అన్వేషించండి

Relationship: ఈ లక్షణాలు ఉంటే మీ కాపురంలో ఏదో జరుగుతున్నట్టే! మీ పార్టనర్ ఏదో దాస్తున్నారని అర్థం!

మీ సాన్నిహత్యం నుంచి మీ భాగస్వామి దూరంగా జరుగుతున్నారంటే ఏదో సమస్య ఉందని గ్రహించాలి. ఇది ఎలాంటి సమస్యైనా కావచ్చు. రిలేషన్‌లో ఉన్నప్పుడు అన్ని పంచుకోవాలా అంటే అది సాధ్యం కాకపోవచ్చు.

పెళ్లి అంటేనే ఒకరిపై మరొకరికి నమ్మకం. కేరింగ్ షేరింగ్‌ సమానస్థాయిలో ఉండాలి. వీటిపైనే ఓ జంట వైవాహిక జీవితం ఆధార పడి ఉంటుంది. ఇద్దరిలో ఒకరికి అనుమానం మొదలైనా ఆ రిలేషన్‌షిప్‌నకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందనే అర్థం.

మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్నిసార్లు మీ భాగస్వామి సడెన్‌గా మీ నుంచి దూరంగా వెళ్లడమో... ప్రైవసీ కోరుకోవడం చేస్తున్నారంటే మాత్రం మీలో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది. ఈ విషయంలో ఆ వ్యక్తిని అడగలేక... మీలో మీరే కుంగిపోతుంటారు. 

మీ సాన్నిహత్యం నుంచి మీ భాగస్వామి దూరంగా జరుగుతున్నారంటే ఏదో సమస్య ఉందని గ్రహించాలి. ఇది ఎలాంటి సమస్యైనా కావచ్చు. అలాంటి టైంలో పూర్తిగా వ్యక్తిపై అనుమానం రావడం సహజం . కానీ ఆధారాలు లేకుండా ఓ నిర్ణయానికి రావడం కూడా మంచిది కాదు. 

రిలేషన్‌లో ఉన్నప్పుడు అన్ని పంచుకోవాలా అంటే అది సాధ్యం కాకపోవచ్చు. చాలా వరకు క్లీన్‌గా ఉండటానికే అంతా ప్రయత్నిస్తారు కానీ కొన్ని విషయాలు దాచిపెడితే కాపురం సాఫిగా సాగుతుంది. అదే ఛాన్స్ తీసుకొని అన్నింటిలో అదే మంత్రం జపిస్తే మాత్రం అసలుకే ఎసర వచ్చే అవకాశం ఉంది. నిజాయితీతో సంబంధం కలిగి ఉండటం అంటే ప్రతి రహస్యాన్ని పంచుకోవాలని కాదు. కొన్ని విషయాల్లో వాళ్లకు కూడా ప్రైవసీ ఉంటుందని గ్రహించాలి. ఇద్దరూ ఆలోచనలు, భావాలు కొన్నింటిని గోప్యంగా ఉంచవచ్చు. అలాగని ప్రతి విషయంలో సీక్రెట్‌ మెంటయిన్ చేస్తూ వెళ్తే మాత్రం ఇద్దరి మధ్య  కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ అవుతుంది. ఇది మరింత ప్రమాదం. 

భాగస్వాముల వద్ద దాచే రహస్యాలు కొన్ని:

  • వ్యసనాలు
  • తీవ్రమైన అనారోగ్య సమస్యలు
  • స్నేహితులు, కుటుంబం లేదా సహచరులతో సమావేశాలు
  • చట్టపరమైన ఇబ్బందులు
  • అప్పులు ఇవ్వడం లేదా ఆర్థిక విషయాల గురించి అబద్ధం చెప్పడం
  • ఉద్యోగంలోని సమస్యలు
  • వివాహేతర సంబంధాలు

ఒకవేళ మీ భాగస్వామి మీ వద్ద ఏదైనా దాస్తున్నారని మీకు అనిపిస్తే గుర్తు పట్టడం చాలా తేలిక. ఈ పదిహేను లక్షణాల్లో ఎక్కువ మీ లైఫ్‌ పార్టనర్‌లో కనిపిస్తున్నట్టైతే మాత్రం కచ్చితంగా అనుమానించాల్సిందే.  అప్పుడు దానికి అనుగుణంగా మీరు ప్రతిగా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. 

