Food for memory: చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతున్నారా? వీటిని తింటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది
Food for memory: వయస్సు పెరిగేకొద్ది జ్ఞాపకశక్తి తగ్గుతుంది. బలహీనమైన జ్ఞాపకశక్తి మన దైనందిన జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జ్ఞాపకశక్తికి పదును పెట్టడంలో కొన్ని ఆహారాలు ఉపయోగపడతాయి.
Food for memory: ఈ రోజుల్లో బిజీ లైఫ్ వల్ల విశ్రాంతి తీసుకునేందుకు కూడా సమయం దొరకడం లేదు. రోజులో ఎక్కువ సమయం ఆఫీస్ పనులు, ఇంటిపనులు ఇతరాత్ర విషయాలతో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడం చాలా వరకు తగ్గింది. ఫలితంగా మన మెదడు ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. రోజువారీ ఒత్తిడి, అలసట, పోషకాల కొరత మొదలైన వాటి కారణంగా, మెదడు పనితీరు క్షీణిస్తుంది. అది మెమరీపై ప్రభావం చూపుతుంది. అయితే మీ డైట్‌లో ఏయే ఆహార పదార్థాలను చేర్చుకోవడం ద్వారా మీ జ్ఞాపకశక్తికి పదును పెట్టవచ్చు.
నట్స్:
బాదం, వాల్‌నట్‌లు మీ మెదడుకు సూపర్ ఫుడ్స్ లాంటివి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ-ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తాయి. దీని కారణంగా, మీ మెదడు కణాలు సేఫ్‌గా ఉంటాయి. మరింత మెరుగ్గా పని చేస్తాయి. కాబట్టి నిత్యం మీ డైట్లో నట్స్ చేర్చుకోవడం మంచిది.
సాల్మన్ ఫిష్:
సాల్మన్ చేపలో పెద్ద మొత్తంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మెదడులో న్యూరాన్‌ల తయారీకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ముఖ్యమైనవి. అందువల్ల, మీ ఆహారంలో సాల్మన్ చేపలను చేర్చడం ద్వారా, మీరు మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది.
డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్‌లు ఉంటాయి. ఇవి మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి మన మెదడులోని ఆక్సిడేటివ్ డ్యామేజ్‌ని తగ్గిస్తాయి. దీని వల్ల మెదడు పనితీరులో ఎలాంటి సమస్య ఉండదు.
బ్రోకలీ:
యాంటీ-ఆక్సిడెంట్లతో పాటు, విటమిన్ K కూడా బ్రోకలీలో సమృద్ధిగా లభిస్తుంది. ఇవి మీ మెదడుకు చాలా అవసరం. అందువల్ల, దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ జ్ఞాపకశక్తిని బలోపేతం చేయవచ్చు.
బెర్రీలు:
యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బెర్రీలలో కనిపిస్తాయి. ఇవి మీ మెదడుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మన మెదడులో ఉండే కణాలు వయస్సుతో పాటు ఆక్సీకరణకు గురవుతాయి. దాని కారణంగా అవి క్రమంగా బలహీనంగా మారతాయి. జ్ఞాపకశక్తి బలహీనపడవచ్చు.
కూరగాయలు:
కూరగాయల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. పచ్చి కూరగాయలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. అయితే కూరగాయలతో పాటు పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. క్యాప్సికమ్, క్యారెట్, బ్రకోలీ మొదలైన వాటిలో లభించే పోషకాలు మెదడు పనితీరు మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా బచ్చలికూర, కొత్తిమీర, శనగలు, ఆకుకూరలు వంటివి తీసుకోవడం వల్ల మెమోరీ చురుగ్గా ఉంటుంది.
పుచ్చకాయ గింజలు :
పుచ్చకాయ, గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐరన్, జింక్, కాపర్ వంటి పోషకాలు గుమ్మడికాయలో ఉంటాయి. ఇవి మెదడుకు పదును పెట్టడంలో సహాయపడతాయి. వీటిని ఓట్స్‌లో కలిపి తినొచ్చు.
Also Read : చలికాలంలో సన్‌షైన్ విటమిన్ చాలా అవసరమట.. ఎందుకంటే..
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.