అన్వేషించండి

Food Toxins: మనం తినే ఆహారాల్లో ఉండే ఆరు విష సమ్మేళనాలు ఇవే, వీటిని ఎక్కువ తింటే అంతే సంగతులు

ఆహారంలో కొన్ని రకాల విషపదార్థాలు కలుస్తాయి. వీటికి సంబంధించి చాలా వాదనలు ఉన్నాయి.

సహజంగా పండే ఏ ఆహారమూ కూడా విషపదార్థాలను కలిగి ఉండదు, కానీ వాటితో కొన్ని రకాల ఆహారాలను తయారు చేసినప్పుడు అనుసరించే పద్ధతులే సమస్యల్ని తెచ్చి పెడతాయి. ఉదాహరణకు బియ్యం పండినప్పడు అవి చాలా ఆరోగ్యకరమైనవి కానీ వాటిని మిషన్లలో పాలిష్ కొట్టి కొట్టి రోగా కారకంగా మార్చేస్తున్నారు. అలాగే కొన్ని రకాల ఆహారాల తయారీ ప్రక్రియల్లో విష సమ్మేళనాలు పుట్టుకొస్తున్నాయి. ఈ విషయంపై చాలా తక్కువ మందికే అవగాహన ఉంటుంది. ముఖ్యంగా ఆరు రకాల విష సమ్మేళనాలు మనిషి ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. 

 బీపీఏ (బిస్ ఫినాల్ ఏ)
‘బీపీఏ ఫ్రీ’ అంటూ చాలా వస్తువులపై రాసి ఉండడం చూసుంటారు. ఎప్పుడైనా ఆలోచించారా అదేంటో? బీపీఏ అనేది ఒక రసాయనం. ఇది ప్లాస్టిక్ బాక్సులు, ఫుడ్ బాక్సు లైనింగులు, రశీదులు, స్టాంపుల్లో ఉపయోగించే కాగితాలలో అధికంగా కనిపిస్తుంది.  క్యాన్డ్ ఆహారాలు కొనడం ఇప్పుడు ఎక్కువైపోయింది. క్యాన్లలో ప్యాక్ చేసి అమ్ముతున్న పచ్చళ్లు, గులాబ్ జామ్‌లు, రసగుల్లాలు... ఇలా చాలా ఆహారాలు మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ క్యాన్ల నుంచి బీపీఏ రసాయనం  ఆహారంలోకి చేరుతుంది. ఈ రసాయనం స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజెన్‌లాగా పనిచేస్తుంది. అనేక ఆరోగ్యసమస్యలను తెచ్చి పెడుతుంది.  రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే టైప్ 2 డయాబెటిస్, ఊబకాయంతో కూడా ఇవి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. 

కృత్రిమ ట్రాన్స్ ఫ్యాట్స్
ఆర్టిఫిషియల్ ట్రాన్స్ ఫ్యాట్స్ ప్యాక్ చేసిన ఆహారాల్లో అధికంగా చేరే అవకాశం ఉంది. అధిక ప్రాసెస్ చేసి అమ్మే ఆహారాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. బయట చాలా చిరుతిళ్లను ప్రాసెస్ చేసిన ఆహారంతో వండుతారు.  పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, నాన్ వెజ్ రోల్స్, నూనెలో బాగా డీప్ ఫ్రై చేసే వేపుళ్లు, బజ్జీలు వంటివాటిలో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా లభిస్తాయి. ఇవి తినడం వల్ల గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. కొన్ని జంతు ఆధారిత ఆహారాలు, సహజంగా లభించే ట్రాన్స్ ఫ్యాట్‌లను కలిగి ఉండవచ్చు. అయితే ఇవి ప్రాసెస్డ్ ఆహారంలో ఉన్న ఆర్టిఫిషియల్ ట్రాన్స్‌ఫ్యాట్ లాగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించవు. 

పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు
వీటిని షార్ట్‌కట్‌లో PAHలు అంటారు. వీటిని పర్యావరణ కాలుష్య కారకాలుగా పరిగణిస్తారు. ఇవి అధికంగా సేంద్రీయ పదార్థాలను కాల్చడం వల్ల పుడతాయి. అలాగే ఇవి కొన్ని ఆహారాల్లో కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు మాంసాన్ని కాల్చినప్పుడు, చేపలను కాల్చినప్పుడు ఇవి విడుదలవుతాయి. ఇప్పటికీ కోళ్లను కాల్చే అలవాటు ఉంది పల్లెటూళ్లలో. ఆ స్మోకీ ఫ్లేవర్ కూరకి కొత్త రుచిని అందిస్తుందని భావిస్తారు. స్మోక్డ్, గ్రిల్డ్ మాంసాలు ఆహారంలో ఇప్పుడు ప్రధానంగా మారిపోయాయి. కానీ వీటిని వండేటప్పుడే ఈ PAHలు అధికంగా విడుదలవుతాయి. వీటి వల్ల రొమ్ము, మూత్రపిండాలు, పెద్ద పేగు, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. 

దాల్చిన చెక్కలో ఉన్న కొమారిన్
దాల్చిన చెక్కలో కనిపించే ఒక విషపూరిత సమ్మేళనం కౌమరిన్. అధిక మోతాదులో దీన్ని తింటే క్యాన్సర్ రావడంతో పాటూ కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. దాల్చిన చెక్క వాడకాన్ని తగ్గించుకుంటే కొమారిన్ శరీరంలో చేరే అవకాశం తగ్గుతుంది.   

అదనపు చక్కెరలు 
చక్కెర ప్రమాదకారకమని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి. మనం రోజూ వాడే చక్కెరలో అధికంగా ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్, ఫ్యాటీ లివర్ డిసీజ్, క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. చక్కెరతో చేసిన పదార్ధాలన్నీ అధికంగా ప్రాసెస్ చేస్తారు. సోడాలు, కూల్ డ్రింకులు, డిజర్ట్ లు, చక్కెరతో చేసిన స్వీట్లు అధికంగా తింటే సమస్యలు తప్పవు. 

చేపలలో పాదరసం
చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ నదులు, సముద్రాలను మానవులు కలుషితం చేశారు. దీని వల్ల నీటిలోని మొక్కలు పాదరసంతో విషపూరితం అవుతాయి. వాటిని చిన్నచేపలు తింటాయి. వాటి శరీరంలో పాదరసం చేరుతుంది. చిరు చేపని పెద చేప, పెద చేపని పెను చేప తిని చాలా చేపల్లో పాదరసం చేరుతోంది. వాటిని తిన్న మనిషిలోకి పాదరసం చేరి మెదడు నరాలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా గర్భిణులు తింటే పుట్టబోయే బిడ్డ నాడీ సంబంధిత సమస్యలతో పుట్టే అవకాశం ఉంది. 

Also read: ఇలాంటి చెట్ల కిందకు వెళ్తే ప్రమాదాన్ని పాకెట్లో పెట్టుకున్నట్టే!

Also read: స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ మంకీపాక్స్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారు?

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget