అన్వేషించండి

Ghee: వీటిని నెయ్యితో కలిపి తీసుకుంటే ఏ మందులూ వాడక్కర్లేదు

ఎన్నో చిన్న చిన్న రోగాలకి ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్ గా నయం చేసుకోవచ్చు. అవన్నీ మన కిచెన్ లోనే లభిస్తాయి

నెయ్యి భారతీయ సంస్కృతిలో ఒక భాగం. వంటలకి అదనపు రుచి ఇవ్వడం మాత్రమే కాదు మనకి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆయుర్వేద మందులలో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. నెయ్యిని వీటితో కలిపి తీసుకుంటే మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎటువంటి రోగాలు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉంటారు. అందుకే నెయ్యితో పాటు ఈ పదార్థాలు కూడా కలిపి తీసుకోండి.

మెంతులు

ఫోలిక్ యాసిడ్, పొటాషియం, రాగి, విటమిన్ ఏ, బి, సి, కె, కాల్షియం, ఐరన్ వంటి శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో మెంతులు అందిస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణ సమస్యల్ని తగ్గిస్తాయి. నెయ్యితో కలిపి మెంతులు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

పసుపు

ఇందులో కర్కుమిన్ ఉంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. నెయ్యికి పసుపు జోడించి తీసుకోవడం వల్ల శోధ నిరోధక ప్రభావాలను మెరుగుపరుస్తుంది.

దాల్చిన చెక్క

రక్తంలో చక్కెర నియంత్రణకి సహాయపడే వాటిలో దాల్చిన చెక్క ఒకటి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. నెయ్యికి ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడిని జోడించుకుని తింటే అనేక రోగాలని నయం చేస్తుంది.

అశ్వగంధ

ఆయుర్వేదంలో అశ్వగంధకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ఒక అడాప్టోజెనిక్ హెర్బ్. ఒత్తిడి ఎదుర్కొని, విశ్రాంతిని ప్రోత్సహించేందుకు సహాయపడే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అశ్వగంధ పౌడర్ ని నెయ్యితో కలిపి తీసుకుంటే శరీరానికి మేలు జరుగుతుంది.

యాలకులు

జీర్ణ ప్రయోజనాలు అందించడంలో యాలకులు బెస్ట్. దీనిలోని పోషక గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల యాలకుల్ని క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని పిలుస్తారు. ఆరోగ్యాన్ని అందించే చక్కని సుగంధ ద్రవ్యం. నెయ్యికి యాలకులు కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వంటకాలకి ఇవి రెండూ ప్రత్యేకమైన రుచిని కూడా అందిస్తాయి.

నల్ల మిరియాలు

కాస్త ఘాటైన రుచిని కలిగినప్పటికీ ఆరోగ్యానికి అందించే ప్రయోజనాల విషయంలో ఎక్కడా తగ్గదు. అందుకే దీన్ని కింగ్ ఆఫ్ స్పైసెస్ అని పిలుస్తారు. ఇందులో పైపెరిన్ ఉంటుంది. నెయ్యి, పసుపుతో కలిపి నల్ల మిరియాలు తీసుకుంటే కర్కుమిన్ శోషణ పెంచుతుంది. అది మాత్రమే కాకుండా నల్ల మిరియాలు జీర్ణశక్తిని పెంచుతాయి. కడుపు సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి.

తులసి

ఆయుర్వేదంలో పవిత్రమైన మూలికగా తులసిని పరిగణిస్తారు. రోజుకి రెండు తులసి ఆకులు నమలడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇందులో అడాప్టోజెనిక్, రోగనిరోధక లక్షణాలు ఉన్నాయని విశ్వసిస్తారు. ఎండిన లేదా తాజా తులసి ఆకులని నెయ్యికి జోడించు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ తగ్గుముఖం పడతాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: షాకింగ్, మనిషి గుండెలో ప్లాస్టిక్ వ్యర్థాలు - చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్, ఏలా చేరుతున్నాయో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget