Brinjal Benefits: వారేవ్వా వంకాయ, టేస్టే కాదు ఆరోగ్యకరం కూడా - ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
వంకాయ చూస్తే చాలా మందికి తినడానికి ఇష్టం చూపించరు. కానీ ఇది ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది.
‘ఆహా ఏమి రుచి అనారా మైమరచి.. తాజా కూరల్లో రాజా ఎవరండీ.. అంటే మన వంకాయేనండి’ అని ఓ సినిమాలో మంచి పాట ఉంది. అది నిజమే మరి. వంకాయ చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది కూడా. పొడుగు వంకాయ, తెల్ల వంకాయ, గుత్తి వంకాయ అని స్థలాన్ని బట్టి వంకాయ రంగు, పేరు మారుతుంది కానీ రుచి మాత్రం సేమ్ టు సేమ్. భారతీయుల విందు భోజనాల్లో వంకాయ కూర లేకుండా అసలు ఉండదు. అంత ప్రాధాన్యత ఇస్తారు. కొంత మంది మాత్రం వంకాయ తినేందుకు అసలు ఇష్టపడరు. కానీ వంకాయ తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. బరువు తగ్గేందుకు, షుగర్ లేవల్స్ అదుపులో ఉండేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
మెదడు పనితీరు భేష్
వంకాయలో ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇది మెదడు పనితీరుకు సహాయపడే రసాయనం. మీ ఆహారంలో వంకాయలను చేర్చుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మరియు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఫైటోన్యూట్రియెంట్లు మెదడు చురుగ్గా ఉండేందుకు దోహదపడుతుంది.
ఎముకలకు బలం
వంకాయలు తింటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. బోలు ఎముకల వ్యాధికి ఇది గొప్ప ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దాని వల్ల ఎముకలకు అవసరమైన పుష్టి ఇందులో లభిస్తుంది.
క్యాన్సర్ కణాలు తొలగిస్తుంది
వంకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ తో పోరాడేందుకు ఇది సహాయపడుతుంది. శరీరంలోని ఆక్సిడెంట్ కంటెంట్ స్థాయిని పెంచడం వల్ల అవయవాలు సురక్షితంగా ఉంటాయి. క్యాన్సర్ కణాలను తొలగించడంలో మెరుగ్గా పనిచేస్తుంది.
రక్తహీనత నివారిస్తుంది
వంకాయాల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత నివారణకు ఇవి బాగా ఉపయోగపడతాయి. రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు వీటిని తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. రక్తహీనత తరచుగా అలసిపోయేలా చేస్తుంది. అందుకే ఐరన్ ఎక్కువగా ఉండే వంకాయ తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
గుండెకి మేలు
గుండె సంబంధ వ్యాధులతో బాధపడే వాళ్ళు వంకాయలు తింటే చాలా మంచిది. పీచు స్వభావం కలిగిన వంకాయ తినడం వల్ల కొలెస్ట్రాల్ సత్యహయిలను ఇది తగ్గిస్తుంది. గుండె ప్రమాదాల నుంచి రక్షణగా నిలుస్తుంది. ఇందులో పాలీఫెనాల్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గిస్తుంది
వంకాయలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది. అదిక పీచు పదార్థం కలిగి ఉండటం వల్ల మీకు పొట్ట నిండుగా అనిపిస్తుంది. బరువు తగ్గాలను అనుకునే వాళ్ళు వారానికి రెండు సార్లు వంకాయ తినడానికి ప్రయత్నించండి.
కాలిన గాయాలు ఉన్నప్పుడు వంకాయలతో వండిన ఆహారాన్ని అధికంగా తినాలి. వంకాయల వల్ల దురద కలుగుతుందని పుండ్లు, ఇన్ఫెక్లన్ల సమయంలో వంకాయ తినరు. కానీ వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు వాటిని త్వరగా మానిపోయేలా చేస్తాయి. అందుకే కొంచెమైనా తింటే మంచిది.
ఇన్ని ఉపయోగాలు ఉన్న వంకాయని మాత్రం వర్షాకాలంలో మాత్రం దూరంగా ఉంచడమే మంచిది. ఎందుకంటే ఇది తేమ వాతావరణంలో పెరుగుతుంది. బ్యాక్టీరియా సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. వంకాయ వల్ల కొందరికి అలర్జీ సమస్యలు వస్తాయి. అలాంటివారు వంకాయ వంటకాలకు దూరంగా ఉండటమే బెటర్.
Also read: ఏటా పది లక్షల మరణాలకు కారణం అవుతోన్న దోమ, ఇది ఎన్ని రోగాలను వ్యాపింపజేస్తుందో తెలుసా?
Also read: మనం తినే ఆహారాల్లో ఉండే ఆరు విష సమ్మేళనాలు ఇవే, వీటిని ఎక్కువ తింటే అంతే సంగతులు