By: ABP Desam | Updated at : 13 Apr 2022 07:53 PM (IST)
Edited By: Suresh Chelluboyina
Image Credit: Caters Clips/YouTube
Teenager with tail | మనిషి కోతి నుంచి వచ్చాడని, కాలక్రమేనా పరిణామక్రమంలో తోకలు మాయమయ్యాయని చెబుతుంటారు. మరి, ఇందులో వాస్తవం ఎంతో తెలీదుగానీ.. మనుషులకు తోకలు ఉండవనేది మాత్రం పచ్చి నిజం. అయితే, నేపాల్‌కు చెందిన ఓ యువకుడు పుట్టక నుంచి తోకతో జీవిస్తున్నాడు. దీంతో అంతా ఆ యువకుడిని దేవుడి పునర్జన్మంటూ పూజిస్తున్నారు.
దేశాంత్ అధికారి అనే 16 ఏళ్ల టీనేజర్‌కు వీపు కింద 70 సెంటీ మీటర్ల తోక పెరిగింది. ఈ విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు. అతడు పుట్టిన కొన్ని రోజుల తర్వాతే ఆ తోక కనిపించిందని దేశాంత్ తల్లిదండ్రులు చెప్పారు. తోకను గుర్తించిన తర్వాత, దేశాంత్ తల్లిదండ్రులు అతనిని అనేక స్థానిక ఆసుపత్రులకు తీసుకెళ్లారు. దాన్ని తొలగించడం కోసం విదేశీ వైద్యులను కూడా సంప్రదించారు.
అయితే, ఓ పూజారి ఆ తోక గురించి ఊహించని విషయం చెప్పాడు. దేశాంత్ హనుమంతునికి పునర్జన్మ అని తెలిపాడు. హనుమంతుడికి కూడా తోక ఉంటుందని, దాన్ని తొలగించడం అపకారమని పేర్కోవడంతో అతడి తల్లిదండ్రులు ప్రయత్నాలు మానుకున్నారు. తన కుమారుడు దేవుడి పునర్జన్మంటూ మురిసిపోయారు.
తల్లిదండ్రుల ఆనందం ఎలా ఉన్నా.. ఆ తోకతో దేశాంత్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడు. తన తోక విషయం బయటపడితే అంతా హేళన చేస్తారనే భయంతో గడిపేవాడు. తోకను చూపించేందుకు ఇష్టపడేవాడు కాదు. స్నేహితులు, తల్లిదండ్రులు ధైర్యం చెప్పడంతో తన తోకను చూపించేందుకు దేశాంత్ ముందుకొచ్చాడు.
Also Read: ఏసీని 24 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో పెడుతున్నారా? అయితే, ముప్పే!
ఈ సందర్భంగా దేశాంత్ ఓ యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతూ.. “నా తల్లిదండ్రులు తోకను ఎవ్వరికీ చూపించవద్దని అన్నారు. కానీ, నా తోకను చూపించడంలో నాకు ఎటువంటి అసౌకర్యం లేదు. నా వీడియో టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది. ఇప్పుడు చాలా మందికి నాకు తోక ఉందని తెలుసు. దాని గురించి నాకు ఎలాంటి చింత లేదు. ప్రజలు నన్ను హనుమాన్ అని పిలుస్తున్నారు’’ అని తెలిపాడు.
Also Read: జాగ్రత్త, అంగస్తంభన కోసం ఇలా చేస్తే కళ్లు పోతాయ్! తాజా అధ్యయనం వెల్లడి
దేశాంత్ తోక గురించి వైద్య నిపుణులు స్పందిస్తూ.. జన్యుపరమైన సమస్యల వల్ల కొందరిలో ఇలాంటి అరుదైన ఘటనలు జరుగుతాయని అంటున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో రెండు తలలు, మూడు చేతులతో ఒక బిడ్డ జన్మించాడు, ఇక్కడ మూడవ చేయి రెండు తలల మధ్య వెనుక వైపు ఉంది. దీనిపై పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ బ్రిజేష్ లహోటీ మాట్లాడుతూ.. ఈ పరిస్థితిని డైసెఫాలిక్ పారాపాగస్ అంటారని తెలిపారు. చిన్నారిని ఇండోర్‌లోని ఎంవై హాస్పిటల్‌లోని ఐసీయూలో చేర్చారు. అయితే, 60-70 శాతం కేసుల్లో ఇలాంటి సమస్యలకు చికిత్స సాధ్యం కాదని వైద్యులు అంటున్నారు.
Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!
Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!
Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!
Headphones side effects: హెడ్‌ఫోన్స్ అతిగా వాడుతున్నారా? చూడండి, ఎంత ప్రమాదమో!
Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?