Immunity Booster Drink: ప్రమాదంలో ఆరోగ్యం - వర్షాకాలంలో ఇమ్యునిటీ కోసం ఈ పానీయాలు తాగండి
ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడే వర్షాకాలంలో రోగాల దాడిని ఎదుర్కోగల శక్తి లభిస్తుంది.
వర్షాకాలంలో అనేక అంటు వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురవుతుంటారు. జలుబు, ఫ్లూ, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి కొన్ని వ్యాధులు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఇబ్బంది పెట్టేస్తాయి. వీటి నుంచి బయట పడాలంటే ఉన్న ఏకైక మార్గం రోగనిరోధక శక్తి పెంచుకోవడమే. మాన్ సూన్ సీజన్ లో రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడం కోసం ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవాలి. జ్వరం, జలుబు నుంచి ఉపశమనం పొందటం కోసం ఎక్కువగా పాటించే రెమిడీ గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగడం. ఇదే కాదు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో ఇది ఆరోగ్యరకమైన పానీయమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
నిమ్మ, పసుపు నీళ్ళ ప్రయోజనాలు
రోగనిరోధక శక్తి: నిమ్మ, పసుపు రెండింటికీ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థని అందిస్తుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. రోగనిరోధక పనితీరు మెరుగుపరిచే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.
మంటను తగ్గిస్తాయి: శరీరంలోని మంటని తగ్గిస్తుంది. దీర్ఘకాలిక మంట, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ సహా అనేక ఆరోగ్య పరిస్థితులతో ముడి పడి ఉంటుంది. నిమ్మ, పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ మంటని తగ్గిస్తాయి. వాపుని, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియ: నిమ్మకాయ, పసుపు నీరు ఆరోగ్యకరమైన జీర్ణక్రియకి తోడ్పడుతుంది. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ కంటెంట్ కారణంగా జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది ఆహారం విచ్చిన్నం చేయడంలో సహాయపడుతుంది. పసుపు జీర్ణవ్యవస్థ సమస్యల్ని తగ్గిస్తుంది. ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు నిరోధిస్తుంది. అజీర్ణం, ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్ పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
డిటాక్సిఫికేషన్: నిమ్మ, పసుపు నీరు శరీరానికి సహజమైన డిటాక్సిఫైయర్ గా పని చేస్తుంది. కాలేయం పనితీరుని మెరుగుపరుస్తుంది. శరీరం నుంచి విష వ్యర్థాలని బయటకి పంపుతుంది.
వర్షాకాలంలో ఈ నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. వానాకాలంలో తరచుగా నీరు కలుషితం అవుతుంది. ఆహారం కలుషితమై వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. దాని నుంచి బయట పడేందుకు ఈ నీరు చక్కగా పని చేస్తుంది. ఈ నీటిలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్ లకు వ్యతిరేకంగా పోరాడేందుకు సహాయపడే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి.
ఎప్పుడు తీసుకోవాలి?
నిమ్మ, పసుపు నీళ్ళు తాగేందుకు ఉత్తమ సమయం వ్యక్తిగత ప్రధానిట్లు, ఆరోగ్య పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. శరీరాన్ని రీహైడ్రేట్ చేసేందుకు కాహళీ కడుపుతో తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట దీన్ని తీసుకుంటే శరీరం పోషకాలని సమర్థవంతంగా గ్రహిస్తుంది. భోజనానికి 30 నిమిషాల ముందు ఈ నీటిని తాగిన మంచిదే. జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. పోషకాల శోషణ మెరుగుపరుస్తుంది.
ఈ నీరు మితంగా తీసుకుంటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందుతారు. అధికంగా తీసుకుంటే జీర్ణాశయాంతర సమస్యలు లేదా ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ని అంతరాయం కలిగిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: సిగరెట్లు తాగితే నాలుకపై వెంటుకలు వస్తాయా? ఇతడి నరకయాతన చూస్తే వణికిపోతారు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial