Fat Burn Food: నోరూరించే ఈ కుకీస్ తిన్నారంటే శరీరంలోని మొండి కొవ్వు కరగాల్సిందే
బరువు తగ్గడం కోసం ఇష్టమైన పదార్థాలు తినకుండా నోరు కట్టేసుకోవాల్సిన పని లేదు. ఎంతో రుచికరమైన ఈ పదార్థాలు తింటూ బరువు తగ్గవచ్చు.
ఆరోగ్యంగా, ఫిట్ గా మారేందుకు బరువు తగ్గించే పని మొదలు పెట్టాలని చాలా మంది అనుకుంటారు. ఆరంభంలో ఉత్సాహంగా ఉంటుంది. కానీ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలంటేనే కష్టంగా అనిపిస్తుంది. బరువు తగ్గాలనుకునే నిర్ణయం మారిపోతుంది. అలా కాకుండా ఉండాలన్నా, శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వుని కరిగించాలన్నా ఈ ఆహార పదార్థాల వంటకాలు చాలా ఉపయోగపడతాయి. నోటికి కమ్మని రుచి ఇస్తాయి, అలాగే శరీరానికి మంచి ఆకృతి అందిస్తాయి. మీరు కోరుకున్నట్టు బరువు తగ్గిపోతారు. అవేంటంటే..
అరటి, నువ్వుల కుకీలు
ఈ కుకీలు గ్లూటెన్ ఫ్రీ, చక్కెర లేదా పిండిని కలిగి ఉండవు.. చాలా సింపుల్ గా ఈ రెసిపీ చేసుకోవచ్చు. అద్భుతమైన రుచి, సూపర్ హెల్తీగా ఉంటాయి. ఇందుకోసం ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు.
కావలసినవి: 1 అరటి పండు, 1 కప్పు నువ్వులు
తయారీ విధానం
ముందుగా అరటిపండు తొక్క తీసి ఒక గిన్నెలో వేసి బాగా మగ్గించాలి. దీనికి వేయించిన్ నువ్వులు వేసి రెండింటినీ కలపాలి. ఇప్పుడు బేకింగ్ తేని తీసుకుని దానిలో పార్చమెంట్ పేపర్ తో లైన్ చేయాలి. ఈ కుకీ మిసత్రం చిన్న భాగాలుగా బేకింగ్ ట్రేలో పోయాలి. వాటిని 350 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ధ 20-25 నిమిషాల పాటు బేకింగ్ చేసుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా రుచికరమైన కుకీస్ రెడీ అయిపోయినట్టే. మొత్తం లాగించేయకండి పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి.
గుడ్లు, అరటి పాన్ కేక్
ఈ రెసిపీ ఆరోగ్యకరమైనది. ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. బరువు తగ్గడానికి అనుకూలమైనది.
కావలసినవి: 4 గుడ్లు, 2 పండిన అరటిపండ్లు
తయారీవిధానం
మిక్సింగ్ బౌల్ తీసుకుని అరటి పండ్లు మెత్తగా చేసుకుని అందులో వేసుకోవాలి. అదే గిన్నెలో గుడ్లు పగలగొట్టి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ స్టవ్ మీద పెట్టుకుని మీడియం మంట మీద వేడి చేసుకోవాలి. దాని మీద కొద్దిగా నూనెతో కోటింగ్ వేసుకోవాలి. పాన్ కేక్ పిండిని చిన్న మొత్తంలో వేసుకోవాలి. రెండు వైపుల నుంచి ఉడికించుకోవాలి.
తేనె, దాల్చిన చెక్క పానీయం
తేనె, దాల్చిన చెక్కతో తయారుచేసిన ఈ పానీయం బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క శరీరంలో లిపిడ్ విచ్చిన్నతను మెరుగుపరుస్తుంది. ఈ పానీయాన్ని ఉదయాన్నే తాగితే మంచిది. కొవ్వుని కరిగించేస్తుంది.
కావలసినవి: ఒక చిటికెడు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ తేనె
తయారీ విధానం
కప్పున్నర నీటిని తీసుకుని బాగా మారిగించుకోవాలి. అందులో దాల్చిన చెక్క పొడి వేసుకుని మరిగించుకుని పక్కన పెట్టుకోవాలి. 10-20 నిమిషాలు పక్కన పెటుకుని ఆరబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి అందులో టీ స్పూన్ తేనె కలపాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగేయండి.
ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకుని క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే బరువు తగ్గింపు ఫలితాలు పొందాలంటే తగినంత నిద్ర కూడా కావాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మీకు మధుమేహం ఉందా? అయితే హైపోగ్లైసిమియా రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి