అన్వేషించండి

Acidity: ఎసిడిటీ వల్ల గుండెల్లో మంటగా ఉంటుందా? ఈ ఆహార పదార్థాలతో తగ్గించుకోవచ్చు

గ్యాస్ట్రిక్ బాధ తట్టుకోలేరు. ఒక్కోసారి అది గుండెలకి కొట్టి ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి తలెత్తుతుంది.

అతిగా తినడం, మసాలాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం, టైమ్ దాటిన తర్వాత తినడం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి. గుండెల్లో మంట లేదా ఎసిడిటీకి కారణమవుతుంది. ఇలా ఉన్నపుడు పొట్టలో బాగా అసౌకర్యంగా అనిపిస్తుంది. చికిత్స చేయకపోతే తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ట్యాబ్లెట్స్ వేసుకోవడం, యాంటాసిడ్స్ తాగడం వంటివి చేస్తారు. అయితే ఇది దీర్ఘకాలిక పరిష్కారం కాదు. మందులతో కాకుండా సహజమైన యాంటాసిడ్స్ కలిగిన ఆహార పదార్థాలు తీసుకుంటే అకస్మాత్తుగా వచ్చే గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యను తగ్గించుకోవచ్చు. అవేంటంటే..

చల్లని పాలు

చల్లటి పాలు తాగడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ ని తక్షణమే నయం చేస్తుంది. అందుకు కారణం ఇందులో అధిక మొత్తంలో కాల్షియం ఉండటం. ఇది యాసిడ్ ని గ్రహించి గ్యాస్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. వాస్తవానికి వేడి పాలు కాకుండా చల్లని పాలు తీసుకోవడం మంచిది. ఇది జీర్ణ ఆమ్లాన్ని గ్రహించి అసౌకర్యం, నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

చమోమిలీ టీ

చామంతి పూల టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. అజీర్ణ సమస్యల నుంచి బయట పడేయడంలో అన్ని విధాలుగా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. యాసిడ్ రిఫ్లక్స్, అకస్మాత్తుగా ఎసిడిటీ వల్ల కలిగే నొప్పిని నయం చేస్తుంది.

పండిన అరటిపండు

పొటాషియం అధికంగా ఉండే పండిన అరటి పండ్లు తీసుకోవడం వల్ల ఎసిడిటీ బాధ నుంచి బయటపడొచ్చు. ఈ పండు ఆల్కలీన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది గుండెల్లో మంటని తగ్గించడంలో సహాయపడుతుంది. అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ డైటేటిక్స్ ప్రకారం పండిన అరటి పండు తీసుకోవడం వల్ల జీర్ణ ఆమ్లంతో పోరాడుతుంది. అన్నవాహికలో కలిగే చికాకుని తగ్గిస్తుంది.

తులసి ఆకులు

ఎన్నో ఔషధ గుణాలు కలిగిన తులసి ఆకులు రోజుకి రెండు నమిలితే అజీర్తి సమస్యలు దరిచేరవు. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్, ఉబ్బరం వల్ల కలిగే అసౌకర్యాన్ని నయం చేసే గొప్ప గుణాలు ఇందులో ఉన్నాయి. తులసిలో యాంటీ అల్సర్ లక్షణాలు ఉన్నాయి. వీటిని టీ లేదా పచ్చి ఆకుల రూపంలో తీసుకుంటే పొట్టలోని ఆమ్ల స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.

అల్లం

అల్లంలో యాంటీ మెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది వికారం, వాంతులు వంటి అనుభూతిని నివారించడంలో సహాయపడుతుంది. పాలు లేని అల్లం టీని తాగడం వల్ల ఎసిడిటీ వల్ల కలిగే మంట, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే రోజు మొత్తం మీద 3-4 గ్రాముల కంటే ఎక్కువ అల్లం తినకుండా చూసుకోవాలి. అతిగా అల్లం తీసుకుంటే అది మరొక అనారోగ్య సమస్యని తీసుకొచ్చి పెడుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: పెరుగుతో ఫేస్ ప్యాక్ - మీ వయస్సు వెనక్కి వెళ్లడం ఖాయం!

టాప్ హెడ్ లైన్స్

Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
Excessive Body Heat : బాడీలో హీట్‌ ఎక్కువైతే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే?
బాడీలో హీట్‌ ఎక్కువైతే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే?
Beerakaya Thokka Pachadi : బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి రెసిపీ.. వేడి వేడి అన్నంలో కలిపి తింటే అదిరిపోతుంది
బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి రెసిపీ.. వేడి వేడి అన్నంలో కలిపి తింటే అదిరిపోతుంది
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Embed widget