అన్వేషించండి

Diabetes: మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేనట్టే

మధుమేహులకి షుగర్ లెవల్స్ అదుపులోనే ఉండాలి. అవి విపరీతంగా పెరిగితే వచ్చే ప్రమాదాలు తీవ్రంగా ఉంటాయి.

ధుమేహం రాకుండా జాగ్రత్త పడాలి. ఒక్కసారి వచ్చిందంటే మాత్రం దానితో జీవితాంతం ప్రయాణం చేయాల్సిందే. డయాబెటిస్ వల్ల తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. వాటిని సాధారణ స్థితికి తీసుకురాలేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడానికి తమ వంతు కృషి చేస్తారు. కానీ కొన్ని సార్లు అవి అదుపులోకి రావు. వాటిని నియంత్రించడానికి ఉన్న మార్గాలు.. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం. సమతుల్య ఆహారం తీసుకోవడం. రెగ్యులర్ గా వ్యాయామం చెయ్యడం.

శరీరంలో బ్లడ్ సుగర్ స్థాయిలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడం అంత ఈజీ కాదు. అయితే, శరీరంలో కనిపించే కొన్ని మార్పులు, లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. చక్కెర స్థాయిలు పెరిగినా, తగ్గినా.. మీలో ఈ సంకేతాలు కనిపిస్తాయి.

ఆకలి ఎక్కువ, బరువు తక్కువ

రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు ఉన్నపుడు చాలా మంది సాధారణం కంటే ఆకలి ఎక్కువగా ఉంటుంది. మెడ్ లైన్ ప్లస్ ప్రకారం ఈ లక్షణాన్ని పాలిఫాగియా అంటారు. ఆహారం సరిపడినంత తిన్నా కూడా బరువు తగ్గిపోతూనే ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఆహారం తీసుకున్నా శరీరానికి తగినంత శక్తి లభించనందున గ్లూకోజ్ కొవ్వుగా మారుతుంది. ఇలా జరిగితే మాత్రం బరువు తగ్గుతున్నారనడానికి సంకేతంగా గుర్తించాలి.

విపరీతమైన అలసట

ఎంత తింటున్నా కూడా శరీరం అలిసిపోయిన ఫీలింగ్ వస్తుంది. రక్తంలో చక్కెర నియంత్రణ లేదు అనేందుకు ముఖ్యమైన సంకేతం. శరీరం ఇన్సులిన్ ని సరిగా ప్రాసెస్ చేయలేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు సాధారణం కంటే ఎక్కువ మూత్ర విసర్జన చేస్తారు. వాటిని భర్తీ చేసుకునేందుకు తగినంత నీరు తాగాలి. లేదంటే డీహైడ్రేట్ కి గురవుతారు.

కంటి చూపు మందగించడం, తలనొప్పి

చక్కెర స్థాయిలు పెరిగితే కంటి చూపు మందగిస్తుంది. నిరంతరంగా తలనొప్పి వస్తుంది. ఆరోగ్య నిపుణులు దీన్నే మాక్యులా అని అంటారు. ఈ వ్యాధి వల్ల రక్తనాళాలు ఉబ్బడం వల్ల వాపు వస్తుంది. దీని వల్ల చూడటం, సొంతంగా పనులు చేసుకోవడం ఇబ్బందిగా మారుతుంది.

గాయాలు మానకపోవడం

సాధారణంగానే డయాబెటిస్ రోగులకి గాయాలు ఏవైనా అయితే అవి నయం అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఇక అనియంత్రిత చక్కెర స్థాయిలు కారణంగా నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. చేతులు, కాళ్ళు, పాదాల్లో రక్త ప్రసరణని ప్రభావితం చేస్తుంది. చిన్న గాయాలు కూడా నయం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. వాటి వల్ల అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. పాదాల పుండ్లు, చర్మం విపరీతంగా పొడిబారిపోవడం, మెడ చుట్టూ నల్లని మచ్చలు కూడా వస్తాయని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వెల్లడించింది. ఇవన్నీ కూడా ఇన్సులిన్ నిరోధకత సంకేతాలు.  

చిగుళ్ళ వాపు, రక్తస్రావం

ఎప్పుడు చిగుళ్ళ వాపు, రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది. లాలాజలంలో గ్లూకోజ్ ఉంటుంది. అది ఎంత ఎక్కువగా ఉంటే నోటిలోని ఆహారంతో కలిసి ఫలకం ఏర్పడి చిగుళ్ళ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాతో కలిసిపోతుంది. వెంటనే ఈ లక్షణాలు గుర్తించి పరిష్కరించుకొకపోతే వాపు పీరియాంటైటిస్ కు దారి తీయొచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా వెతికిన రెసిపీ ఏంటో తెలుసా? దాని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Embed widget