1. మీ మనసు చెప్పేది జాగ్రత్తగా వినండి

ఎవరైనా మీ నుంచి ఏదైనా దాస్తున్నారని చెప్పడానికి కొన్నిసార్లు మీ మనసు చెప్పేది వినండి. ఎందుకంటే అందరికంటే మీ భాగస్వామి మీకు బాగా తెలుసు. వాళ్లు ఏమైనా దాస్తున్నారని అనిపిస్తే మాత్రం మీ మనసుకు ఏదోలా ఉంటుంది. ఆ సంకేతాలు మీ మనసు మీకు చెబుతుంది. ఏదైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు కచ్చితంగా మీ మనసు మీకు ఎప్పుడూ నిజమే చెబుతుంది. దాన్ని విస్మరించవద్దు. 

2. మరీ సీక్రెట్‌గా మారిపోతున్నారా 

ఒకప్పుడు మీ భాగస్వామి వేసిన ప్రతి అడుగు తెలుసుకునే మీకు ఇప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారో తెలియనప్పుడు అనుమానించాలి. ఇది వాళ్లలో వచ్చిన మార్పుల్లో చాల ముఖ్యమైంది. వాళ్లు రోజువారీ అలవాట్లు ఏమైనా మార్చుకున్నారో లేదో గమనించాలి?. సాధారణంగా వచ్చే సమయాని కంటే ఆలస్యంగా ఏమైనా వస్తున్నారా... ఎక్కడ ఎక్కువ గడుపుతున్నారో చూసుకోవాలి. ఇష్టాలు, అభిరుచుల్లో సడెన్‌గా వచ్చిన మార్పులు ఏమైనా ఉన్నాయా?.

3. భావోద్వేగ సాన్నిహిత్యం లోపించిందా?

భాగస్వామి మానసికంగా దూరంగా ఉన్నట్టు అనిపిస్తే రహస్యాలు దాస్తున్నారనేదానికి సంకేతం. ఓ జంట అన్యోన్యంగా ఉండేందుకు భావోద్వేగ సాన్నిహిత్యం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కమ్యూనికేషన్, అనుభవాలతో ఏర్పడే అనుబంధం. అలాంటి సాన్నిహిత్యానికి మీ పార్టనర్‌ దూరంగా ఉంటున్నారంటే మాత్రం మీ భాగస్వామి మానసికంగా అందుబాటులో లేరని అర్థం. ఇలా ఉంటే మాత్రం మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఏదో దాస్తున్నారనే హెచ్చరిక సంకేతంగా తీసుకోండి.

4. పుకార్లు

మీ దాంపత్య జీవితానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు పుకార్లపై నిర్ణయాలు తీసుకోవద్దు. అసూయతో లేదా తప్పుడు సమాచారంతో ఎవరైనా మీ జీవిత భాగస్వామి గురించి పుకార్లను సులభంగా వ్యాప్తి చేయవచ్చు. పుకార్లను పూర్తిగా కొట్టిపారేయొద్దు కూడా. మీరు వింటున్న సమాచారాన్ని మీ వ్యక్తిగత అనుమానాలతో సరిపోల్చండి.

5. భాగస్వామిని చేరుకోవడం కష్టంగా మారిందా

ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా రోజులో ఏదో టైంలో ఓ పలకరింపు.. ఏ మెసేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలు తగ్గిపోతూ... కమ్యూనికేషన్ కట్ అవుతుంటే మాత్రం మీ భాగస్వామి ఏదో దాస్తున్నరనేందుకు ఒక సంకేతం. మీరు మీ జీవిత భాగస్వామిని చేరుకోలేకపోతే... అతను మీకు ఏవైనా నమ్మదగిన కారణాలను చెప్పనట్లయితే మీ రిలేషన్‌కు చెడు సంకేతాలుగా భావించాలి. 

6. లైంగిక సాన్నిహిత్యం లోపించడం

జర్నల్ ఆఫ్ సెక్స్ అండ్ మ్యారిటల్ థెరపీ ప్రచురించిన పరిశోధనలో భావోద్వేగ, లైంగిక ఇంటిమసీని గుర్తించారు. రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆనందాన్ని అంచనా వేసేందుకు ఇందో అత్యుత్తమమైనా టూల్‌గా ఉపయోగపడుతుందన్నారు. మీతో సన్నిహితంగా ఉండటానికి ఆసక్తి లేకపోవడం. అతను వేరొకరితో లైంగిక సంబంధం కలిగి ఉండటం దీనికి కారణం కావచ్చని గ్రహించాలి.

