Air Pollution: ఈ ఉద్యోగాలు చేసేవారే అధికంగా గాలి కాలుష్యానికి గురవుతున్నారు
గాలి కాలుష్యం ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది.
Air Pollution: దేశంలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. కేవలం ఈ కాలుష్యం కారణంగానే ఎంతోమంది ఆసుపత్రుల పాలవుతున్నారు. అనేక రకాల రోగాలు వీరిపై దాడి చేస్తున్నాయి. అయితే అన్ని వృత్తులలో కన్నా అధికంగా గాలి కాలుష్యానికి గురవుతున్న ఉద్యోగులు ఎవరో చెప్పింది ఒక అధ్యయనం. చింతమ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ యాక్షన్ గ్రూప్ వారు ఈ అధ్యాయనాన్ని నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులు, చెత్తను సేకరించేవారు, సెక్యూరిటీ కార్డులు అధికంగా వాయు కాలుష్యానికి గురవుతున్నట్టు తేలింది. దేశంలో 97% మంది పారిశుధ్య కార్మికులు, 95% మంది చెత్తను ఏరు తీసుకెళ్లేవారు, 82 శాతం మంది సెక్యూరిటీ గార్డులు వృత్తిపరంగా వాయు కాలుష్యానికి గురవుతున్నట్టు ఈ పరిశోధన చెబుతోంది. దీనివల్ల వారిలో శ్వాసకోవ వ్యాధులు వచ్చే అవకాశం అధికంగా ఉన్నట్టు వివరిస్తోంది.
ఈ అధ్యయనం ప్రకారం 60 శాతం కంటే ఎక్కువ మంది పారిశుద్ధ్య కార్మికులకు, 50 శాతం మంది చెత్తను సేకరించే వారికి, 30 శాతం మంది సెక్యూరిటీ గార్డులకు PPE కిట్ల గురించి తెలియదని చెబుతోంది ఈ పరిశోధన. వాయు కాలుష్యానికి గురవ్వకుండా కాపాడతాయి. ఆ కిట్లు వేసుకోవడం వల్ల వాయు కాలుష్యం నుంచి తప్పించుకోవచ్చు. కానీ ఆ కిట్లు వాడుతున్న వారి సంఖ్య చాలా తక్కువ. అందుకే వారు అధికంగా గాలి కాలుష్యం బారిన పడుతున్నారు.
75 శాతం మంది చెత్తను సేకరించే వారిలోనూ, 86 శాతం మంది పారిశుద్ధ్య కార్మికుల్లోనూ, 86 శాతం మంది సెక్యూరిటీ గార్డుల్లోను ఊపిరితిత్తుల పనితీరు సమస్యలు ఉన్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. వారి ఊపిరితిత్తులు అసాధారణంగా పనిచేస్తున్నాయని అధ్యయనం చెప్పింది. అంటే భవిష్యత్తులో వీరికి ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నట్టు చెబుతోంది ఈ పరిశోధన. ఈ మూడు ఉద్యోగాలు చేసే వారికి గాలి కాలుష్యం నుంచి తప్పించుకునే చిట్కాలను చెప్పవలసిన అవసరం ఉందని అధ్యయనం సూచిస్తోంది. ముక్కు, గొంతులోకి చేరిన ధూళి కణాలు సమర్థవంతంగా తొలగించడానికి డ్యూటీ అయిపోయిన తర్వాత నీటితో గార్గిలింగ్ చేయడం అవసరం. వారు పనిచేసే ప్రదేశంలో చేతులు, ముఖం కడుక్కోవడానికి వారికి కావాల్సిన సౌకర్యాలను ఇప్పించాలని చెబుతోంది.
Also read: ఆ నది నిండా బంగారమే, గుప్పెడు ఇసుకలోను ఎంతో కొంత బంగారం దొరికే ఛాన్స్
Also read: జ్ఞాపకశక్తిని పెంచే అద్భుత ఆయుర్వేద మూలిక ఇదే, పిల్లలకు తినిపిస్తే చదువులో దూసుకెళ్తారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.