National Survey: కొడుకు పుట్టాలని కోరుకునే జంటల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది, సర్వేలో తేలిన విషయం
కాలం మారినా ఇంకా కొడుకే కావాలని కోరుకునే వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉన్నట్టు ఓ సర్వేలో బయటపడింది.
గతంతో పోలిస్తే ఆడపిల్లల విషయంలో చాలా మెరుగుదల కనిపిస్తోందనే చెప్పాలి. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక అబ్బాయి కోసం మూడోసారి ప్రయత్నించే తల్లిదండ్రుల సంఖ్య తగ్గిందనే చెప్పుకోవాలి. అయితే వారి మనసులో మాత్రం మగపిల్లాడు ఉండాల్సిందేనన్న కోరిక మాత్రం ఉండిపోతోంది. ఈ విషయం ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో బయటపడింది. ఈ జాతీయ సర్వేలో పాల్గొన్న దాదాపు 80 శాతం జంటలు తమకు ఒక మగపిల్లాడు కావాలన్న కోరికను వ్యక్తం చేశారు. ఇద్దరూ ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు నిరాశను కూడా బయటపెట్టారు. కాలం ఎంత ఆధునికంగా మారుతున్నప్పటికీ ఈ అభిప్రాయం మాత్రం ఇంకా మారకపోవడం కాస్త శోచనీయమైన అంశమే.
నిష్పత్తి తగ్గింది కానీ...
జనాభా లెక్కలను గత వందేళ్లుగా లెక్కిస్తూనే ఉన్నారు. ప్రతిసారి మగవారి సంఖ్యే అధికంగా ఉంటూ వచ్చింది. 2011లో చేసిన జనాభా లెక్కల్లో వేయి మంది పురుషులకు 940 మంది మహిళలు ఉన్నట్టు తేలింది. అలాగే పిల్లల నిష్ఫత్తిని గమనిస్తే ప్రతి 1000 మంది మగపిల్లలకు 918 మంది ఆడపిల్లలే ఉన్నారు. ఇప్పుడు 2019-21 మధ్య జరిగిన జాతీయ సర్వేలో మాత్రం ఆడపిల్లల సంఖ్య పెరిగినట్టు తేలింది. లింగ నిష్పత్తిలో ఆడపిల్లలు సంఖ్య అధికంగా ఉంది. ఇది స్వాగతించదగ్గ మార్పు. అయితే అబ్బాయి కావాలన్న తల్లిదండ్రలు కోరికలో మాత్రం మార్పు రాలేదని సర్వే తెలియజేసింది.
సర్వేలో పాల్గొన్న పురుషులలో పురుషులు, స్త్రీలు ఇద్దరూ అధికంగా తమకు కొడుకు కావాలని కోరుకున్నారు. మగ పిల్లాడు పుట్టాలని పూజలు చేసే వారు కూడా అధికంగా ఉన్నట్టు తేలింది. ఇద్దరు ఆడపిల్లలు పుడితే మగపిల్లాడి కోసం వెయిట్ చేసిన తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఇద్దరు మగపిల్లలు పుట్టాక ఆడపిల్ల కోసం వెయిట్ చేసిన తల్లిదండ్రులు కనిపించకపోవడం గమనార్హం.
సంపూర్ణ కుటుంబం అంటే...
సర్వేలో పాల్గొన్న చాలా మంది అబ్బాయి, అమ్మాయి ఇద్దరు కలవారేనని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా, ఇద్దరు మగపిల్లలు పుట్టినా సంపూర్ణ కుటుంబం కాదని తమకు ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్ల కావాలని కోరుకునే వారూ ఉన్నారు. కాకపోతే గతంలో పోలిస్తే ఆడపిల్లలు పుట్టాలని కోరుకునే వారి సంఖ్య ఒక శాతం పెరిగింది.
Also read: కొవ్వును కరిగించే లైపోసక్షన్ ఆపరేషన్ ఎలా చేస్తారు? అది ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది?
Also read: అమ్మవారులా కనిపించే మంకీపాక్స్, ఆఫ్రికాలో పుట్టి ఇతర దేశాలకు పాకుతున్న వైరస్