7. భిన్న లైంగిక సాన్నిహిత్యం 

మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఏదో దాస్తున్నారనే సంకేతాలలో మీ లైంగిక జీవితంలో కనిపించవచ్చు. వేరొకరి నుంచి నేర్చుకున్నట్లుగా అనిపించే కొత్త విషయాలు మీ వద్ద ప్రయత్నించవచ్చు. 

8. మీ ప్రమేయం లేకుండా ఏదైనా ప్లాన్ చేయడం 

మీరు, మీ భాగస్వామి కలిసి ప్రతిదీ చేసేవారు, కానీ ఇప్పుడు వారు మీరు లేకుండానే క్రమం తప్పకుండా ప్లాన్‌లు వేస్తున్నారు. ఇది చింతించవలసిన విషయమా? అంటే కావచ్చని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. మీ భాగస్వామికి ఒంటరిగా సమయం లేదా స్నేహితులతో సమయం గడపడానికి ప్రతి హక్కు ఉంది. కానీ ఇది వ్యక్తి ప్రవర్తనకు విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తే, అది మీ జీవిత భాగస్వామికి తెలియజేయడానికి విలువైనదే కావచ్చు. మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఏదైనా దాస్తున్నారనే సంకేతాలను విస్మరించడం వలన మీకు భారీ నష్టం తప్పకపోవచ్చు. 

9. లెక్కా పత్రం లేని ఖర్చు  

మీ ఖాతాలో అకస్మాత్తుగా డబ్బు పోయినందుకు మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఏదైనా దాచిపెడుతున్నారనే భారీ హెచ్చరిక సంకేతాలలో ఒకటి. ఆ వ్యక్తి డబ్బుతో ఇబ్బంది పడుతున్నారని, మీకు తెలియకుండా రహస్యంగా ఖర్చు చేస్తున్నారని సంకేతం కావచ్చు.

10. తరచూ మీతో గొడవ పడుతుంటే. 

వ్యవహారాలు దాచే వ్యక్తులు చిన్న విషయాలకు ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్‌ అవుతారు. మిమ్మల్ని నమ్మకద్రోహులని కూడా నిందించవచ్చు. అపరాధ భావంతో ఇలాంటివి చేస్తుంటారు. 

11. మీవైపు సూటిగా చూడలేకపోతే 

కళ్ళు మనసుకు కిటికీ చాలా మంది అంటారు. కాబట్టి మీ జీవిత భాగస్వామి మీవైపు సూటిగా చూసి మాట్లాడలేకపోతే దాని అర్థం ఏమిటి? ఇరానియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ అండ్ బిహేవియరల్ సైన్సెస్ ఏం చెప్పిందంటే... భాగస్వాముల మధ్య ఐ కాంటాక్ట్‌ మంచి సాన్నిహిత్యాన్ని కల్పిస్తుందని. మీ భాగస్వామి ఏదైనా విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నట్లయితే వాళ్లు మీ వైపు సూటిగా చూసి మాట్లాడలేరు. 

12. అందానికి ప్రాముఖ్యత ఇస్తుంటే.. 

ఇది సర్వసాధారణమే అయినా తరచూ ఎప్పుడూ లేనంతగా అందంపై డ్రెస్‌లపై శ్రద్ద పెట్టారంటే మాత్రం అనుమించాల్సిందే. తనను తాను మెరుగుపరుచుకోవడానికి జిమ్‌కి వెళ్తుండటం... కొత్తవారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉండటం. ఇవన్నీ సంకేతాలే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఏదో దాస్తున్నారనే సంకేతాల్లో ఒకటి కావచ్చు.

13. ఎప్పుడూ ఫోన్‌లో నిమగ్నమై ఉంటే..

సెల్‌ఫోన్ యుగంలో చాలా మంది పక్కవారిని పట్టించుకోవడం మానేసి ఫోన్‌లతోనే కాలక్షేపం చేస్తున్నారు. మీ భాగస్వామి కూడా దీనికి మినహాయింపు కాదు. కానీ... మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఏదైనా దాస్తున్నారనే ప్రధాన సంకేతాలలో ఒకటి ఏమిటంటే... మీ జీవిత భాగస్వామి వారి స్మార్ట్‌ఫోన్ లేకుండా బయటకు వెళ్లలేకపోవడం. వేరే వాళ్లకు అందకుండా ఫోన్‌ తిప్పుతుండటం కూడా ఓ సంకేతమే. మీరు పోన్ ముట్టుకున్నా కోప్పడటం. 

