూడ చర్మం మీద జిడ్డుని ప్రేరేపిస్తుంది. అందుకే ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. అందుకోసం యోగా, మెడిటేషన్, శ్వాస వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి.

హైడ్రేట్: చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా ఉండాలంటే అన్నింటికంటే ముఖ్యమైనది హైడ్రేట్ గా ఉండటం. తగినంత ద్రవాలు తీసుకోవాలి.

స్పైసీ ఫుడ్ వద్దు: స్పైసీ, ఫ్రైడ్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల పిత్త దోషం ఎక్కువ అవుతుంది. దీని వల్ల జిడ్డు చర్మం వస్తుంది. ఇటువంటి పరిస్థితి అధిగమించేందుకు మొక్కల ఆధారిత డైట్ పాటించడం ముఖ్యం.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read; జాజికాయ తీసుకుంటే ఆరోగ్యానికి అంత మేలు జరుగుతుందా?

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Embed widget