మనసు బావుండాలంటే ఇవి తినకండి
మనం తీసుకునే ఆహారం మానసిక ఉల్లాసానికి కారణం కావచ్చు లేదా అది మానసిక స్థితిని దిగజార్చనూ వచ్చు.
గత 20 సంవత్సరాల్లో మన జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మారిన ఆర్థిక, సామాజిక స్థితిగతులు, పెరిగిన జీవన వేగం సమాజ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. అందుకే గడిచిన తరాల్లో లేని రకరకాల శారీరక, మానసిక సమస్యలు మనల్ని చుట్టు ముడుతున్నాయి.
మన ఆరోగ్యం.. మనం తినే ఆహారం మీదే 80 శాతం వరకు ఆధారపడి ఉంటుంది. ఆహారపు అలవాట్లు చాలా కీలకమైనవి. శారీరక మానసిక ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. పెరిగిన జీవన వేగం, మారిన అలవాట్లు చాలా ఒత్తిడికి గురిచేస్తోంది. ఫలితంగా చాలామంది ఆంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి మానసిక అనారోగ్యాలకు ఆహారపు అలవాట్లు కూడా కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
ఆల్కహాల్
ఈ మధ్య కాలంలో లింగ బేధం లేకుండా తీసుకోవడం అనేది సంస్కృతిలో భాగంగా మారింది. అయితే ఇది నేరుగా న్యూరోట్రాన్స్ మీటర్ల పనితీరు- మీద ప్రభావం చూపుతుంది. రిలాక్సవడం కోసం మందుకొడుతున్నామని అనేవారు ఎక్కువ. కానీ ఇది ఆంగ్జైటీ, ప్రెషర్ పెంచుతుంది. తరచుగా ఆల్కాహాల్ తీసుకోవడం అలవాటుగా మారడమే కాదు అల్జీమర్స్ వంటి న్యూరో సమస్యలకు కారణం కూడ కావచ్చు.
కాఫీ
తలనొప్పిగా ఉందని కప్పు కాఫీ, లేదా టీ తాగాలని అనుకుంటారు. వీటిలోని కెఫిన్ ఒత్తిడి పెంచుతుంది. కాబట్టి రిఫ్రెష్ కావడానికి హెర్బల్ టీ, కొబ్బరి నీళ్లు, మంచినీళ్లు, పుదీనా టీ వంటివి ప్రయత్నించడం మంచిది.
ఉప్పు
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపి పెరగడం మాత్రమే కాదు, ఇది మానసిక ఆరోగ్యం మీద కూడా తన ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. రక్తపోటు పెరగడం వల్ల అలసటగా అనిపిస్తుంది.
సాచ్యూరేటెడ్ కార్బోహైడ్రేట్లు
మైదా పిండి ఇలాంటి కార్బోహైడ్రేట్లకు చక్కని ఉదాహరణ. మైదా చేసిన ఏ పదార్థమైనా సరే అది సాచ్యూరేటెడ్ కార్బ్స్ అని గుర్తించాలి. వైట్ బ్రెడ్, నూడుల్స్, పాస్తా ఇలాంటివన్నీ కూడా మైదాతో తయారయ్యేవే. తెల్లని అన్నం కూడా సాచ్యూరేటెడ్ కార్బ్స్ కిందకే వస్తుంది. వీలైతే వీటికి దూరంగా ఉండాలి. కనీసం పరిమితుల్లో నైనా తీసుకోవాలి. ఇవి తీసుకునే వారిలో డిప్రెషన్, ఆంగ్జైటీ చాలా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని మానసిక నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
మరి మానసిక ఆరోగ్యంగా ఉండేందుకు ఏం తీసుకోవాలి?
- మానసిక ఆరోగ్యానికి ఫ్రీరాడికల్స్ ఎక్కువగా ఉండని తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
- పని మధ్య తినేందుకుగాను చిరు తిండిగా మొలకలు, సలాడ్ల వంటివి తీసుకోవడం మంచిది.
- సాప్ట్ డ్రింక్స్, కాఫీ, టీల స్థానంలో గ్రీన్ టీ, రిఫ్రెషింగ్ హెర్బల్ టీ వంటివి తీసుకోవచ్చు.
- ప్రతి రోజు తప్పని సరిగా ఒక అరగంట పాటు ఆరుబయట గడపడం కూడా మానసిక ఆరోగ్యానికి అవసరమని నిపుణులు చెబుతున్నారు.
- ఒక చిన్న హాబీ, కొద్ది మంది స్నేహితులు ఉండడం కూడా అవసరమే.
- వేగవంతమైన జీవితంలో రోజులో ఒక గంట పాటు ఆగిచూడడం, సేదతీరడం చాలా అవసరమని ప్రపంచ మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also read: ఆరేళ్ల బాలికకు వింత వ్యాధి, ఈమె శ్వాస తీసుకోవడం మర్చిపోతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.