Heart Health: రోజూ మీరు చేసే ఈ పనులు గుండెను దెబ్బతీస్తాయి, వెంటనే మానేయండి
గుండెను ఇబ్బంది పెట్టే అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయాల్సిన అవసరం ఉంది.
మీ అలవాట్లు మీ గుండెను ఎంతో ప్రభావితం చేస్తాయి. తినే ఆహారం, రోజూ చేసే కొన్ని పనులు గుండెను దెబ్బతీస్తాయి. ఆ కారకాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని పనులు పెద్ద ప్రమాదకరంగా కనిపించవు. కానీ అవి అంతర్గతంగా గుండెపై మాత్రం చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. గుండెకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే అలవాట్లు ఇవే.
ఒంటరిగా ఉండడం
కొంతమంది ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఒంటరిగా ఉండడం కొన్ని సార్లు ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ అదే అలవాటైతే మాత్రం మానసికంగా చాలా ప్రభావం పడుతుంది. మానసిక ఆరోగ్యం ప్రభావితం అయితే అది హృదయనాళ వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది.
ఎక్కువ వ్యాయామం లేదా చాలా తక్కువ వ్యాయామం
శారీరక శ్రమ గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ అతిగా వ్యాయామం చేసినా గుండెకు ప్రమాదమే. అతిగా జిమ్ చేశాక గుండె పోటు వచ్చిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. అలాగే పూర్తిగా శారీరక శ్రమ చేయకపోయినా ముప్పే. ఎక్కువ లేదా చాలా తక్కువ వ్యాయామం గుండెపై ఒత్తిడి కలిగిస్తుంది.
చెడు బంధాలు
మీ చుట్టూ ఉన్న వ్యక్తులు సానుకూల ఆలోచనలు కలవారై ఉండాలి. కొందరు వ్యక్తులు నిత్యం మిమ్మల్ని మాటలతో వేధించేవారు, బాధపెట్టే వారు అయితే వారికి దూరంగా ఉండడం చాలా మంచిది. వారి వల్ల మీరు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఒత్తిడి గుండె చాలా ప్రమాదకరం.
అధికంగా స్క్రీన్ చూడడం
నిద్ర తగ్గడం, బ్లూ లైట్ ఎక్స్ పోజింగ్ పెగరడం, ఎక్కువ సమయం టీవీలు, ఫోన్లూ చూస్తూ కూర్చోవడం కూడా గుండెకు హాని కలిగించే అంశాలే. గంటలు గంటలు కూర్చోవడం వల్ల ప్రమాదకరమైన ఆరోగ్యపరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. గుండె ఆరోగ్యంపై ఇవన్నీ ప్రతికూల ప్రభావాన్ని కలుగజేస్తాయి.
పనిగంటలు
షిప్ట్ లు తరచూ మారడం, అధిక పనిగంటలు వర్క్ చేయడం కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. నిద్ర షెడ్యూల్ ఎప్పటికప్పుడు మారడం మంచిది కాదు. దీనివల్ల సిర్కాడియన్ సైకిల్ దెబ్బతింటుంది. ఈ పరిస్థితి హృదయనాళ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండటమే కాకుండా, హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది.
ఆధునిక కాలంలో గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చెడు కొలెస్ట్రాల్ ఉండే ఆహారాన్ని పూర్తిగా మానేయాలి. రోజుకు గంట వాకింగ్ చేయాలి. గంటలు గంటలు కూర్చోవడం మానేసి ప్రతి గంటకోసారి లేచి ఇటూ అటూ నడవాలి. పీచు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. గుండె కోసం చిలగడ దుంపలు కచ్చితంగా తినాలి. విటమిన్ కె కూడా గుండెకు చాలా అవసరం. విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలను తినడం ప్రారంభించాలి. ఏరోబిక్ వ్యాయామాలు చేయడం ప్రారంభించాలి. ప్రాణాయామం, ధ్యానం వంటివి రోజుకో అరగంట చేస్తే చాలా మేలు.
Also read: సుప్రీంకోర్టుకు చేరిన ‘నిమ్మరసం’ పంచాయతీ? అది నిమ్మ రసమా లేక పండ్ల రసమా?
Also Read: డయాబెటిక్ రోగులకు శుభవార్త, రోజూ కాఫీ తాగితే ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు