అన్వేషించండి

Egg Recipes for Breakfast : ఎగ్స్​తో చేసుకోగలిగే టేస్టీ బ్రేక్​ఫాస్ట్​లు ఇవే.. చాలా సింపుల్​గా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు

Egg Recipes : గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే వీటిని బ్రేక్​ఫాస్ట్​గా చేర్చుకునేందుకు ఇక్కడ కొన్ని రెసిపీలున్నాయి. మీరు చూసి ట్రై చేసేయండి.

Breakfast Recipes with Egg : ప్రోటీన్లు, విటమిన్లతో నిండి ఎగ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే వీటిని డాక్టర్లు కూడా తినమని సిఫార్సు చేస్తూ ఉంటారు. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ డి, బి 6, బి 12, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. జింక్, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. అందుకే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హ్యాపీగా తీసుకోవచ్చు. పైగా ఎగ్స్​తో చేసే రెసిపీలను చాలా సులువుగా చేసుకోవచ్చు. బ్రేక్​ఫాస్ట్​గా, కర్రీల రూపంలో వీటిని ఎన్ని ఆప్షన్స్​తో వీటిని తీసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. 

ఎగ్ దోశ(Egg Dosa)

దోశలను చాలామంది ఇష్టంగా తింటారు. అయితే నాన్​వెజ్ తినే వారికి ఎగ్​ దోశ కూడా కచ్చితంగా ఫేవరెట్ లిస్ట్​లో ఉంటుంది. ఎందుకుంటే ఎగ్ దోశలు రుచిని మరింత పెంచుతాయి. అయితే దోశ పిండి సిద్ధంగా ఉంటే వీటిని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. స్టౌవ్ వెలిగించి నాన్​స్టిక్ పాన్ పెట్టి.. అది వేడి అయ్యాక దోశ పిండి వేయాలి. దానిపై పగలగొట్టిన గుడ్డును నేరుగా వేసి.. స్ప్రెడ్ చేసి.. ఉప్పు, కారం చల్లుకోవచ్చు.. లేదా ముందుగానే ఎగ్స్ పగలగొట్టి.. కారం, ఉప్పు వేసి కలిపి.. దానిని దోశపై వేయొచ్చు. ఇలా వేసుకున్న దోశను కాసేపు మగ్గనిచ్చి.. మరోవైపు తిప్పాలి. రెండూ వైపులా మంచిగా రోస్ట్ అయ్యాక తింటే టేస్ట్ అదిరిపోతుంది. 

Also Read : రాయలసీమ స్పెషల్ ఎగ్ దోశ.. ఆ ఒక్కటి యాడ్ చేస్తే రుచి నెక్స్ట్​ లెవల్​ అంతే

ఎగ్ మ్యాగీ (Egg Maggie)

మ్యాగీ అంటే ఇష్టముండేవారు ఎగ్ మ్యాగీ చేసుకోవచ్చు. పిల్లలు కొందరు మ్యాగీని ఇష్టంగా తింటారు. ఈ సమయంలో మ్యాగీతో పాటు ఎగ్స్​ని జాయిన్​ చేసి వారికి తినిపించొచ్చు. ఓ స్టౌవ్ మీద మ్యాగీని సిద్ధం చేసుకుంటా ఉండాలి. అదే సమయంలో మరో స్టౌవ్​పై గిన్నె పెట్టి కాస్త నూనె వేసుకుని ఎగ్స్ పగల గొట్టాలి. అవి కాస్త ఉడికిన తర్వాత కలిపి ముక్కలుగా కట్ చేసి.. ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. ఎగ్ బాగా ఉడికి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉడికిన మ్యాగీ దానిలో వేసి కలపాలి. చివరిగా మ్యాగీ మసాలా వేసి కలిపి తినేస్తే టేస్టీ ఎగ్ మ్యాగీ రెడీ. 

ఎగ్ ఫ్రైడ్ రైస్(Egg Fried Rice)

రాత్రి మిగిలినపోయిన రైస్​ను ఎగ్స్​ సహాయంతో ఎగ్ ఫ్రైడ్ రైస్​గా మార్చుకుని హాయిగా తినేయొచ్చు. ముందుగా స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టాలి. దానిలో కాస్త నూనె వేసి.. ఎగ్స్​ని పగలగొట్టి వేయాలి. దానిలో కాస్త ఉప్పు, కారం వేసుకుని.. ఎగ్స్​ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో రైస్​ని వేసి కలపాలి. చివరిగా మ్యాగీ మసాలా, ధనియాల పొడి వేసి కలపి ఎగ్ ఫ్రైడ్​ రైస్​గా తినేయొచ్చు. 

ఎగ్ పొంగనాలు.. (Egg Ponganalu)

ఇంట్లో గుంట పొంగనాలు కడాయి ఉంటే.. ఎగ్ పొంగనాలు బ్రేక్​ఫాస్ట్​గా లేదా స్నాక్స్​గా చేసుకోవచ్చు. ముందుగా ఎగ్స్​ని పగల గొట్టి దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. చిటికెడు సోడా వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పొంగనాల కడాయి పెట్టాలి. దానిలో కాస్త నూనె వేసుకుని.. ఈ ఎగ్ మిశ్రమాన్ని వాటిలో వేయాలి. సేమ్ పొంగనాల మాదిరిగానే ఇవి సిద్ధమైపోతాయి. అంతే ఎగ్ పొంగనాలు రెడీ. వీటిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 

Also Read : గుడ్డుతో గుంట పొంగనాలు, టేస్టీ రెసిపీ ఇదే.. చాలా సింపుల్​గా చేసేయొచ్చు

రోటీ ఎగ్ (Roti Egg Burji)

చపాతీ ఎగ్ ఫ్రైని చాలామంది ఇష్టంగా తింటారు. కొందరు చపాతీపై నేరుగా ఎగ్ పగలగొట్టి ఎగ్ చపాతీ చేసుకుంటారు. మరికొందరు దానిని ఎగ్ బుర్జీ రూపంలో చేసుకుంటారు. ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టండి. నూనె వేసి ఉల్లిపాయలు వేయాలి. అవి కాస్త మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. దానిలో కాస్త పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో ఎగ్స్ పగల గొట్టి వేయాలి. వెంటానే అన్ని కలిసేలా తిప్పుతూ ఉండాలి. ఇలా అన్ని కలిసి.. ఎగ్స్ ఉడికిన తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి మరోసారి కలిపి దించేయాలి. అంతే ఎగ్ బుర్జీ రెడీ. దీనిని రోటీలు, రైస్​లలో కూడా కలిపి తీసుకోవచ్చు. 

బాయిల్డ్ ఎగ్స్..(Boiled Eggs)

సింపుల్​గా బ్రేక్​ఫాస్ట్ రూపంలో ఎగ్స్​ని తీసుకోవడానికి బెస్ట్ ఛాయిస్ ఇవి. పైగా ఉడకబెట్టి తీసుకుంటే ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలు అందుతాయి. హెల్తీగా, ఫిట్​గా ఉండేందుకు చాలామంది తమ డైట్​లో బాయిల్డ్ ఎగ్స్​ని తీసుకుంటారు. స్టౌవ్ వెలిగించి దానిపై గిన్నె పెట్టి నీళ్లు పోయాలి. దానిలో ఎగ్స్ వేసి ఉడికించి తీసుకుంటే బాయిల్డ్ ఎగ్స్ రెడీ. 

Also Read : ఉడకబెట్టిన గుడ్లను ఎన్ని రోజులు నిల్వ చేయవచ్చు.. ఎన్నాళ్లు తాజాగా ఉంటాయి?

ఎగ్ ఆమ్లెట్..(Egg Omelette)

మరీ బాయిల్డ్ ఎగ్ తినాలని లేనప్పుడు ఎగ్స్​తో ఆమ్లెట్ చేసుకోవచ్చు. అయితే రోటీన్ ఆమ్లెట్​కి బదులుగా హాఫ్ బాయిల్డ్ వేసుకోవచ్చు. ఇది కూడా హెల్త్​కి చాలా మంచిది. పెనంపై ఎగ్​ని నేరుగా పగలగొట్టి హాఫ్ బాయిల్ అయిన తర్వాత దానిని తీసేయాలి. దానిపై కాస్త ఉప్పు, కారం చల్లుకుని.. సలాడ్స్​తో కలిపి తీసుకోవచ్చు. 

ఇవేకాకుండా ఎగ్స్​తో ఎన్నో రెసిపీలు చేసుకోవచ్చు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఎగ్స్​ని ఉపయోగించుకునే విధానం మారుతుంది. మరి ఇంకెందుకు మీరు కూడా ఎగ్స్​తో మీకు నచ్చిన రెసిపీలను చేసి.. హెల్త్ బెనిఫిట్స్ పొందేయండి.

Also Read : టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్.. స్ట్రీట్ స్టైల్​ లెవెల్​లో ఇంట్లోనే ఇలా వండేయండి రెసిపీ ఇదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Minsiter Gottipati Ravikumar: 'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Embed widget