Protien Powder: ప్రొటీన్ పొడి తీసుకుంటున్నారా? ఎక్కువ కాలం వాడితే ఈ సమస్యలు వచ్చే అవకాశం
ప్రొటీన్ పొడి అమ్మకాలు జోరుగా ఉన్నాయి. వాటితో చాలా మేలు జరుగుతుందని ఎంతో మంది నమ్మకం.
జిమ్ కి వెళ్తున్న యువత సంఖ్య పెరిగింది. కొంతమంది బరువు తగ్గడానికి వెళ్తుంటే, కొందరు కండలు పెంచేందుకు వెళ్తున్నారు. వీరంతా బాగా వర్కవుట్స్ చేశాక శక్తి కోసం ప్రొటీన్ పొడి కలుపుకుని ప్రొటీన్ షేక్‌లు తాగుతున్నారు. అందుకే ప్రొటీన్ పొడికి డిమాండ్ పెరిగిపోయింది. ఈ ప్రొటీన్ పొడిలో గ్లోబులర్ అనే ప్రొటీన్ ఉంటుంది. పాల ఉత్పత్తుల నుంచి తయారయ్యే బయో ప్రొడక్ట్. అయితే ఈ గ్లోబులర్ ప్రొటీన్ దీర్ఘకాలంగా శరీరంలో చేరడం వల్ల శరీరానికి హాని చేసే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా వాడే వారిలో కింద చెప్పిన సమస్యలు కనిపించవచ్చు.
1. మొటిమలు అధికంగా వస్తున్నట్టయితే అది ప్రొటీన్ పొడి వల్లేమో చెక్ చేసుకోవాలి. దీని వల్ల కూడా పిగ్మెంటేషన్ పెరిగే అవకాశం ఉంది. ఈ పొడుల్లో హార్మోన్లను ప్రభావితం చేసే బయో యాక్టివ్ పెప్టైడ్లు ఉంటాయి. ఇవి సెబమ్ ఉత్పత్తిని పెంచుతాయి. దీని వల్ల ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంది. మొటిమలు అధికంగా వస్తున్నట్టయితే కొన్ని రోజుల పాటూ ప్రొటీన్ పొడి ఆపేయాలి.
2. సహజ ఆహారం ద్వారా శరీరంలో పోషకాలు సమతులంగా ఉంటాయి. ప్రొటీన్ కోసం పాలు, మాంసం, గుడ్లు వంటి వాటిపై ఆధారపడాలి. ప్రొటీన్ షేక్‌లపై ఆధారపడడం వల్ల శరీరంలో పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఎక్కువ మొత్తం ప్రొటీన్ శరీరంలో చేరుతుంది. దీనివల్ల సమతుల్యం తప్పుతుంది. ప్రొటీన్ అధికంగా శరీరంలో చేరే అవకాశం ఉంది.
3. పేగుల్లో మంచి బ్యాక్టిరియా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. వాటి కోసం కొన్ని రకాల ఆహారాలు ప్రత్యేకంగా తినాలి. పెరుగు తినడం వల్ల మంచి బ్యాక్టిరియా పెరుగుతుంది. ఒక ప్రొటీన పొడి వంటివి తినడం వల్ల ఆ మంచి బ్యాక్టిరియాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని వల్ల పొట్టనొప్పి కలగవచ్చు. గ్యాస్ అధికంగా ఏర్పడడం, అజీర్తి వంటివి కలగవచ్చు.
4. ప్రొటీన్ పొడి తీసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తే మంచి బ్రాండ్‌లకు చెందినవి తీసుకోవాలి. తక్కువ స్థాయి పొడుల్లో విషపూరిత లోహాలు కలిసే అవకాశం ఉంది. ఇవి శరీరానికి తీవ్ర హాని కలిగిస్తాయి. తరచూ తలనొప్పి, మలబద్ధకం, అలసట, కండరాల నొప్పి వంటివి అనారోగ్యాలు రావు.
5. దీర్ఘకాలంగా ప్రొటీన్ పొడి తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయుల్లో కూడా మార్పులు వస్తాయి. తీవ్రంగా వ్యాయామం చేశాక చాలా మంది ప్రొటీన్ షేక్‌లు తాగుతారు. దీనివల్ల ఇన్సులిన్ స్థాయి అమాంతం పెరుగుతుంది. ఇలా తరచూ జరగడం అంత మంచిది కాదు.
Also read: ఆకలిని పెంచి మధుమేహాన్ని తగ్గించే చిరాత - ఏమిటీ చిరాత? దీని ఎలా తినాలి?
Also read: నిద్ర పట్టడం లేదా? పీడకలలు వస్తున్నాయా? రాత్రిపూట ఈ ఆహారాలను దూరం పెట్టండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.