అన్వేషించండి

Bright Side of Divorce : విడాకులను గొడవలు లేకుండా కూడా తీసుకోవచ్చట.. పిల్లలకోసం ఇలా చేయొచ్చు అంటున్న నిపుణులు

Divorce Wellness : భార్యభర్తలు విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత ఆ ఎఫెక్ట్ పిల్లలపై పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే.. ఇలా ప్రోసీడ్ అవ్వొచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఎలా?

Relationship Tips from Experts : భార్యభర్తలుగా రిలేషన్​లో ఉండలేక.. దానిని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో  కొందరు విడాకులు తీసుకుంటారు. అలా విడిపోయిన వారిని చుట్టూ ఉండేవారు ప్రశాంతంగా ఉండనివ్వరు. భర్త నుంచి భరణంగా ఆస్తులను తీసుకో.. లేదంటే ఇతరత్రా కేసులు వారిపై పెట్టు అని చెప్పేవారు ఉంటారు. అలాగే భార్యను నలుగురిలో బ్లేమ్ చేయి అని చెప్పేవారు కొందరు ఉంటారు. మీరు నిజంగా రిలేషన్​ నుంచి బయటకు వెళ్లిపోవాలని మీరిద్దరూ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలాంటి నెగిటివిటీ లేకుండా కూడా ఆ రిలేషన్​ నుంచి బయటపడొచ్చు అంటున్నారు నిపుణులు. ఇది మీకు, పిల్లలకు కూడా చాలా మంచిది అంటున్నారు. 

పోరాటాలు లేని నిర్ణయాలే మంచివట..

తాజాగా అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో విడాకుల రేటు తగ్గుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పలువురు నిపుణులు విడాకులపై ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపారు. దంపతులు విడిపోవాలనుకున్నప్పుడు నెగిటివ్​గా, ఒకరిపై ఒకరు ద్వేషాలు పెంచుకుని విడిపోవాల్సిన అవసరం లేదని.. ఫ్రెండ్లీగా మాట్లాడుకుని.. విడాకులు తీసుకోవచ్చని చెప్తున్నారు. కస్టడీలు, పోరాటాలు చేయాల్సిన అవసరం లేదని.. విడిపోవడం ఎప్పుడూ బాధగానే జరగాల్సిన అవసరం లేదని.. విడిపోయినా.. ఒకరికొకరు తోడున్నారనే ఫీలింగ్​తో కూడా హ్యాపీగా లైఫ్​ లీడ్ చేయవచ్చు అంటున్నారు. 

టాక్సిక్​గా ఉండాల్సిన అవసరం లేదు..

విడిపోవడంలో తోడు ఏంటో అనుకుంటున్నారేమో.. ఇద్దరు మంచి వ్యక్తులు కూడా కలిసి కాపురం చేయడం కొన్ని సందర్భాల్లో కష్టతరం ఉంటుంది. అలాంటప్పుడు వారి మధ్య రిలేషన్ టాక్సిక్ అవుతుందనుకున్నప్పుడు విడాకులు తీసుకునేవారు కొందరు ఉంటారు. అలాంటివారు ఇతరుల మాటలు విని ఉన్న రిలేషన్​ని పాడుచేసుకోకుండా.. హ్యాపీగా విడిపోతే.. అది వారికి.. పిల్లలకి కూడా మంచిది అవుతుంది అంటున్నారు ఎక్స్​పర్ట్స్. విడాకుల తర్వాత పిల్లలు తల్లితో ఉండాలన్నా.. తండ్రిని మీట్​ అవ్వాలన్నా ప్రశాంతమైన వాతావరణం దొరుకుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఓ రిలేషన్​లో భార్యభర్తలకి ప్రాబ్లమ్ ఉంటే.. పిల్లల్ని చూసుకోవడం కోసం వారిద్దరూ విడిపోయి.. మరో మంచి మార్గంతో పిల్లలకి కేర్ ఇవ్వొచ్చని చెప్తున్నారు. 

ఒంటరితన్నాన్ని ఇలా ఓడించండి..

ఎవరూ కూడా విడాకులు తీసుకోవాలని.. పెళ్లి చేసుకోరని.. కలిసే ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లిళ్లు చేసుకుంటారని.. తర్వాత వారిమధ్య జరిగే పరిస్థితులు విడాకులకు దారితీస్తాయని చెప్తున్నారు. ఇద్దరూ కలిసి సంతోషంగా లేకపోయినా.. విడిపోయి కూడా మంచి అనుబంధాన్ని కొనసాగించడంలో ఎలాంటి తప్పులేదని చెప్తున్నారు. అంతేకాకుండా విడాకుల తర్వాత చాలామంది ఒంటరిగా ఫీల్ అవుతారని.. ఆ సమయంలో మీ ఒంటరితనాన్ని దూరం చేసే పనులు చేయవచ్చని చెప్తున్నారు. ఫ్రెండ్స్​కికాల్ చేసి.. వీకెండ్ కలవడమో.. లేదా బయటకు వెళ్లడం లాంటివి చేయవచ్చని తెలిపారు. మీ చుట్టూ విడాకులకు ముఖ్యంగా మీ ఫీలింగ్స్​కు వాల్యూ ఇచ్చేవారు ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. దీనివల్ల ఆ ట్రోమా నుంచి త్వరగా బయటపడొచ్చు అంటున్నారు. 

పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వొచ్చు..

విడాకుల నుంచి బయటపడేవారు ఒకరితో ఒకరు కలిసి ఉండకపోవచ్చు కానీ.. ఇరువురు కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చని చెప్తున్నారు. అందరికీ ఇలాంటి రిలేషన్ సాధ్యం కాకపోవచ్చు. కానీ.. కొన్ని సందర్భాల్లో మీరు ఇలాంటి స్నేహాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సి వస్తే అది తప్పేమో అని ఆలోచించకండి. ఎందుకంటే మీరిద్దరూ మీ రిలేషన్​కి బెస్ట్ ఇవ్వలేకపోవచ్చు కానీ.. ఇద్దరూ కలిసి.. కోపేరెంట్స్​గా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వొచ్చంటున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత వెంటనే వేరే రిలేషన్​లోకి వెళ్లకుండా.. మీ మాజీ భాగస్వామికి మీరు ఏమైనా హెల్ప్ చేయగలిగే అంశాలు ఉంటే.. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు. అది ఆదాయపరంగా కావొచ్చు.. లేదా మానసికంగా కావొచ్చు. ఇదేమి తప్పుకాదని నిపుణులు చెప్తున్నారు.

భావోద్వేగాలను వారి ముందు కంట్రోల్ చేసుకోండి..

విడాకుల సమయంలో భాగస్వాములు విభిన్న భావోద్వేగాలకు గురవుతారు. ఆ సమయంలో కాస్త ఒత్తిడిని తగ్గించుకుని.. క్లాస్​గా దీనిని డీల్ చేయవచ్చు అంటున్నారు. విడాకుల తర్వాత మీ మాజీ భాగస్వామి ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటే.. ఓసారి కాల్ చేసి వారి యోగ క్షేమాలు తెలుసుకోవచ్చని.. ఎవరో ఏదో అనుకుంటారని ఆగిపోవద్దని చెప్తున్నారు. ఇది మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వడంలో హెల్ప్ చేస్తుందంటున్నారు. విడిపోయారు కాబట్టి పిల్లలను ఏకపక్షంగా పెంచాలనే ఆలోచన పూర్తిగా మీ మీదనే ఉంటుంది. అంతేకాకుండా తల్లిదండ్రులతో కలిసి కొత్త వ్యవస్థను నావిగేట్ చేయడంలో మధ్యవర్తిని తీసుకురావడం అత్యంత ప్రభావవంతమైన విధానాలలో ఒకటి అంటున్నారు.

పిల్లలకు ఇద్దరూ భరోసానివ్వాలి..

కో పేరెంట్స్​గా మారిన తర్వాత.. మీ భావాలను పిల్లలపై రుద్దకుండా.. మీరు సొంతంగా వాటిని అధిగమించేలా చూసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే పిల్లలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లల ముందు ఏమి మాట్లాడుకోవాల్సిన వచ్చిన కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇద్దరూ కూడా పిల్లలకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నామనే భరోసానిస్తే వారు, మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చంటున్నారు. పెళ్లిలో సమస్యలతో డిస్​కనెక్ట్ అయిన మీరు.. మరొక సంబంధంలో.. మీ విలువలు కాపాడుకుంటూ.. మళ్లీ కనెక్ట్ అవ్వొచ్చని సూచిస్తున్నారు. జీవితంలో అత్యంత బాధకలిగించే విషయాలే ఎక్కువ ఎదగడానికి సహాయం చేస్తాయనే మాటతో తమ అభిప్రాయాలు ముగించారు. 

Also Read :  కరోనా తర్వాత పెళ్లిళ్లు పెరుగుతున్నాయట.. విడాకులు తగ్గుతున్నాయట.. కారణమిదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
Embed widget