అన్వేషించండి

మెరిసే చర్మం కావాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు

పండగలు, ప్రత్యేక సమయాల్లో మరింత కనిపించాలని అందరూ అనుకుంటారు. అలా కనిపించాలంటే ముందుగా కావల్సింది అందమైన చర్మం. మరి అలాంటి చర్మ సౌందర్యానికి కొన్ని చిన్న జాగ్రత్తలు చాలు

పండగల సీజన్ మొదలైంది. ఇక రకరకాల ఈవెంట్లు ఉంటూనే ఉంటాయి. ఈ ఈవెంట్లలో ప్రత్యేకంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ఎంత అందమైన దుస్తులు, నగలు ధరించినా సరే చర్మపు మెరుపు తగినంత లేకపోతే మొత్తం ఆహార్యమే చెడిపోయిన భావన కలుగుతుంది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అలా జరగకూడదంటే చర్మం కేవలం పైన మెరిస్తే సరిపోదు. ఆరోగ్యవంతమైన మెరిసే చర్మం తోనే నిజమైన అందం సాధ్యపడుతుంది. మరి మెరిసే చర్మానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా? కొన్ని చిట్కాలు అందాన్ని పెంచితే కొన్ని లోపలి నుంచి ఆరోగ్యాన్ని అందించేవి కొన్ని.

ఆహారం, హైడ్రేషన్

చర్మ అందం  ప్రధానంగా సరైన ఆహారం, హైడ్రేషన్‌పై ఆధారపడుతుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి అవసరమయ్యే పిండిపదార్థాలు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి. తగినన్ని నీళ్లు తప్పకుండా తాగాలి. శరీరంలో నీటి శాతం తగ్గితే డీహైడ్రేషన్ అవుతుంది. ఫలితంగా చర్మంలో తేమ తగ్గిపోయి డల్ గా మారుతుంది. కనుక తగినన్ని, నీళ్లు ప్లూయిడ్లు తీసుకోవాలి.

శుభ్రత, మాయిశ్చరైజింగ్

రోజుకి కనీసం రెండు సార్లు తప్పనిసరిగా సున్నితమైన క్లెన్జర్‌తో ముఖం కడుక్కోవాలి. ముఖం మీద చేరిన మలినాలను తొలగిస్తుంది. ముఖం శుభ్రం చేసుకున్న ప్రతి సారీ చర్మానికి సరిపడే మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. మాయిశ్చరైజర్ చర్మం త్వరగా తేమ కోల్పోకుండా నిరోధిస్తుంది. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది.

సన్ ప్రోటెక్షన్

సూర్యరశ్మి లోని నీలలోహిత కిరణల వల్ల చర్మం డల్‌గా మారే ప్రమాదం ఉంటుంది. చర్మానికి హాని చేసే సూర్యకాంతి నుంచి రక్షించేందుకు ఎస్పీఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువ కలిగిన సన్‌స్క్రీన్‌ను ప్రతి రోజూ వాడటం ద్వారా UV రేడియేషన్ నుంచి చర్మాన్ని రక్షించుకోవాలి. కనుక తప్పకుండా ఇంట్లోనే ఉన్నా సరే మనం వాడే ఫోన్లు ఇతర స్క్రీన్ల నుంచి వెలువడే బ్లూ లైట్ కూడా చర్మానికి హాని చేస్తుంది. కనుక సన్ స్ర్కీన్ ను తప్పకుండా ఉఫయోగించాలి.

రెగ్యులర్ ఎక్స్‌ఫోలియేషన్

చర్మం పై ఉండే మృత కణాల వల్ల కూడా చర్మం సహజమైన తన మెరుపును కోల్పోతుంది. వీటిని తొలగించడం చాలా ముఖ్యం. అందుకోసం వారానికి రెండు సార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయడం ముఖ్యం. ఫలితంగా  నూతన కణాల ఉత్పత్తి  పెరుగుతుంది. కొత్త చర్మ కణాలతో చర్మం మెరుపు సంతరించుకుంటుంది. అయితే ఈ ప్రక్రియ కోసం మృదువైన ఎక్స్‌ఫోలియేటర్ ను లేదా నేచురల్ స్క్రబ్బర్లను ఉపయోగించడం మంచిది.

తగినంతనిద్ర

ఆహారం, చర్మ సంరక్షణ మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన చర్మం కోసం తగినంత నిద్ర అవసరం. రాత్రికి కనీసం 7-8 గంటల నిద్ర ఉంటేనే చర్మం ఆరోగ్యకరంగా మెరుస్తుంది. నిద్ర సమయంలో శరీరం రిపేర్ మోడ్‌లో ఉంటుంది. ఈ రిపేర్  చర్మ కణాలకు కూడా జరుగుతుందని మరచిపోవద్దు.

స్ట్రెస్ మేనేజ్‌మెంట్

ఒత్తిడి శరీరంలో ఏజింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఏజింగ్ మొదట ప్రభావితం చేసే అవయవం చర్మం అని చెప్పలి. మెడిటేషన్, యోగా, మరియు వ్యాయామం వంటి రీలాక్సేషన్ టెక్నిక్‌లను అనుసరించడం వల్ల  చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Pushpa 2: ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Pushpa 2: ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
Anantapuram News: అమ్మా నాన్న క్షమించండి అంటూ ఫోన్ కాల్ - ఎంబీబీఎస్ సీటు రాలేదని రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య
అమ్మా నాన్న క్షమించండి అంటూ ఫోన్ కాల్ - ఎంబీబీఎస్ సీటు రాలేదని రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
Pushpa 2 Collection: ఇండియన్  బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
Crime News: ఒకే రోజు 2 ఘోర ప్రమాదాలు - 12 మంది దుర్మరణం, యూపీలో తీవ్ర విషాదం
ఒకే రోజు 2 ఘోర ప్రమాదాలు - 12 మంది దుర్మరణం, యూపీలో తీవ్ర విషాదం
Embed widget