News
News
X

Knee Pain: మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మోకాళ్ళు అరిగిపోతున్నాయని సంకేతాలు కావొచ్చు

మోకాలి నొప్పి భరించడం చాలా కష్టం. గతంలో వృద్ధుల్లో మోకాళ్ళ అరుగుదల కనిపిస్తే ఇప్పుడు యుక్త వయస్సు వాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు.

FOLLOW US: 
Share:

యస్సు పెరిగే కొద్ది ఎముకలు అరిగిపోయి నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఎముకల అరుగుదల ఎక్కువగా మోకాళ్ళలోనే కనిపిస్తుంది. ఆ బాధ భరించలేక చాలా మంది మోకాలి శస్త్ర చికిత్సల వైపు మొగ్గు చూపుతారు. కీలు ఎముకల మధ్య ఉండే మృదులాస్థి వాటిని రక్షిస్తుంది. నెలవంక ఆకారంలో మోకాలి మధ్యలో ఉంటుంది. కీలుని కదిలించడం కోసం ఒక స్ప్రింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఇది దెబ్బతినడం వల్ల మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి.

మృదులాస్థి పూర్తిగా అరిగిపోతే కీలులోని రెండు ఎముకలు ఒకదాని మీద ఒకటి రాపిడికి గురవుతుంది. రన్నింగ్, స్కిప్పింగ్, ఎత్తైన ప్రదేశాలు ఎక్కలేకపోవడం, మోకాళ్ళు వంచి ఎక్కువ సేపు కూర్చోలేకపోవడం చాలా కష్టం అవుతుంది. లక్షణాల తీవ్రతని బట్టి ఆర్థోస్కోపీ, ఆస్టియోటమీ లేదా జాయింట్ రీప్లేస్ మెంట్ వంటి సర్జరీలు చేయించుకోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మోకాళ్ళు బలహీనంగా మారుతున్నాయ్ అని చెప్పేందుకు కొన్ని సంకేతాలు శరీరంలో కనిపిస్తాయి. వాటిని గుర్తించి తక్షణమే వైద్య చికిత్స తీసుకోవడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

తీవ్రమైన నొప్పి

కీళ్ల నొప్పులు తీవ్రంగా కొన్ని రోజులు లేదా దీర్ఘకాలికంగా ఉండవచ్చు. కొన్ని సార్లు నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగవచ్చు. నొప్పి వచ్చే ప్రదేశాన్ని బట్టి అది ఆస్టియో ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది తెలుస్తుంది. జాయింట్ లేదా కీళ్లల్లో మాత్రమే కాకుండా తుంటిలో కూడా నొప్పిగా అనిపిస్తుంది.

మోకాలి వాపు

మోకాలి లోపల అధిక ద్రవం పేరుకుపోయినప్పుడు మోకాళ్ళు ఉబ్బుతాయి. దీని వల్ల కండరాల నొప్పులుగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో వాపు తక్కువగా ఉంటుంది. కానీ నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం వెంటనే వైద్యులని సంప్రదించాలి. అలా జరిగిన సందర్భంలో కూడా మోకాళ్ళు బలహీనంగా మారుతున్నాయని అర్థం.

మోకాలి దగ్గర సౌండ్

కాసేపు కూర్చుని నిలబడేటప్పుడు మోకాలి దగ్గర పగుళ్లు లేదా క్రాకింగ్ సౌండ్ వస్తే అది బలహీనంగా మారినట్టు గుర్తించాలి. మోకాలు బరువుగా అనిపించడం, కాసేపు కూర్చున్న పట్టేసినట్టుగా అనిపిస్తే వైద్య పరీక్షల కోసం వెళ్లాల్సిన సమయం వచ్చిందని అర్థం.

బలహీనమైన కండరాలు

క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయకపోతే కండరాలు క్షీణించడం మొదలవుతుంది. మోకాలి దీర్ఘాయువుకు అత్యంత ముఖ్యమైన కండరాలు క్వాడ్రిస్ప్స్, హామ్ స్ట్రింగ్స్, గ్యాస్ట్రోక్నిమియస్. ఈ కండరాలు బలహీనంగా ఉంటే మోకాలి కీలు మీద దాని ప్రభావం పడుతుంది.

మోకాలు నిటారుగా పెట్టలేరు

మోకాలిని వంచడమే కాదు దాన్ని నిటారుగా కూడా పెట్టలేరు. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ సంభవించినప్పుడు జరుగుతుంది. మారథాన్ లో పాల్గొనే వాళ్ళు, క్రీడాకారులు ఎక్కువగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు.

స్నాయువు దెబ్బతినడం

గతంలో పీసీఎల్ లేదా ఎల్సిఎల్ పరిస్థితి ఎదుర్కొని ఉండి ఉంటే వాళ్ళ మోకాలి స్నాయువులు పూర్తిగా కోలుకోలేవు. దాని వల్ల మోకాళ్ళు బలహీనంగా మారతాయి. ఇలాగే కొనసాగితే కొత్త ఎల్సీఎల్ గాయం వచ్చే అవకాశం ఉంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా కనిపిస్తున్నాయా? ఈ కెచప్‌తో తోమారంటే అద్దాల్లా మెరిసిపోతాయ్!

Published at : 26 Jan 2023 03:51 PM (IST) Tags: Health Tips knee pain knee pain symptoms Knee Weakness Symptoms

సంబంధిత కథనాలు

Healthy Fats: హెల్తీగా ఉండాలంటే ఈ మూడు కొవ్వులున్న ఆహారాలు తీసుకోవాల్సిందే

Healthy Fats: హెల్తీగా ఉండాలంటే ఈ మూడు కొవ్వులున్న ఆహారాలు తీసుకోవాల్సిందే

Egg Freezing: తల్లి కావడానికి ప్రియాంక చోప్రా పాటించిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్ధతి గురించి మీకు తెలుసా?

Egg Freezing: తల్లి కావడానికి ప్రియాంక చోప్రా పాటించిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్ధతి గురించి మీకు తెలుసా?

ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్‌- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ

ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్‌- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ

Heart Health: మీ గుండెని కాపాడుకోవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే

Heart Health: మీ గుండెని కాపాడుకోవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే

Summer Drinks: వేసవి తాపాన్ని తగ్గించి మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే

Summer Drinks: వేసవి తాపాన్ని తగ్గించి మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి