News
News
X

Charcoal Mask: జిడ్డు, మొటిమలతో విసిగిపోయారా? బొగ్గు పొడితో ఇలా చేయండి

జిడ్డు, మొటిమల వల్ల అందరూ ఇబ్బందులు పడుతూనే ఉంటున్నారు. కానీ వాటి నుంచి బయటపడేందుకు ఈ చక్కటి పరిష్కారం మీ కోసం..

FOLLOW US: 
Share:

వర్షాకాలం వచ్చిందంటే చర్మాన్ని కాపాడుకోవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. తేమ వాతావరణం కారణంగా మొహం జిడ్డుగా మారిపోవడం, మితిమాలు, చికాకు కలిగించే ముఖ్యం, స్కాల్ఫ్ పై జిడ్డు పేరుకుపోవడం వంటి వాటి వల్ల చిరాకుగా అనిపిస్తుంది. ఇక బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, చర్మం నిస్తేజంగా మారిపోవడం సర్వ సాధారణమే. కాలుష్యం కారణంగా టాక్సిన్స్ తో రంద్రాలు మూసుకుపోతాయి. దీని వల్ల మొటిమల బారిన పడిపోవడం జరుగుతుంది. వాటిని పోగొట్టుకునేందుకు ఈ సింపుల్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అదే బొగ్గు పొడితో ఫేస్ ప్యాక్. ఇది వేసుకోవడం వల్ల చర్మం శుభ్రపడతామే కాదు మీ మొహం బిగుతుగా కనిపించేలా చేస్తుంది. మృత కణాలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించడానికి మీరు ఈ చార్ కోల్ మాస్క్ ట్రై చేసి చూడండి.

బొగ్గు సహజ సిద్ధమైనది రసాయనాలు లేకుండా స్వచ్చంగా ఉంటుంది. టాక్సిన్స్ తో మూసుకుపోయిన రంధ్రాలు, దుమ్ము, ధూళిని, నూనెని గ్రహించి తొలగించేందుకు సహకరిస్తుంది. ఈ మాస్క్ డీప్ క్లెన్సర్, డిటాక్సీ ఫైయర్ గా అద్భుతంగా పని చేస్తుంది. బొగ్గు పొడితో మాస్క్ వేసుకోవడం వల్ల మృత కణాలు తొలగిపోయి చర్మం ఎక్స్ ఫోలియేట్ అయ్యేలా చేస్తుంది.

బొగ్గు పొడి ప్యాక్ వల్ల ప్రయోజనాలు

❂ బొగ్గుపొడితో ఫేస్ వేసుకోవడం వల్ల చర్మం నుంచి విషాన్ని గ్రహించి, మలినాలను బయటకి తీస్తుందని నిరూపించబడింది. అందుకే తేమతో కూడిన రుతుపవనాల సమయంలో చర్మం ఎదుర్కొనే ప్రధాన సమస్య ఒకటి జిడ్డు కారణంగా రంధ్రాలు మూసుకుపోతాయి. వాటిని ఈ ప్యాక్ తొలగించేస్తుంది.

❂ చర్మంలోని సెబమ్ ని నియంత్రించడానికి శీఘ్ర పరిష్కారం ఇది. మొటిమలు లేదా స్కిన్ బ్రేక్ అవుట్స్‌ను నివారిస్తుంది.

❂ ఈ మాస్క్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. దీని వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

❂ బొగ్గుపొడి మాస్క్ వేసుకోవడం వల్ల డీప్ క్లెన్సింగ్ రంద్రాల ద్వారా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తొలగించడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో క్రమం తప్పకుండా దీన్ని ఉపయోగించడం వల్ల వాటిని రాకుండా అడ్డుకోవచ్చు,

❂ ఈ పొడితో చేసిన మాస్క్ వేసుకోవడం వల్ల చర్మం చల్లగా, శక్తివంతమైన మెరుపుతో నిగనిగలాడుతుంది.  బొగ్గులో యాంటీ ఫంగల, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని పురుద్ధరించడంలో సహాయపడుతుంది.

❂ ఇవి సెబామ్ ఉత్పత్తిని తగ్గించి చర్మం నుంచి టాక్సిన్స్, కాలుష్య కారకాలని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది సూక్ష్మ జీవులని ఆకర్షిస్తుంది. మొటిమలు తగ్గించి చర్మం పొడిగా ఉంచేందుకు సహకరిస్తుంది.

❂ సున్నితమైన చర్మానికి కూడా ఇది చాలా బాగుంటుంది. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మొహం మంచి గ్లో ఇస్తుంది. ఇవి వేసుకోవడం వల్ల అలర్జీ వంటివి వస్తాయని అపోహ ఉంది. కానీ అటువంటివి ఏవి ఉండవని బ్యూటీషియన్స్ చెప్పుకొచ్చారు.

❂ జిడ్డు మొహం, మచ్చలు ఉన్న చర్మం వాళ్ళకి ఇది చాలా అనువైనది. మీ ముఖంలో సాధారణం కంటే ఎక్కువగా నూనె ఉత్పత్తి చేస్తే ఈ మాస్క్ ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also read: ఉదయం పూట ఈ పానీయాలు తాగితే కొవ్వు కరగడం ఖాయం

Also read: దీర్ఘకాలం పాటూ గర్భనిరోధకాలు వాడడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

Published at : 27 Sep 2022 11:32 AM (IST) Tags: Skin Care Tips Beauty tips Charcoal mask Charcoal Mask Benefits Advantages Of Charcoal Mask Charcoal Mask Uses

సంబంధిత కథనాలు

Soya Beans: సోయాబీన్స్‌తో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చా? ఏ విధంగా తీసుకోవాలి?

Soya Beans: సోయాబీన్స్‌తో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చా? ఏ విధంగా తీసుకోవాలి?

AP News : సైకిల్ పై దేశవ్యాప్తంగా యాత్ర - రూ. 10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ !

AP News : సైకిల్ పై దేశవ్యాప్తంగా యాత్ర - రూ. 10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ !

Weight Gain: బరువు పెరగాలా? అయితే ఈ ఆహారాలు మీ డైట్లో చేర్చుకోండి

Weight Gain: బరువు పెరగాలా? అయితే ఈ ఆహారాలు మీ డైట్లో చేర్చుకోండి

బ్రెయిన్ స్ట్రోక్ భయం వెంటాడుతోందా? మీ మొబైల్‌తో ఆ ముప్పును ముందే కనిపెట్టేయొచ్చు!

బ్రెయిన్ స్ట్రోక్ భయం వెంటాడుతోందా? మీ మొబైల్‌తో ఆ ముప్పును ముందే కనిపెట్టేయొచ్చు!

HeadPhones: హెడ్ ఫోన్స్ అధికంగా వాడుతున్నారా? అయితే మెదడు, గుండెకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు

HeadPhones: హెడ్ ఫోన్స్ అధికంగా వాడుతున్నారా? అయితే మెదడు, గుండెకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్‌ వేసుకొని భర్తతో కాపురం!

Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్‌ వేసుకొని భర్తతో కాపురం!