News
News
X

Google Search 2022: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా వెతికిన రెసిపీ ఏంటో తెలుసా? దాని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

చిన్నపిల్లలు దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినేది పనీర్. దీనితో ఏ వంటకం చేసిన అద్భుతమైన రుచిగా ఉంటుంది.

FOLLOW US: 
Share:

ఇంతకముందు ఏదైనా వంట చేయాలంటే ఇంట్లో అమ్మ, అమ్మమ్మ చెప్పే వాళ్ళు. కానీ ఇప్పుడు ఎటువంటి రకం వంట చేయాలన్న సరే గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. లేదంటే యూట్యూబ్ లో వీడియోలు చూసేసి సింపుల్ గా ఇంట్లోనే తమకి నచ్చిన వంటకం చేసేస్తున్నారు. అలా ఈ ఏడాది ఎక్కువ మంది గూగుల్ లో వెతికిన రెసిపీ ఏంటో తెలుసా? పనీర్ పసంద. గూగుల్ 2022 గ్లోబల్ డేటా ప్రకారం పనీర్ పసంద్ రెసిపీ ఎలా చేసుకోవాలనే దాని గురించి శోధించారు. రుచికరమైన క్రిమీ పనీర్ పసంద్ అందరికీ తెగ నచ్చేసింది.

పసంద అంటే చిక్కగా ఉండే గ్రేవీ అని అర్థం. టొమాటోలు, ఉల్లిపాయలతో  దీన్ని తయారు చేస్తారు. దీనికి మరింత రుచి ఇవ్వడం కోసం మసాలాలు, బాదం పేస్ట్ వేస్తారు. గార్నిష్ కోసం పెరుగు లేదా క్రీమ్ వేసి ఇస్తారు. చూస్తుంటేనే ఎంతో నోరూరించే ఈ కర్రీని బటర్ నాన్ తో తింటారు. ఈ డిష్ లో ప్రధాన పదార్థం పనీర్. శాఖాహారులకి ఎంతో ఇష్టమైన ఫుడ్. పనీర్ లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.

పనీర్ పసంద్ వెనుక చరిత్ర

మొఘల్ కాలంలో పనీర్ స్థానంలో గొర్రె లేదా మేక మాంసాన్ని ఉపయోగించి పసందైన వంటకాలు చేసే వాళ్ళు. ఇది ఎంతో ఇష్టమైన మాంసాహార వంటకంగా ప్రాచుర్యం పొందింది. అయితే మొఘల్ కోర్టులో సభికులుగా పని చేసే కాయస్ట్ కమ్యూనిటీ వాళ్ళు దాన్ని మాంసం అని పిలవకుండా పనీర్ పసంద్ అని పిలిచారు.

పనీర్ పసంద్ లోని పోషకాలు

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం పనీర్ పసంద్ లో 294 కేలరీలు ఉంటాయి.

కార్బోహైడ్రేట్లు 49 కేలరీలు

ప్రోటీన్ 37 కేలరీలు

కొవ్వు 200 కేలరీలు

రోజుకి ఒక వ్యక్తి 2000 నుంచి 2500 కేలరీల ఆహారం తీసుకోవాలి. అందులో పనీర్ పసంద్ తీసుకుంటే రోజువారీ కేలరీలలో 15 శాతం ఇదే కవర్ చేస్తుంది.

పనీర్ తినడం వల్ల ప్రయోజనాలు

పనీర్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది తినడం వల్ల పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది. 100 గ్రాముల పనీర్ లో సగటున 20 గ్రాముల కొవ్వు, ప్రోటీన్, ఒక గ్రాము కార్బోహైడ్రేట్ ఉంటాయి. ప్రోటీన్ రిచ్ డైట్ కోసం మాంసానికి బదులు పనీర్ తీసుకోవడం ఉత్తమ ప్రత్యామ్నాయం.

రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

పనీర్ లో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. స్త్రీలు ఎదుర్కొనే ప్రాణాంతక క్యాన్సర్లలో ఒకటైన రొమ్ము క్యాన్సర్ ని తగ్గించేందుకు పనీర్ సహకరిస్తుంది. పనీర్ లోని స్పింగోలిపిడ్‌, అధిక మొత్తంలో లభించే ప్రోటీన్ల వల్ల పెద్ద పేగు, ప్రొస్టేట్ క్యాన్సర్ ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి.

దంతాలు, ఎముకలకు బలం

కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల దంతాలు, ఎముకలు బలంగా మారతాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ సాఫీగా పని చేయడంలో సహాయపడుతుంది. గుండె కండరాలని ఆరోగ్యంగా ఉంచుతుంది.

బరువు తగ్గిస్తుంది

పనీర్ లోని ప్రోటీన్ ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉంచుతుంది. దీని వల్ల ఎక్కువగా తినలేరు. అదనపు కేలరీలని బర్న్ చేయడంలో సహాయపడే కొవ్వు ఆమ్లాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

జీర్ణ వ్యవస్థని నియంత్రిస్తుంది

పనీర్ లో భాస్వరం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

మధుమేహులకి మంచిదే

పనీర్ లోని మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: నటి హంసా నందినికి సోకిన BRCA క్యాన్సర్ గురించి మీకు తెలుసా? లక్షణాలు ఏమిటీ? ఎలా గుర్తించాలి?

Published at : 09 Dec 2022 12:49 PM (IST) Tags: Healthy Food Paneer Pasanda Panner Benefits Paneer Health Benefits Most Searched Recipe

సంబంధిత కథనాలు

Weight Loss: బరువు తగ్గే ప్లాన్ వేసుకుంటున్నారా? జాగ్రత్త, ఈ అపోహలు నమ్మొద్దు

Weight Loss: బరువు తగ్గే ప్లాన్ వేసుకుంటున్నారా? జాగ్రత్త, ఈ అపోహలు నమ్మొద్దు

ఏవండోయ్ ఇది విన్నారా? 'జస్ట్ ఫ్రెండ్స్' అన్నందుకు మహిళపై రూ.24 కోట్లు పరువు నష్టం కేసు వేశాడు!

ఏవండోయ్ ఇది విన్నారా? 'జస్ట్ ఫ్రెండ్స్' అన్నందుకు మహిళపై రూ.24 కోట్లు పరువు నష్టం కేసు వేశాడు!

Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?

Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?

Tips for Good Sleep: మీకు మంచిగా నిద్రపట్టాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి చాలు!

Tips for Good Sleep: మీకు మంచిగా నిద్రపట్టాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి చాలు!

Water for Hydration: శరీరం డీహైడ్రేట్‌కు గురైతే తాగాల్సింది నీరు కాదు - ఇవిగో ఇవి తాగండి

Water for Hydration: శరీరం డీహైడ్రేట్‌కు గురైతే తాగాల్సింది నీరు కాదు - ఇవిగో ఇవి తాగండి

టాప్ స్టోరీస్

కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!

కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Hanuma Vihari: శెబ్బాష్‌ హనుమ విహారీ! మణికట్టు విరిగినా ఆంధ్రా కోసం బ్యాటింగ్‌ చేశాడు!

Hanuma Vihari: శెబ్బాష్‌ హనుమ విహారీ! మణికట్టు విరిగినా ఆంధ్రా కోసం బ్యాటింగ్‌ చేశాడు!