అన్వేషించండి

Badam Shake Recipe : ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగే బాదం షేక్ రెసిపీ.. టేస్టీ​ మాత్రమే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది

Almond Shake : సమ్మర్​లో ఏదైనా చల్లగా తాగితే ఎంత బాగుంటుంది. కానీ బయటకెళ్లి ఏది తాగాలన్నా అది కల్తీ అయిపోతుంది. అయితే మీరు ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోగలిగే బాదం షేక్ రెసిపీ ఇక్కడుంది.

Summer Special Drink Recipe : సమ్మర్ స్పెషల్​గా ఇంట్లో ఏది చేసుకోవాలన్నా.. అది చల్లగా ఉంటే బాగుంటుంది అనుకుంటాము. బయటకెళ్లి తాగితే వాళ్లు ఎలా చేస్తున్నారో.. హెల్తీనో కాదో అనే భయం ఉంటుంది. అలా అని కొన్ని ఇంట్లోనే చేసుకోవాలంటే వండటం సరిగ్గా రాకపోవచ్చు. అలాంటి వాటిలో బాదం షేక్ ఒకటి. దానిని బయట తాగితే వచ్చే రుచే వేరు. పైగా దీనిని సమ్మర్​లో ఎక్కువగా తాగుతారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే.. హాయిగా ఇంట్లోనే బాదం షేక్​ను తయారు చేసుకోండి. ఇది మీకు అద్భుతమైన టేస్ట్​ని ఇవ్వడంతో పాటు.. ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ బాదం షేక్​ను ఎలా తయారు చేస్తారో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

బాదం - 50 గ్రాములు

పాలు - లీటర్

పంచదార - ముప్పావు కప్పు

కుంకుమ పువ్వు - చిటికెడు

కస్టర్డ్ పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

ముందుగా బాదంలో మరుగుతున్న వేడి నీటిని వేసి.. ఓ గంట పక్కన ఉండనివ్వండి. ఇలా చేయడం వల్ల దానిపై ఉన్న తొక్క ఈజీగా పోతుంది. గంట తర్వాత మీరు బాదం తొక్కలను తీయొచ్చు. లేదంటే మీరు రాత్రి బాదం నానబెట్టి ఉదయాన్నే వాడుకోవచ్చు. ఇలా తొక్క తీసిన బాదంను మిక్సీ జార్​లో వేయండి. ఇప్పుడు దానిలో 200 మి.లీ పాలు వేసి.. మెత్తగా పేస్ట్ చేయండి. మరో మిక్సింగ్ బౌల్​ తీసుకుని.. దానిలో రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. దానిలో 50 మి.లీ పాలు తీసుకుని.. ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. 
స్టౌవ్ వెలిగించి.. దానిపై పాలు పెట్టండి. అవి ఓ పొంగు రాగానే.. దానిలో ముందుగా సిద్ధం చేసుకున్న బాదం పేస్ట్ వేయాలి.

ఇది రెండు పొంగులు రావాలి. అయితే మీరు దానిని మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే గడ్డలు కట్టే అవకాశముంది. ఇలా బాదం రెండు పొంగులు వచ్చిన తర్వాత నానబెట్టిన కుంకుమపువ్వును దానిలో వేసుకోండి. అంతేకాకుండా ముప్పావు కప్పు పంచదార కూడా వేయాలి. లేదంటే మీ రుచికి తగినంత పంచదార వేసుకోవాలి. దానిని బాగా మిక్స్ చేసి.. ముందుగా సిద్ధం చేసుకున్న కస్టర్డ్ మిక్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. 

కస్టర్డ్ వేశాక.. దానిని బాగా కలుపుతూ ఉండాలి. బాగా చిక్కగా వచ్చేవరకు.. సాంబార్ మాదిరి చిక్కదనం వచ్చేవరకు దానిని కలుపుతూ మీడియం మంట మీద ఉంచాలి. దానిలో మీకు రంగు కావాలి అనుకుంటే.. ఫుడ్ కలర్ ఎసెన్స్ ఓ చుక్క వేసుకోవచ్చు. ఎల్లో కలర్ వేస్తే కలర్ బాగుంటుంది. లేదు లైట్​ కలర్​ అయినా పర్లేదు అనుకుంటే దానిని వేయాల్సిన అవసరమే లేదు. బాదాం పాలు బాగా చిక్కబడిన తర్వాత స్టౌవ్ ఆపేసి దించేయాలి. దానిని పూర్తిగా చల్లారనిచ్చి.. ఓ బౌల్​లో తీసుకుని డీప్​ ఫ్రిజ్​లో రెండు గంటలు ఉంచాలి. 

డీప్ ఫ్రిజ్​లో రెండు గంటలు ఫ్రీజ్ అయిన తర్వాత అది కాస్త గట్టిగా.. మరికొంత లిక్విడ్​గా అనిపిస్తుంది. దానిని ఇప్పుడు మిక్సీజార్​లోకి తీసుకోవాలి. ఇలా చేస్తేనే బాదం షేక్ చల్లగా.. తాగేందుకు మరింత హాయిగా ఉంటుంది. మిక్సీ చేసుకున్న తర్వాత.. ఇప్పుడు ఓ గ్లాస్ తీసుకుని దానిలో.. అడుగున బాదం పలుకులు లేదా బాదం ఫ్లేక్స్ వేసుకోండి. ఈ బాదం షేక్​ను గ్లాసుల్లో వేసుకోండి. మీకు కావాలనుకుంటే.. బాదం ఫ్లేక్స్ పైన కూడా వేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు. అంతే చల్లచల్లని బాదం షేక్ రెడీ. ఇది కేవలం రుచిని మాత్రమే కాదు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇస్తుంది. అంతేకాకుండా ఈ సమ్మర్​లో మీకు మంచి రుచిని అందిస్తుంది. మీరు ఈ కొలతలే ఫాలో అయితే.. నలుగురు హాయిగా ఈ బాదం షేక్​ని ఎంజాయ్ చేయవచ్చు. 

Also Read :  మామిడి పండ్లు నీటిలో నానబెట్టాకే తినాలట.. లేదంటే ఆ సమస్యలు తప్పవంటున్న నిపుణులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Sunny Leone: బాలీవుడ్ నటి సన్నీలియోనికి నెలకు రూ.1000 - ప్రభుత్వ పథకం కింద అకౌంట్లోకి డబ్బులు, అధికారులు షాక్
బాలీవుడ్ నటి సన్నీలియోనికి నెలకు రూ.1000 - ప్రభుత్వ పథకం కింద అకౌంట్లోకి డబ్బులు, అధికారులు షాక్
Manu Bhaker News: మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
Year Ender 2024: హ్యుందాయ్‌ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్‌ చేసిన IPOల లిస్ట్‌
హ్యుందాయ్‌ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్‌ చేసిన IPOల లిస్ట్‌
Embed widget