News
News
X

COVID 19 Antibodies: ఈ కోడిగుడ్ల నిండా యాంటీబాడీలే, కొత్తగా ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్తలు, ఇవి తింటే కరోనా నుంచి సేఫ్

కరోనా ఇంకా ప్రపంచం నుంచి కనుమరుగవ్వలేదు. తన ఉనికికి చాటుతూనే ఉంది.

FOLLOW US: 

కరోనా పోయింది అనుకునేలోపే, కేసులు పెరుగుతున్నయంటూ వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయి. దీంతో ఇంకా మనం సేఫ్ జోన్‌లో ఉన్నట్టే అనుకున్నవారంతా మళ్లీ కంగారు పడుతున్నారు. అంతేకాదు కొన్ని కరోనా వేరియంట్లు మూడు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా కూడా దాడి చేస్తుండడం ఎంతోమందిని కలవరపెడుతోంది. కరోనా వచ్చిన వారికే మళ్లీ మళ్లీ వస్తుండడం కూడా కంగారు పెట్టే అంశమే. అందుకే రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన ఆహారాన్ని తినాలని వైద్యులు సిఫారసు చేస్తున్నారు.కరోనాను తట్టుకునేలా ఆహారాన్ని కనిపెట్టే పనిలో కూడా పడ్డారు. అలా వారి పరిశోధనల ఫలితమే కరోనా యాంటీ బాడీలతో నిండిన కోడిగుడ్లు. వీటిని తింటే కరోనాను తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది.యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు కోడిగుడ్లలో SARS-CoV-2 స్పైక్ ప్రోటీన్‌కు  సంబంధించిన ప్రతిరోధకాలను ఉత్పత్తి చేశారు. కోవిడ్-19 చికిత్సకు లేదా అనారోగ్యానికి గురైన వారు ఈ గుడ్డును తినవచ్చు. 

గుడ్డుకు ఆ శక్తి ఎలా?
మానవులతో పాటూ ఇతర క్షీరదాలలో ఉండే యాంటీ బాడీ IgG. అలాగే పక్షుల్లో కూడా ఇలాంటి యాంటీబాడీ ఉంటుంది. అదే IgY. ఈ యాంటీ బాడీ అలెర్జీ లక్షణాలను కలిగి ఉండదు. అలాగే రోగనిరోధక ప్రతిస్పందనలను ప్రేరేపిస్తుంది. ఈ యాంటీ బాడీ పక్షుల్లోని సీరం, గుడ్లలో ఉంటుంది. ఒక కోడి ఏడాదికి దాదాపు 300 గుడ్లను పెడుతుంది. దీన్ని బట్టి ఆ గుడ్ల ద్వారా ప్రజలకు బోలెడన్ని యాంటీబాడీలు లభిస్తాయి. గుడ్లను మరింత శక్తిమంతంగా మార్చేందుకు శాస్త్రవేత్తలు మూడు వేర్వేరు వ్యాక్సిన్లను రెండు మోతాదుల్లో కోళ్లకు అందించారు. తరువాత అవి గుడ్లు పెట్టాయి. ఆ గుడ్డు సొనల నుంచి రక్త నమూనాలను సేకరించి పరిశీలించారు. అందులో కోవిడ్ ప్రతిరోధకాలు కనిపించాయి. దీన్ని బట్టి కోళ్లకు ఇచ్చిన వ్యాక్సిన్లలోని యాంటీబాడీలు గుడ్లను మరింత శక్తిమంతమైన యాంటీబాడీలతో నింపాయి. 

ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన గల్లార్డో మాట్లాడుతూ ‘కోళ్లకు ఇచ్చిన వ్యాక్సిన్ల వల్ల గుడ్లు కూడా  SARS-CoV-2ని నిరోధించే ప్రతిరోధకాలు ఉన్నాయి. ఇవి వైరస్ ను తటస్థీకరించడంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి’ అని వివరించారు. ఈ గుడ్లను తిన్నా మంచిదే, లేదా వీటిలోని ప్రతిరోధకాను సేకరించి స్ప్రే వంటి చికిత్స విధానాలలో ఉపయోగించాలని భావిస్తోంది. ఏది ఏమైనా కరోనా చికిత్స విషయంలో ఇది మంచి ఆవిష్కరణ అనే చెప్పాలి.  

Also read: ‘పొమాటో’ మొక్కకు కాసిన ‘బ్రిమాటో’ కూరగాయ ఇదిగో, వండుకుని తింటే ఆ రుచే వేరు

Also read: ప్రపంచంపై దాడికి సిద్ధంగా ఉన్న మరో వైరస్ మహమ్మారి ‘మార్బర్గ్’, ఇది కూడా ఎబోలా లాంటిదే, ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

Published at : 19 Jul 2022 02:38 PM (IST) Tags: Antibodies Chicken Eggs and Corona Virus Eggs with Corona antibodies

సంబంధిత కథనాలు

Fish Rice: ఫిష్ ఫ్రైడ్ రైస్, ఇంట్లో ఈజీగా ఇలా చేయచ్చు

Fish Rice: ఫిష్ ఫ్రైడ్ రైస్, ఇంట్లో ఈజీగా ఇలా చేయచ్చు

గుండె జబ్బులు రాకూడదంటే ఈ ఆహారాన్ని తీసుకోండి

గుండె జబ్బులు రాకూడదంటే ఈ ఆహారాన్ని తీసుకోండి

ఖాళీ కడుపున బ్రెడ్ తింటున్నారా? అయితే ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్టే!

ఖాళీ కడుపున బ్రెడ్ తింటున్నారా? అయితే ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్టే!

Face Rollers: ఈ ఫేస్ రోలర్ టూల్ వల్ల ఉపయోగమేంటి? అందం పెరుగుతుందా?

Face Rollers: ఈ ఫేస్ రోలర్ టూల్ వల్ల ఉపయోగమేంటి? అందం పెరుగుతుందా?

National Rum Day: రమ్ తాగుతారా? దాన్ని దేనితో తయారుచేస్తారో తెలిస్తే షాకైపోతారు

National Rum Day: రమ్ తాగుతారా? దాన్ని దేనితో తయారుచేస్తారో తెలిస్తే షాకైపోతారు

టాప్ స్టోరీస్

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ-  పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు !  విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?