Guinness World Records 2022: 2022లో ప్రజలను ఆశ్చర్యపరిచిన టాప్ 5 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఏంటో తెలుసా?
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అంటేనే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రపంచంలోని అరుదైన ఘటనలు గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతుంటాయి. 2022లో టాప్ 5 గిన్నిస్ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
రకరకాల ఫీట్లతో జనాలు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కుతారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తి నుంచి పొడవాటి గోర్లు కలిగి వ్యక్తి వరకు ప్రజలను ఆశ్చర్యపరిచిన అనేక ప్రపంచ రికార్డులు ఉన్నాయి. 2022 సంవత్సరంలో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టాప్ 5 ప్రపంచ రికార్డులు ఇవే.
1. సోమవారం 'వారంలో చెత్త రోజు'
వారంలో మొదటి రోజు అయిన సోమవారం ‘వారంలో చెత్త రోజు’గా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. వీకెండ్ తర్వాత పని చేసే తొలి రోజు కావడంతో చాలా మంది ఈ వారాన్ని ఇష్టపడరని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెల్లడించింది. అందుకే దీన్ని ’వారంలో చెత్త రోజు’గా పేర్కొంది.
we're officially giving monday the record of the worst day of the week
— Guinness World Records (@GWR) October 17, 2022
2. 24,679 వజ్రాల ఉంగరం
కేరళ స్వర్ణకారుడు తయారు చేసిన ఉంగరం గిన్నిస్ రికార్డు సాధించింది. ‘అమీ’ అని పిలిచే పుట్టగొడుగు మాదిరి ఉంగరాన్ని రూపొందించాడు. దీని కోసం 24,679 వజ్రాలను ఉపయోగించాడు. ప్రపంచంలోనే అత్యధిక వజ్రాలతో రూపొందించిన ఉంగరంగా ‘అమీ’ రికార్డు సాధించింది.
View this post on Instagram
3. పుస్తకాన్ని పబ్లిష్ చేసిన 5 ఏళ్ల బ్రిటిష్ అమ్మాయి
బెల్లా జే డార్క్ అనే ఐదేళ్ల చిన్నారి ఒక పుస్తకాన్ని ప్రచురించిన అతి పిన్న వయస్కురాలిగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిన్నారి రాసిన ‘ది లాస్ట్ క్యాట్’ అనే ఈ పుస్తకం 1,000 కంటే ఎక్కువ కాపీలు అమ్ముడయ్యాయి. ఒరెగాన్‌కు చెందిన పబ్లిషర్ జింజర్ ఫైర్ ప్రెస్ ఈ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తక రూపకల్పనలో చిన్నారికి ఆమె తల్లి సహకరించింది.
4. సైకిల్‌పై వెళ్తూ రూబిక్స్ క్యూబ్ సెట్ చేశాడు
సర్వజ్ఞ కులశ్రేష్ఠ అనే ఇండియన్ యువకుడు సైకిల్‌పై వెళ్తూ పజిల్ క్యూబ్‌ను సెట్ చేశాడు. సైకిల్ పై వెళ్తూ అత్యంత తక్కువ సమయంలో పజిల్ క్యూబ్ సెట్ చేసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సాధించాడు.
View this post on Instagram
5. అత్యధిక టాటూల అర్జెంటీనా జంట
అర్జెంటీనాకు చెందిన గాబ్రియేలా, క్టర్ హ్యూగో పెరాల్టా దంపతులు ఒంటి మీద అత్యధిక మార్పులు చేసుకున్న జంటగా రికార్డు సాధించారు. ఈ జంట తమ ఒంటిపై 98 టాటూలు, 50 బాడీ పియర్సింగ్‌లు, ఎనిమిది మైక్రోడెర్మల్‌లు, 14 బాడీ ఇంప్లాంట్లు, ఐదు డెంటల్ ఇంప్లాంట్లు, నాలుగు ఇయర్ ఎక్స్‌పాండర్‌లు, రెండు ఇయర్ బోల్ట్‌లు ఏర్పాటు చేసుకున్నారు.
View this post on Instagram
Read Also: ఇదేం వింత కోరిక బాబూ, తోడేలులా కనిపించడానికి అన్ని లక్షల ఖర్చా?