By: Haritha | Updated at : 18 Apr 2023 10:16 AM (IST)
(Image credit: Pexels)
అనేక ఆరోగ్య సమస్యల్లో ఈటింగ్ డిజార్డర్ కూడా ఒకటి. దీని బారిన పడిన వాళ్ళు సాధారణంగానే కనిపిస్తారు. కానీ వారు తినేటప్పుడే వారి రుగ్మత గురించి బయటపడుతుంది. ఈ తినే రుగ్మత బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. వారి తినే అలవాట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. అవి అనేక శారీరక మానసిక సమస్యలకు కారణంగా మారుతాయి. ఈటింగ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చికిత్స చేయించుకోవాలి.
ఫ్రెంచ్‌కు చెందిన ఓ మహిళ ఈటింగ్ డిజార్డర్‌తో బాధపడుతోంది. ఆమె రోజు కిలో వెన్న తింటూ, లీటర్ నూనె తాగేస్తోంది. ఇలా కొన్ని సంవత్సరాలుగా చేసోంది. వీటితో పాటు చాక్లెట్లు, నూనెలో వేయించిన వేపుళ్లు కూడా అధికంగా తింటోంది. ఇలా తినడం వల్ల తనకు మానసిక ఆందోళన తగ్గుతోందని, అందుకే తింటున్నానని చెబుతోంది. ఆమె వయసు 24 ఏళ్లు. ఆమె ఈటింగ్ డిసార్డర్ కు ఎలాంటి చికిత్స తీసుకోకపోగా, తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఇలానే కొనసాగిస్తానని చెబుతోంది. సోషల్ మీడియాలో ఈమె గురించి షేర్ అవుతూ వస్తోంది.
ఏమిటి ఈ తినే రుగ్మత?
‘బింగే ఈటింగ్ డిసార్డర్’... ఇది ఒక మానసిక వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారు తమని తాము నియంత్రించుకోలేరు. అధిక మొత్తంలో ఆహారాన్ని తింటూనే ఉంటారు. ఎంత తింటున్నారో కూడా వారికి తెలియదు. అతిగా తినేసి వాంతులు, వికారం బారిన పడతారు. తినే ఆహారం అధికమైతే ఊబకాయం బారినపడి అనేక రోగాలు వస్తాయి. మానసికంగాను వీరు కుంగిపోతారు. ఇలా అతిగా తినే జబ్బు ఉంటే వెంటనే మానసిక వైద్యులను కలవడం ఉత్తమం.
లక్షణాలు ఎలా ఉంటాయి?
బింగె ఈటింగ్ డిసార్డర్ లక్షణాలు ఎక్కువగానే ఉన్నాయి. సాధారణంగా ఈ వ్యాధి బారిన పడినవారు అతిగా తింటారు. బరువు పెరుగుతున్నామన్న స్పృహ వారికి ఉండదు. అధికంగా తిన్నాక ‘అయ్యో అనవసరంగా ఎక్కువ తినేసామే’ అని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇతరులతో కలిసి తినడానికి ఇష్టపడరు. తాము ఒంటరిగా కూర్చుని తింటూ ఉంటారు. నిర్దిష్టమైన పాత్రలను మాత్రమే వాడతారు. రోజుకో పాత్ర వాడడం వారికి నచ్చదు. తినేశాక వాంతులు చేసుకుంటారు లేదా తిన్న వెంటనే బాత్రూంకి వెళ్తారు. మానసిక ఆందోళన బారిన పడతారు. ఎప్పుడూ చిరాగ్గా ఉంటారు. భోజనం తింటున్నప్పుడు తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇలాంటి వారికి ఏకాగ్రత ఉండదు. త్వరగా అలసిపోతారు. తల తిరగడం వంటివి కలుగుతాయి. వ్యాయామం కూడా విపరీతంగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ బింగే ఈటింగ్ డిజార్డర్ లక్షణాలు. వీటిలో రెండు మూడు ఉన్నా కూడా వెంటనే వైద్యులను కలవడం ఉత్తమం.
Also read: ఆరేళ్ల బాలికకు వింత వ్యాధి, ఈమె శ్వాస తీసుకోవడం మర్చిపోతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!
Children Health: పిల్లలకి ఫీవర్‌గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయొద్దు
Heatstroke: సమ్మర్ స్ట్రోక్ నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా మెనూలో చేర్చుకోవాల్సిందే
Skipping Meals: భోజనం మానేస్తున్నారా? దానివల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Pregnant Travel Tips: గర్భిణీలు ప్రయాణాలు చేయొచ్చా? ఒకవేళ చేయాల్సి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!
GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12