Foods To Avoid In Winters: వింటర్‌లో వీటిని అస్సలు తినకూడదు - చాలా చాలా డేంజర్
Foods To Avoid In Winters: చలికాలంలో అనేక వ్యాధులకు స్వాగతం పలుకుతుంది. ఈ కాలంలో చాలా మంది రోగాల బారినపడుతుంటారు. చలికాలంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అవేంటో చూద్దం.
Foods To Avoid In Winters: చలికాలంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏమాత్రం ఏమరుపాటున ఉన్నా రోగాలు చుట్టుముడుతుంటాయి. ఎప్పుడు ఏ వ్యాధి అటాక్ చేస్తుందో అర్థం కాదు. ఈ కాలంలో ఆరోగ్యంతోపాటు మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రస్తుతం కోవిడ్ వైరస్ కూడా చాప కింద నీరులా వ్యాపిస్తున్న నేపథ్యంలో మనం తప్పకుండా ఈ సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలి. 2024లో మీ లైఫ్.. హెల్తీగా ఉండాలంటే.. చలికాలంలో కొన్ని ఆహారాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఈ సీజన్‌లో ఎలాంటి ఫుడ్స్ కు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చల్లని ఫుడ్స్, పానీయాలు:
మనలో చాలా మందికి కాలం ఏదైనా సరే శీతల పానీయాలు, ఐస్ క్రీమ్ తో సహా చల్లని ఆహారా పదార్థాలు తినే అలవాటు ఉంటుంది. శీతాకాలంలో చల్లని పదార్థాలు, పానీయాలు తీసుకోవడం చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు. చలికాలంలో వేడి వేడి పదార్థాలు తీసుకోవాలి. చల్లనిపదార్థాలు తింటే జీర్ణం కావడానికి సమయం పడుతుంది. చల్లనిపాలు, శీతలపానీయాలు మీ ఇమ్యూనిటీని దెబ్బతీస్తాయి. దీంతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు దారి తీస్తుంది.
2. వేయించిన ఆహారాలు:
చలికాలంలో వేయించిన ఆహారం వేడి వేడిగా తింటే ఆ మజానే వేరుంటుంది. కానీ ఈ శీతాకాలంలో వేయించిన ఆహారం తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేయించిన ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది అనారోగ్యానికి కారణమే కాకుండా హానికరం కూడా.
3. ప్రిజర్వ్డ్ ఫుడ్:
శీతాకాలంలో ప్రాసెస్డ్ ఫుడ్ వీలైనంత వరకు తగ్గించండి. చాలా మంది జంక్ ఫుడ్ ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతుంటారు. క్యాన్డ్ ఫుడ్, చల్లని ఆహారాలు ఆరోగ్యానికి హానికరం. అందులో ఎలాంటి పోషక విలువలు ఉండవు. ఇవి ఫ్రీ రాడికల్స్ , టాక్సిన్ లను ఎదుర్కొనేందుకు ఇమ్యూనిటిని తగ్గిస్తాయి. ప్రాసెస్ ఫుడ్ తింటే మీకు రుచిగా అనిపించినప్పటికీ అవసరమైన పోషకాలను అందించకుండా.. కేలరీలను పెంచుతాయి. దాని వల్ల మీరు అనారోగ్యం బారిన పడతారు.
4. పచ్చికూరగాయలు:
చాలామందికి పచ్చికూరగాయలు తినే అలవాటు ఉంటుంది. పచ్చికూరగాయల్లో పోషకాలు ఉన్నప్పటికీ ..శీతాకాలంలో తింటే జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాదు పచ్చిఆహారం శరీరంలో పరాన్నజీవులు, బ్యాక్టీరియాను పెంచే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుంది. మీ రోగనిరోధకశక్తిని పెంచేందుకు సరైన శరీర పనితీరును మెరుగుపరిచేందుకు శీతాకాలంలో వెచ్చని, పోషకవిలువలు ఉన్న ఆహారాన్ని తినడం మంచిది.
Also Read : ఈ దోశ బరువును, మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది.. రెసిపీ ఇదే - ఈ రోజే ఇంట్లో ట్రై చేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.