14. టైమింగ్‌ అసలు అర్థం కాదు 

ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్లడం. లేట్‌గా రావడం. రాత్రి డ్యూటీ ఉందని చెప్పి బయటకు వెళ్లడం. నైట్‌ అవుట్‌లు చేయడం ఇవన్నీ ప్రమాదం సంకేతాలే. దీనిపై మీరు ఓ కన్నేసి ఉంచాలి. 

15. మీ ప్రేమను అనుభవించలేరు 

ఇలాంటి అనుమానాలతో మీ భాగస్వామితో ప్రేమగా ఉండలేరు. ఎప్పుడూ ఏదో మానసిక వేదన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటుంది. జీవిత భాగస్వామితో ఉన్నప్పుడు ప్రేమ, విశ్వాసం, ఓదార్పు అనుభవించలేక మధన పడుతుంటారు. 


రహస్య జీవిత భాగస్వామితో ఎలా వ్యవహరించాలి ?

మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఏదైనా దాస్తున్నారనే సంకేతాలలో ఒకటి వారు సీక్రెట్‌గా ఉంటే ఏం చేయాలి? 
మిమ్మల్ని మీరు దృఢ పరుచకోండి. మీ ఫీలింగ్స్‌ను ఒక్కచోట పెట్టండి. మీకోసం మీరు కొంత సమయాన్ని వెచ్చించుకొని వాటిపై మీలో మీరే చర్చించుకోండి. 
మీ రిలేషన్‌లో ఏం జరుగుతుంది. దాని గురించి మీకు ఎలా అనిపిస్తుంది?
మీరు వారిపై నమ్మకాన్ని కోల్పోయేలా మీ భాగస్వామి నిజంగా ఏదైనా చేశారా?
మీరు వారి రహస్యాన్ని పరిశీలిస్తున్నారా లేదా అభద్రత కారణంగా పరిస్థితికి అతిగా స్పందిస్తున్నారా?
మీ జీవిత భాగస్వామితో మాట్లాడండి
ఎవరైనా మీ నుంచి ఏదైనా దాచిపెడుతున్నారనే అన్ని సంకేతాలను మీరు చూసినట్లయితే ఆకస్మికంగా సెర్చ్ చేయండి. సాక్ష్యాలను సేకరించండి. వారి ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ వద్ద దాస్తున్న విషయాలపై కూల్‌గా వారితో మాట్లాడండి. దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తే సాక్ష్యాలు ముందు పెట్టి ప్రశ్నించండి. ఏం జరిగినా ఇద్దరి మధ్యే ఉండేలా చూసుకోండి. ఎక్కడా ఆవేశానికి తావులేకుండా చూసుకోండి. నువ్వుతూనే చేసిన తప్పు అవతలి వ్యక్తికి తెలిసేలా మాట్లాడేందుకు ప్రయత్నించండి. 

ఎలా ప్రోసీడ్‌ అవ్వాలో నిర్ణయించుకోండి
మీ సంబంధంలో సమస్యలు ఉంటే, మీరు తదుపరి ఏమి చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడానికి సమయం ఇవ్వండి. మీ భాగస్వామి నమ్మకద్రోహంగా ఉంటే, మీరు నమ్మకంగా ఉండగలిగే ప్రియమైన వారితో మాట్లాడుకోండి. స్నేహితులు, కుటుంబ సభ్యులను అర్థం చేసుకోవడం ద్వారా భావోద్వేగ మద్దతు లభిస్తుంది. మానసిక క్షోభ తగ్గిస్తుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Amitabh - Allu Arjun: అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
Telangana Talli Statue: పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే లేదు - అసెంబ్లీలో సంచలన విషయం బయట పెట్టిన మంత్రి పొన్నం !
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే లేదు - అసెంబ్లీలో సంచలన విషయం బయట పెట్టిన మంత్రి పొన్నం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Amitabh - Allu Arjun: అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
Telangana Talli Statue: పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే లేదు - అసెంబ్లీలో సంచలన విషయం బయట పెట్టిన మంత్రి పొన్నం !
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే లేదు - అసెంబ్లీలో సంచలన విషయం బయట పెట్టిన మంత్రి పొన్నం !
Bima Sakhi Yojana: 10వ తరగతి పాసైతే చాలు, మహిళలు ఇంట్లో కూర్చుని వేలల్లో సంపాదించొచ్చు! - కొత్త స్కీమ్‌ ప్రారంభం
10వ తరగతి పాసైతే చాలు, మహిళలు ఇంట్లో కూర్చుని వేలల్లో సంపాదించొచ్చు! - కొత్త స్కీమ్‌ ప్రారంభం
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Amazon: ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
Embed widget