Tesla Car: మరీ అంత కక్కుర్తా? ట్రాఫిక్ జామ్‌లో టెస్లా కారు డ్రైవర్ పాడుపని.. ఇలా చిక్కేశాడు!
ట్రాఫిక్ జామ్‌లో అస్సలు టైమ్ వేస్ట్ చేయకూడని అనుకున్నాడో ఏమో.. కారు స్క్రీన్‌లో అశ్లీల చిత్రాలు చూస్తూ అడ్డంగా దొరికిపోయాడు.
మీరు కారులో వెళ్తున్నారు. ఓ చోట ట్రాఫిక్ జామ్ అయ్యింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? కాసేపు పాటలు వినడమో.. మొబైల్ చూస్తేనో కాలక్షేపం చేస్తారు కదూ. కానీ, అతడు మాత్రం ఏకంగా అశ్లీల చిత్రాలు చూస్తూ టైంపాస్ చేశాడు. అయితే, అదేదో మొబైల్‌లో చూసి ఉంటాడని అనుకుంటే పొరపాటే. అతడు ఏకంగా కార్లో నేవిగేషన్ కోసం ఉపయోగించే స్క్రీన్లో వాటిని చూశాడు. పిల్లి కల్లు మూసుకుని పాలు తాగుతున్నట్లుగా.. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి.. అశ్లీల చిత్రాలు చూస్తూ ఆనందించాడు. వాహనదారులు ఆ కారులోని స్క్రీన్‌పై కనిపించిన దృశ్యాలు చూసి షాకయ్యారు. ఓరి నీ కక్కుర్తి తగలెయ్యా అంటూ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలోకి వదిలారు. అంతే.. ఆ వీడియో వైరల్‌గా మారింది.
సౌత్ లండన్‌లోని అడింగ్టన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్యాన్ కిచెనర్ రూ.76 లక్షలు విలువ చేసే తన Tesla S కారులో షికారుకు వెళ్లాడు. మార్గమధ్యలో ట్రాఫిక్ జామ్ వల్ల కారు నెమ్మదిగా ముందుకు నడిపాడు. నెమ్మదిగా.. ఆగుతూ.. కదులుతూ వెళ్తున్న ఆ కారును చూసి వెనుక ఉన్న వాహనదారులు విసిగిపోయారు. ఆ కారులోకి తొంగి చూశారు. డ్రైవర్.. ఆ కారులో అశ్లీల ఫొటోలను బ్రౌజ్ చేస్తూ బిజీగా కనిపించాడు. అమ్మాయిలు నగ్నంగా ఫొటోలను జూమ్ ఇన్.. జూమ్ ఔట్ చేయడం చూసి తిట్టుకున్నారు. ఆ ఫొటోలు, వీడియోలను పోలీసులకు కూడా పంపారు.
Also Read: అబ్బాయిలూ జాగ్రత్త.. పాలతో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు? ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?
సాధారణంగా కార్లలో డ్రైవర్ వద్ద ఉండే స్క్రీన్లలో నేవిగేషన్ తదితర ఆప్షన్లతోపాటు వీడియో స్ట్రీమింగ్, ఫొటోలు బ్రౌజింగ్ చేసే సదుపాయాలు కూడా ఉంటాయి. కానీ, వాటిని డ్రైవింగ్ చేసేప్పుడు ఉపయోగించకూడదు. అయితే, రద్దీ రోడ్డుపై డ్రైవింగ్ చేస్తూనే ఆ ఫొటోలు చూశాడు. మరి, పోలీసులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది ఇంకా తెలియరాలేదు. మీరు మాత్రం ఎప్పుడూ అలా చేయకండి. అంటే.. కారు రన్నింగ్‌లో ఉన్నప్పుడు వీడియోలు, ఫొటోలను చూస్తూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం.