అన్వేషించండి

Masala Vada : క్రంచీ, టేస్టీ మసాలా వడలు.. బ్రెడ్​తో ఇలా ఇన్​స్టాంట్​గా తయారు చేసుకోవచ్చు

Bread Masala Vada : మీరు బ్రేక్​ఫాస్ట్​గా బ్రెడ్ తీసుకుంటారా? అయితే ఈ ఆదివారం కాస్త మీ రోటీన్ బ్రెడ్​కు బ్రేక్​ ఇచ్చి.. బ్రెడ్​తో మసాలా వడలు చేసుకుని తినేయండి.

Vadalu Recipe with Bread : మసాలా వడలు అంటే శనగపప్పుతో ఎక్కువగా చేసుకుంటారు. అయితే మీరు టేస్టీ, క్రంచీ మసాలా వడలు ఇన్​స్టాంట్​గా తినాలనుకుంటే మీరు బ్రెడ్​తో వాటిని తయారు చేసుకోవచ్చు. మీరు ఛాయ్ లవర్​ అయితే దానికి మీకు పర్​ఫెక్ట్ స్నాక్ దొరికేసినట్టే. దీనిని మీరు బ్రేక్​ఫాస్ట్​గా లేదా ఈవెనింగ్ స్నాక్​గా తీసుకోవచ్చు. పిల్లలకు స్కూల్​ కోసం కూడా వీటిని తయారు చేసి పెట్టవచ్చు. వీటిలోని కూరగాయలు టేస్ట్​తో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే ఈ బ్రెడ్ మసాలా వడలను ఏవిధంగా తయారు చేయాలో? వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.  

కావాల్సిన పదార్థాలు

బ్రెడ్ - 3

క్యారెట్ - 1

ఉల్లిపాయ - 1

పచ్చిమిర్చి - 2

గరం మసాలా - 1 టీస్పూన్

ఉప్పు - తగినంత

పుదీనా - కొంచెం

కొత్తిమీర - కొంచెం

అల్లం - అర టీస్పూన్

జీలకర్ర - పావు టీస్పూన్

బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు

నూనె - ఫ్రైకి సరిపడేంత

తయారీ విధానం

ముందుగా క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం బాగా కడిగి.. చిన్న చిన్న ముక్కలుగా, తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ మిక్సింగ్ గిన్నె తీసుకుని దానిలో బ్రెడ్​ను ముక్కలుగా చేసి వేయాలి. దానిలో అల్లం, క్యారెట్ తురుము, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. కూరగాయల్లోని నీరు సరిపోకపోతే.. కాస్త నీరు వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో బియ్యం పిండి వేసి మరోసారి బాగా కలపాలి. 

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి..కడాయి పెట్టండి. దానిలో నూనె వేసి వేడిచేయండి. ముందు తయారు చేసుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా వత్తుకోవాలి. అయితే బాగా ఉబ్బినట్లు కాకుండా కాస్త పలుచగా ఉండేట్లు వత్తుకోవాలి. ఇలా చేస్తే వడలు రుచిగా ఉంటాయి. ఇప్పుడు వీటిని వేడి అయిన నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. స్టౌవ్​ మంట మీడియంలో ఉండేలా చూసుకోండి.

బ్రెడ్ త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి.. స్టౌవ్ దగ్గరే ఉంటే మంచిది. లేకుంటే మాడిపోయే అవకాశముంది. ఇవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు వాటిని తిప్పి ఫ్రై చేయండి. రెండువైపులా గోల్డెన్ కలర్​లో వచ్చాక వాటిని తీసేసి.. టిష్యూ మీద ప్లేస్ చేయండి. వడల్లోని నూనెను టిష్యూలు పీల్చుకుంటాయి. అంతే వేడి వేడి క్రంచీ బ్రెడ్ వడలు రెడీ. వీటిని మీరు సాస్​తో లేదా ఉదయాన్నే అల్లం ఛాయ్​తో హాయిగా లాగించేయవచ్చు. ఇవి కేవలం మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​గానే కాకుండా ఈవెనింగ్ స్నాక్స్​గా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. 

మీరు బ్రెడ్ వడలను డీప్ ఫ్రై కాకుండా ఎయిర్ ఫ్రైయర్​లో వండాలి అనుకుంటే దానిని 390 ఎఫ్ వద్ద 15 నిమిషాల ముందు ప్రీ హీట్ చేసుకోవాలి. పిండితో వడలు వత్తుకుని వాటికి రెండు వైపులా ఆయిల్ అప్లై చేయాలి. వాటిని బాస్కెట్​లో ఉంచి ఎయిర్ ఫ్రైయర్​లో 12 నిమిషాలు ఫ్రై చేయాలి. మరోవైపు తిప్పి 5 నిమిషాలు ఫ్రై చేయాలి. వీటిని మీరు ఓవెన్​లో కూడా చేసుకోవచ్చు. ఓవెన్​ను 400 ఎఫ్​ వద్ద 15 నిమిషాలు ప్రీహీట్ చేసుకుని..15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 

Also Read : పిల్లలు హెల్తీగా బరువు పెరిగేందుకు రాగులను ఇలా చేసి తినిపించండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Embed widget