Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండటం లేదా? ఆయుర్వేదం చెప్పిన ఈ ఆహారాలతో సాధ్యమే!
మధుమేహం శరీరంలోకి ఒకసారి వచ్చి చేరిందంటే దాన్ని వదిలించుకోవడం కష్టమే. కానీ దాన్ని అదుపులో ఉంచుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది.
డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలని ప్రభావితం చేస్తుంది. గత నాలుగు సంవత్సరాలుగా భారత్ లో మధుమేహం కేసులు 44 శాతం పెరిగాయి. సుమారు వంద మిలియన్లకి మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారం తీసుకోవడం, క్రమమైన వ్యాయామంతో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవచ్చు. అయితే మధుమేహులు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ లో లేకపోతే ఇతర ప్రమాదకర రోగాలని దారి తీస్తుంది. చక్కెర ఎక్కువగా ఉన్న పండ్లు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. కానీ ఆయుర్వేదం చెప్పిన వీటిని తీసుకుంటే మాత్రం షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంచుకోవచ్చు.
కాకరకాయ
బిట్టర్ మెలోన్ అని పిలిచే కాకరకాయలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. పాలిపెప్టైడ్ అనే ఇన్సులిన్ సమ్మేళనం కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది. డయాబెటిస్ నిర్వహణకి అద్భుతమైన ఎంపిక.
జామున్
నేరేడు పండ్లు లేదా ఇండియన్ బ్లాక్ బెర్రీ హైపోగ్లైసిమిక్ ప్రభావాలని కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్, పాలీఫెనాల్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. నేరేడు పండ్లు రసం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇందులోని అధిక డైటరీ ఫైబర్ కంటెంట్ చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. సమతుల్య ఆహారంలో నేరేడు పండ్లు చేర్చుకోవడం వల్ల మధుమేహాన్ని సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవచ్చు.
గిలోయ్
గిలోయ్ ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. శోథనిరోధక లక్షణాలు తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ప్యాంక్రియాటిక్ బీటా కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. మధుమేహంతో సంబంధం ఉన్న ఆక్సీకరణ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
ఉసిరికాయ
ఆమ్లా రక్తంలో చక్కెర నియంత్రించడంతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని అందించే శక్తివంతమైన ఆయుర్వేద మూలిక. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ప్యాంక్రియాటిక్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గిస్తుంది.
గుడ్మార్
జిమ్నెమా సిల్వెస్ట్రే అని కూడా పిలిచే గుడ్మార్ మధుమేహాన్ని సహజంగా అదుపులో ఉంచుతుంది. గ్లూకోజ్ శోషణని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తుంది. గుడ్మార్ తీసుకోవడం వల్ల చక్కెర కోరికలు కూడా తగ్గుతాయి.
ఈ ఆయుర్వేద మూలికలు మధుమేహాన్ని శాశ్వతంగా తొలగించలేకపోవచ్చు కానీ రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ప్రమాదంలో ఆరోగ్యం - వర్షాకాలంలో ఇమ్యునిటీ కోసం ఈ పానీయాలు తాగండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial