Freezer: ఈ ఆహార పదార్థాలు అసలు ఫ్రిజ్‌లో నిల్వ చెయ్యకండి
కొన్ని పదార్థాలు ఫ్రిజ్ లో పెట్టి నిల్వ చేసుకోవడం అంత మంచిది కాదు. దాని వల్ల వాటి సహజత్వం, రుచి కోల్పోతాయి.
కూరగాయలు, పండ్లు, మిగిలిపోయిన కూరలు అన్నింటినీ ఫ్రిజ్ లో పెట్టేస్తారు. బయట నుంచి కొనుక్కుని రాగానే వాటిని సంచుల్లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టేస్తారు. వంటగదిలో అతి ముఖ్యమైన ఉపకరణాల్లో ఫ్రీజర్ కూడా ఒకటి. ఫ్రిజ్ లో ఆహారం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. అయితే ఫ్రీజర్ లో నిల్వ చేయకూడనివి కూడా కొన్ని ఆహారపదార్థాలు ఉన్నాయి. వాటిని ఫ్రిజ్ లో పెట్టడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వీటిని మాత్రం ఫ్రిజ్ లో పెడితే వాటి సహజ గుణాన్ని కోల్పోతాయి. అవేంటంటే..
గుడ్లు
చాలా మంది తమ ఫ్రిజ్ లో తప్పని సరిగా స్టోర్ చేసుకునేవి గుడ్లు. అందరి ఫ్రిజ్ లో ఇవి కనిపిస్తూనే ఉంటాయి. ఇందులో పెట్టడం వల్ల అవి ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటాయని అనుకుంటారు. కానీ వాటిని అసలు ఫ్రిజ్ లో పెట్టకూడదు. గుడ్డు ఫ్రీజ్ చేయాలని అనుకుని రిఫ్రిజిరేటర్ లో పెట్టడం అసలు మంచిది కాదు. గుడ్డు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నప్పుడు దాని షెల్ లోపల పగిలిపోతుంది. అందుకే గుడ్లని నిల్వ చేయడానికి ఫ్రీజర్ మంచి ప్రదేశం కాదు.
చీజ్
గుడ్లు తర్వాత ఎక్కువగా ఫ్రిజ్ లో పెట్టేది చీజ్. కానీ అది ఫ్రిజ్ లో పెట్టడం వల్ల దాని ఆకృతి కోల్పోతుంది. అది ఒక్కోసారి కట్ చెయ్యడానికి వీలు లేకుండా కరిగిపోతుంది. బ్రెడ్ మీద చీజ్ ముక్కలు వేసుకోవాలని అనుకున్నప్పుడు అది సక్రమంగా ఉండదు. అందుకే చీజ్ ఫ్రెష్ గా ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలి.
బియ్యం
బియ్యం అసలు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోకూడదు. అలా చేయడం వల్ల దాని రుచికోల్పోతుంది. అంతే కాదు అవి డీఫ్రాస్ట్ అయి రుచి లేకుండా మారిపోతాయి. అన్నం వండినా కూడా మెత్తగా అయిపోతుంది. ఎక్కువ సేపు నిల్వ ఉండకుండా త్వరగా చెడిపోతుంది కూడా.
పాస్తా
బియ్యం మాదిరి గానే పాస్తా కూడా ఫ్రిజ్ లో పెట్టకూడని పదార్థం. దీన్ని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల స్థిరత్వాన్ని కోల్పోతుంది. అయితే పాస్తా సాస్ మాత్రం పెట్టుకోవచ్చు. సాస్ ముందుగానే తయారు చేసుకోవచ్చు. అయితే పాస్తా మాత్రం విడిగా ఉడికించుకోవాలి. ఆ తర్వాతే పాస్తా సాస్ కలుపుకోవాలి.
బంగాళాదుంపలు
కూరగాయలు తీసుకురాగానే వాటిని శుభ్రంగా కడిగి ఫ్రిజ్ లో పెట్టేసుకుంటారు. వాటితో పాటు బంగాళదుంపలు కూడా పెట్టేస్తారు. కానీ వాటిని ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రత వద్ద దుంపలు ఉంచడటం వల్ల వాటికి మొలకలు వస్తాయి. రుచికరమైన బంగాళాదుంప దీని కారణంగా తినదగనిదిగా మారిపోతుంది. వాటిని చీకటిగా ఉండే అల్మారాలో స్టోర్ చేసుకోవడం ఉత్తమం. ఇప్పుడు ఫ్రిజ్లో కొత్తగా బంగాళాదుంపలు, ఉల్లిపాయలు పెట్టుకునేందుకు అనువుగా ఫ్రిజ్ కింద స్టోరేజ్ ప్లేట్ బాక్స్ వస్తుంది. వాటిలో వేసుకుంటే సరిపోతుంది.
వెల్లుల్లి
వెల్లుల్లిపాయలు ఫ్రిజ్‌లో కంటే గాలి, వెలుతురు ఉండే చోట పెడితే నెలరోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి. వీటిని ఫ్రిజ్‌లో పెడితే జిగురు వస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: డయాబెటిస్ ముదిరితే కిడ్నీలు ఫెయిల్ అవుతాయా?