అన్వేషించండి

Dimple Cheeks: బుగ్గల్లో సొట్ట పడటానికి ఇదే కారణం, వారసత్వంగా వస్తుంది కూడా

Dimple Cheeks: సొట్టబుగ్గలపై ఎన్నో పాటలు వచ్చాయి. సొట్ట బుగ్గలు ఉంటే ఎంతో లక్కీ అని కూడా చెప్పుకుంటారు.

Dimple Cheeks: బుగ్గలో సొట్ట పడితే ఆ అందమే వేరు. బుగ్గసొట్టలు అబ్బాయిలకన్నా అమ్మాయిలకే ప్రత్యేక ఆకర్షణ. ప్రాచీన కాలం నుంచి ఒక నమ్మకం వాడుకలో ఉంది. సొట్ట బుగ్గలు ఉన్న వాళ్లు చాలా లక్కీ ఫెలోస్ అని, వారికి జీవితంలో డబ్బుకు లోటుండదని, ఏదోరకంగా డబ్బు చేతికి అందుతూనే ఉంటుందని చెప్పుకున్నారు. ఇదెంత వరకు నిజమో తెలియదు కానీ, సైన్సు సొట్ట బుగ్గలు పడటానికి కారణాన్ని వివరించింది. 

అందమైన కథ
చెంపల్లో డింపుల్ పడటానికి ఒక ప్రాచీన కథ కూడా వాడుకలో ఉంది. ఒక దేవదూత తాను మెచ్చిన ఒక మానవుని కోసం దేవలోకం నుంచి కిందకి పడతాడు. ఆయన రెక్కలు విరిగిపోతాయి. రెక్కడు విరిగిన ఆ దేవదూతకు చిహ్నంగా మనుషులకు ఇలా బుగ్గల్లో సొటలు పడడం ప్రారంభమైందని చెప్పుకుంటారు. ఎన్నో దేశాల్లో ఈ కథను నమ్ముతారు. డింపుల్ బుగ్గలు ఉన్న వారిని చాలా ప్రత్యేకంగా చూస్తారు. ఈ ప్రపంచ జనాభాలో దాదాపు 20 నుంచి 30 శాతం మందికి సొట్టబుగ్గలు ఉన్నట్టు అంచనా. 

సైన్సు ఏం చెబుతోంది...
సొట్ట బుగ్గలు పడడం వెనుక మానవ శరీర నిర్మాణమే కారణం. ముఖంలోని కండరాల్లోని మార్పులే ఈ సొట్టలు పడటానికి కారణమని చెప్పుకోవాలి. ముఖంలోని ప్రధాన కండరం అయితే జైగోమాటికస్ వల్లే ఇలా ఏర్పడతాయి. ఈ కండరం సాధారణంగా చెంప ఎముక నుంచి మన నోటి మూల వరకు ఒకేలా ఉంటుంది. అలా కాకుండా కొందరిలో పుట్టుకతోనే ఈ కండరం రెండు వేర్వేరు తాళ్లలాగా విడిపోతుంది. ఇందులో ఒకటి నోటి చివర వరకు వెళుతుంది. ఇంకోటి మాత్రం నోటి మూలలో ఆగిపోతుంది. ఆ రెండు తాళ్లలంటి కండరాల మధ్య ఖాళీ స్థలం ఏర్పడుతుంది. అందుకే నవ్వినప్పుడు అక్కడ లోతుగా సొట్ట పడుతుంది. అది ముఖానికి అందాన్ని కూడా తెచ్చిపెడుతుండడంతో, దాన్కొక సమస్యగా ఎవరూ గుర్తించడం లేదు. 

వారసత్వంగా...
సొట్ట బుగ్గలు వారసత్వంగా వస్తాయి. తల్లికి లేదా తండ్రికి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం 50 శాతం ఉంది. మానవ ముఖ లక్షణాలపై జరిపిన ఒక అధ్యయనంలో డింపుల్  ఉన్నవారి ముఖ కవళికలు మరింత ప్రభావవంతంగా ఎదుటివారికి తెలుస్తాయిట. వారి నవ్వు చాలా పాజిటివ్‌గా ఎదుటివారికి అనిపిస్తుందట. 

Also read: ప్రొటీన్ పొడిని ఇలా ఇంట్లోనే తయారుచేసుకోండి, రోజూ తాగితే ఎంతో బలం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Slim Waist Surgery : నడుమును సన్నగా చేసే రిబ్ మోడలింగ్ సర్జరీ.. ఎంత ప్రమాదమో తెలుసా?
నడుమును సన్నగా చేసే రిబ్ మోడలింగ్ సర్జరీ.. ఎంత ప్రమాదమో తెలుసా?
Best One-Year FD Rates : లక్ష రూపాయలను ఒక సంవత్సరానికి FDలో జమ చేస్తే ఏ బ్యాంకు ఎంత రాబడిని ఇస్తుంది?
లక్ష రూపాయలను ఒక సంవత్సరానికి FDలో జమ చేస్తే ఏ బ్యాంకు ఎంత రాబడిని ఇస్తుంది?
Amla Juice : ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగితే బరువు తగ్గుతారా? చర్మం మెరుస్తుందా? నిజాలివే
ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగితే బరువు తగ్గుతారా? చర్మం మెరుస్తుందా? నిజాలివే
Japanese Beauty Secrets : తక్కువ ఖర్చుతో గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవాలా? ఈ 5 జపనీస్ చిట్కాలు ట్రై చేయండి
తక్కువ ఖర్చుతో గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవాలా? ఈ 5 జపనీస్ చిట్కాలు ట్రై చేయండి

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Embed widget