Morning Tiredness Tips : బద్ధకంగా ఉంటోందా? రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు ఈ 5 టిప్స్ ఫాలో అయిపోండి
ఏ పని మీద ధ్యాస లేకపోవడం, ఉన్న చోటు నుంచి కదలకపోవడం, పని ఉన్నా చేసే మూడ్ లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వీటిని ఫాలో అయిపోండి.

Morning Routine for Productivity : ఉదయాన్నే నిద్రలేచినప్పటి నుంచి బయటకు వెళ్లినా, జాబ్ చేసినా, ఇతర ఏ పనులు చేసినా బద్ధకంగా ఉంటుందా? అయితే మీ లైఫ్స్టైల్లో మార్పులు చేయాల్సిన సమయం వచ్చింది. ప్రపంచంతో పాటు పరుగులెత్తాల్సిన అవసరం లేదు కానీ.. మీరు చేయగలిగే పనిని.. మీరు చేయగలిగే సత్తా ఉన్నా.. బద్ధకంతో చేయలేకపోతున్నారంటే.. మీ శరీరాన్ని రీసెట్ చేయాలని అర్థం. ఇప్పటికీ దానిని రియలైజ్ అవ్వకపోతే మీరు అన్నింట్లోనూ వెనకబడాల్సి వస్తుంది.
జీవనశైలిలో మార్పులు చేసి.. మీ పని మీరు చేసుకోగలిగేంత యాక్టివ్‌గా ఉండేందుకు ఎక్కువ మార్పులు చేయాల్సిన అవసరమేమి లేదు. కేవలం 5 సింపుల్ మార్పులు మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచడమే కాకుండా.. బద్ధకాన్ని దూరం చేస్తూ.. మైండ్‌ను షార్ప్‌గా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. ఇంతకీ ఆ టిప్స్ ఏంటి? వాటితో కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
నిద్ర
మీరు సరిగ్గా నిద్రపోతే రోజంతా బద్ధకంగానే ఉంటుంది. బ్రెయిన్ ఫాగ్‌తో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేనా యాక్టివ్‌గా ఉండలేరు. బ్రెయిన్ సరిగ్గా పని చేయదు. దీనివల్ల మీరు చేసే పనిలో వెనకపడడమే కాకుండా.. ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కాబట్టి ముందుగా మీరు మీ నిద్రను ఫిక్స్ చేసుకోవాలి.
మీ శరీరానికి మీరు తగినంత రాత్రి నిద్రను అందిస్తే అది రీసెట్ అయి మీరు యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. కాబట్టి రాత్రుళ్లు పడుకునే గంట ముందు మీ నిద్రను ఇబ్బందిపెట్టే వాటికి దూరంగా ఉండండి. అలాగే రూమ్ మీకు తగిన ఉష్ణోగ్రతతో ఉండేలా సెట్ చేసుకోండి. డార్క్‌గా ఉంటే త్వరగా నిద్ర పడుతుంది. నిద్రకు రెండు గంటల ముందు భోజనం ముగిస్తే మంచిది. రోజు రాత్రి ఒకే టైమ్‌కి పడుకోవడం, ఒకే టైమ్‌కి నిద్రలేవడం చేస్తే మంచి ఫలితాలుంటాయి.
నిద్రలేచాక
ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మీ శరీరానికి ఓ గ్లాసు నీరు అందించండి. ఒకేసారి కాకుండా చిన్న చిన్నగా సిప్ వేస్తూ తాగండి. అలాగే ఉదయాన్నే చల్లని నీటితో స్నానం చేయడం వల్ల కూడా శరీరం యాక్టివ్ అవుతుంది. చురుకుగా ఉంటారు.
వ్యాయామం
ఉదయం నిద్రలేచిన తర్వాత వ్యాయామం చేయకపోయినా బెడ్ మీదనే కొన్ని సింపుల్ స్ట్రెచ్‌లు చేయండి. దీనివల్ల బాడీ కాస్త ఫ్రీ అవుతుంది. మీకు టైమ్ ఉంటే జాగింగ్ చేయడం లేదా సైక్లింగ్ కూడా చేయవచ్చు. వీటిని రెగ్యులర్‌గా చేయడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. వీలైనంత త్వరగా రిజల్ట్స్ వస్తాయి.
బ్రేక్‌ఫాస్ట్
ఉదయాన్నే షుగర్‌తో కూడిన ఫుడ్స్ జోలికి వెళ్లకూడదు. ఇవి శరీరంలో గ్లూకోజ్ డ్రాప్ చేసి.. నీరసంగా, బద్ధకంగా ఉండే ఫీల్ ఇస్తాయి. కాబట్టి ఫైబర్, ప్రోటీన్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే మంచిది. కార్బ్స్‌తో నిండిన ఫుడ్స్ ఫటిగో వంటి ఇబ్బందులను ఇస్తుందట. లో-కార్బ్ డైట్ అయితే మంచిదని చెప్తున్నారు.
కెఫిన్
టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటే వీలైనంత వరకు దూరంగా ఉండండి. లేదంటే తగ్గించండి. ఎందుకంటే బద్ధకంగా అనిపించినా.. నీరసంగా అనిపించినా చాలామంది కెఫిన్ తీసుకుంటారు. అయితే దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. నిద్ర దూరమైతే రోజంతా బద్ధకంగా ఉంటుంది. అదే సమస్య రిపీట్ అవుతుంది. కాబట్టి కెఫిన్‌ను కట్ చేయండి.
ఈ టిప్స్ రెగ్యులర్‌గా ఫాలో అయితే బద్ధకం, సోమరితనం అన్ని దూరమైపోతాయి. బ్రెయిన్ షార్ప్‌గా ఉంటుంది. పనిలో కూడా చురుకుగా ఉంటారు.






















