అన్వేషించండి

Sweet Ponganalu : పిల్లలు ఇష్టంగా తినే తియ్యని పొంగనాలు.. అరటిపండుతో హెల్తీగా చేసేయండిలా

Ponganalu with Banana : మీకు స్వీట్​ టూత్​ ఉందా? అయితే మీరు హెల్తీగా, స్వీట్​గా ఏమైనా తినాలనుకుంటే మీరు తియ్యని పొంగనాలు చేసుకోవచ్చు. దానిని ఎలా తయారు చేయాలంటే..

Healthy Breakfast : పిల్లలు ఇష్టంగా తినగలిగే, మధుమేహులు కూడా ఎలాంటి బెరుకు లేకుండా తీసుకోగలిగే హెల్తీ, టేస్టీ రెసిపీ గురించి మీకు తెలుసా? అయితే మీరు కచ్చితంగా అరటిపండుతో చేసే తియ్యని పొంగనాలు చేసుకోవాల్సిందే. సాధారణంగా పొంగనాలు అంటే కాస్త హాట్, స్పైసీగా తయారు చేసుకుంటారు. కానీ అరటిపండుతో టేస్టీ, హెల్తీ, స్వీట్ పొంగనాలు చేసుకోవచ్చు. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేయగలిగే ఫుడ్ అవుతుంది. వీటిని మీరు ఉదయం బ్రేక్​ఫాస్ట్​గా.. సాయంత్రం టేస్టీ స్నాక్​గా తీసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

గోధుమ పిండి - 1 కప్పు

అరటిపండు - 2 

బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు

కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు

బెల్లం తురుము - అర కప్పు

నీరు - తగినంత

సోడా - చిటికెడు

యాలకుల పొడి - చిటికెడు

తయారీ విధానం

ముందుగా స్టౌవ్ వెలిగించి దానిలో దానిపై కడాయి పెట్టండి. దానిలో నీరు వేసి.. అది వేడి అయ్యాక దానిలో బెల్లం వేయండి. పూర్తిగా కరిగేవరకు ఉంచి.. స్టౌవ్ ఆపేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఓ గిన్నెలో అరటిపండ్ల ముక్కలు వేసి బాగా చిదమండి. మెత్తగా మాష్ చేసిన తర్వాత దానిని మిక్సింగ్ గిన్నెలోకి తీసుకుని.. దానిలో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లం నీటిని వడకట్టి పోయండి. ఎందుకంటే బెల్లంలో ఉండే మలినాలు లేదా మట్టి అరటిపండులోకి పడిపోతుంది.  ఈ రెండింటిని బ్లెండ్ అయ్యేలా బాగా మిక్స్​ చేయండి. 

ఇప్పుడు దానిలో కొబ్బరి తురుము వేయండి. అనంతరం గోధుమ పిండి, బియ్యం పిండి, సోడా వేసి బాగా కలపండి. అనంతరం నీరు పోస్తూ.. ఉండలు లేకుండా పిండిని బాగా కలపండి. ఎక్కువ నీరు వేయకుండా పిండిని కలిపి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పొంగనాల పాన్ పెట్టాలి. ఒక్కో అచ్చులో నెయ్యి వేయాలి. అది వేడిగా అయినప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని.. అచ్చులో 3/4 నింపడానికి టేబుల్ స్పూన్​తో పిండి వేయాలి. దానిపై మూత వేసి 4 నిమిషాలు మగ్గనివ్వాలి. అనంతరం మూత తీసేసి.. వాటిని మరోవైపు తిప్పి కాల్చాలి. అంచులు బంగారు రంగులోకి మారిన తర్వాత వాటిని ప్లేట్​లోకి తీసుకోవాలి. అంతే వేడి వేడి స్వీట్ పొంగనాలు రెడీ. 

స్వీట్ పొంగనాలను మీరు వేడిగా లేదా చల్లగా కూడా తినొచ్చు. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని మీరు బ్రేక్​ఫాస్ట్ రూపంలో కానీ.. పిల్లలకు స్నాక్స్​ బాక్స్​గా కూడా పెట్టవచ్చు. లేదంటే సాయంత్రం స్నాక్స్​గా కూడా చేసుకోవచ్చు.ఈ రెసిపీలో మీరు కొబ్బరి తురుము తాజాది వేసుకుంటే రుచి రెట్టింపు అవుతుంది. బియ్యం పిండికి బదులుగా మీరు రవ్వను కూడా వేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి.. ఇంటిల్లిపాదీ ఆస్వాదించేయండి.

Also Read :  క్రంచీ, టేస్టీ మసాలా వడలు.. బ్రెడ్​తో ఇలా ఇన్​స్టాంట్​గా తయారు చేసుకోవచ్చు

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
Indoor Pure Air Tips: ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
Roti Pizza Recipe: మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget