Tips to Staying Active : రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు.. మీ రోటీన్లో వీటిని చేర్చుకోండి
Fitness Goals : రోజంతా మీరు యాక్టివ్‌గా ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి. ఇవి మీరు రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి.
Healthy Routine to Stay Fit and Active : నిద్రలేచిన వెంటనే కాస్త బద్ధకంగా ఉంటే పర్లేదు కానీ.. కొందరు రోజంతా బద్ధకంగానే ఉంటారు. చేయాల్సిన పని ఎంత ఉన్నా సరే.. పర్లేదులే తర్వాత చేసుకుందాం అనే రేంజ్‌లోకి వెళ్లిపోతారు. కానీ యాక్టివ్‌గా ఉండడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? పనులు సమయానికి అయిపోతాయి. దీనివల్ల మీకు ఎక్కువ సమయం ఆదా అవుతుంది. ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత ఫిట్‌గా ఉంటారు. అంతేకాకుండా ఇది మానసిక స్థితిపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఉదయాన్నే ఈ బద్ధకాన్ని వదిలించుకునేందుకు మీరు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇవి మీ శారీరక, మానసిక శ్రేయస్సులో కీలకపాత్ర పోషిస్తాయి.
ఓపిక లేదు అనుకుంటే..
రెగ్యూలర్ వ్యాయామం కచ్చితంగా మీరు యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. అయితే మీకు వ్యాయామం చేసే ఓపిక, ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఫోన్ చూడకుండా లేచి ఫ్రెష్ అయిపోండి. అనంతరం ఇంటి పనులు చేసుకోండి. మంచి పాటలు పెట్టుకుని పనులు పూర్తి చేసుకోండి. మెట్లు ఎక్కడం, బరువులు ఎత్తడం వంటి కొన్ని పనులు చేయవచ్చు. లేదంటే హాయిగా పాటలు పెట్టుకుని కొంతసేపు డ్యాన్స్ చేయవచ్చు. ఇవి మీరు రోజంతా యాక్టివ్‌గా ఉండేలా హెల్ప్ చేస్తాయి.
ట్రాక్ చేయండి..
మీరు మీ ఫోన్లో ఫుట్ కౌంట్‌ను ట్రాక్ చేయడానికి ఏదైనా యాప్‌ను డౌన్లోడ్ చేయండి. ఇది మీరు ఎక్కువ నడిచేలా చేయడంలో హెల్ప్ చేస్తుంది. తద్వారా మీరు యాక్టివ్‌గా ఉంటారు. రోజుకో పదివేల అడుగులు వేయాలనుకోండి.. దానిని ట్రాక్ చేస్తూ ఎన్ని అయ్యాయి అనే కుతూహలం పెరుగుతుంది. లేదంటే మీరు రిస్ట్ బ్యాండ్స్ కూడా నడకను ట్రాక్ చేసేందుకు ఉపయోగించవచ్చు. బయట మీకు నడవడం కుదరకపోతే.. ఇంటికి వచ్చాక సాయంత్రం వాటిని కంప్లీట్ చేయండి. ఇది మీరు ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇంకా ఉత్సాహాంగా చేసేందుకు మీ ఫ్రెండ్స్‌తో కలిసి ఈ ట్రాకర్‌ను ఫాలో అవ్వండి. ఇద్దరూ కలిసి వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నించండి.
జిమ్‌కి వెళ్లకుంటే..
మీకు జిమ్‌కి వెళ్లాలని లేకుంటే వర్చువల్ ఫిట్నెస్ క్లాస్‌లకు అటెండ్ కావొచ్చు. టీవీ, ల్యాప్‌టాప్ ముందు హాయిగా వాటిని వింటూ.. చూస్తూ.. వ్యాయామం చేయొచ్చు. ఇంట్లో మీరు జుంబా, ఏరొబిక్స్ వంటి క్లాసులు మీకు బోర్ కొట్టకుండా హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. యూట్యూబ్‌లలో ఎన్నో ఫిట్నెస్ క్లాస్‌లు ఉంటాయి. ఇవి మీరు యాక్టివ్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి.
సైక్లింగ్
వాతావరణ, ఆరోగ్యం అనుకూలిస్తే మీరు సైక్లింగ్‌ను ఎంచుకోండి. లేదంటే ఇండోర్ సైక్లింగ్ కూడా చేయొచ్చు. ఇది కేవలం ఉదయాన్నే హెల్త్ కోసం చేసేది కాకుండా.. మీరు మార్కెట్‌కు లేదా ఉద్యోగాలకు, కళాశాలలకు వెళ్లేందుకు దీనిని వినియోగించవచ్చు. ఇది మీరు గమ్యస్థానానికి చేరుకోవడంలోనే కాకుండా.. మీరు హెల్తీగా ఉండడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
మీరు ఇలాంటి రోటీన్‌ను ఫాలో అయితే.. కచ్చితంగా మీరు యాక్టివ్‌గా, ఫిట్‌గా ఉంటారు. అన్ని విషయాలు మనకు అనుకూలించనప్పుడు.. ఇలాంటి చిన్నచిన్న మార్పులతో ఎక్కువ ఇంపాక్ట్ పొందవచ్చు.
Also Read : ఆ సమస్యలున్నవారు పసుపునకు దూరంగా ఉండాలట.. ఎందుకంటే