News
News
X

Aloe Vera: హైపర్ పిగ్మెంటేషన్ తో బాధపడుతున్నారా? కలబంద ట్రై చేసి చూడండి

అమ్మాయిలని చాలా ఇబ్బంది పెట్టేవి మొటిమలే. వాటి వల్ల వచ్చే డార్క్ స్పాట్స్ చూడటానికి అందవిహీనంగా కనిపిస్తాయి.

FOLLOW US: 

దాదాపు 3500 సంవత్సరాల చరిత్ర కలిగిన అలోవెరాలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. శతాబ్దాలుగా భారతీయులు కూడా తమ ఇళ్ళల్లో కలబందని పెంచుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి  అన్ని విధాలుగా మేలు చేస్తుంది. జుట్టు, చర్మ సంరక్షణకి మేలు చెయ్యడంలో కలబంద తర్వాతే ఏదైనా. పోషకాలు అధికంగా ఉండే కలబందలో 20 ఖనిజాలు, 18 అమైనో ఆమ్లాలు, 12 విటమిన్లతో సహా 75 కంటే ఎక్కువ పోషక భాగాలు, 200 ఇతర కాంపౌండ్స్ ఉన్నాయి. డయాబెటిక్ తో బాధపడే వాళ్ళు పొద్దున్నే పరగడుపున కలబంద ముక్కని నీళ్ళలో వేసుకుని ఉడకబెట్టుకుని ఆ నీటిని తాగితే చాలా మంచిదని చెప్తూ ఉంటారు.

జీర్ణక్రియని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి పోషకాల శోషణకి ఉపయోగపడుతుంది. అంతే కాదు కలబంద చర్మాన్ని తేమగా ఉంచేందుకు సహాయపడుతుంది. సాధారణంగా అలోవెరా 3 దశల్లో పని చేస్తుంది. క్లెన్సింగ్ స్టేజ్, న్యూరిష్‌మెంట్ స్టేజ్, థెరప్యూటిక్ స్టేజ్ గా పని చేస్తుంది. కలబందలోని లిగ్నిన్ చర్మంలోకి చొచ్చుకుపోవడానికి సహాయపడుతుంది. సాపోనిన్ స్వీపింగ్ చర్యతో చర్మాన్ని శుభ్రపరుస్తుంది. కలబంద చర్మం pH స్థాయిలని సమతుల్యతను చెయ్యడంలో సహకరిస్తుంది.

హైపర్ పిగ్మేంటేషన్ నివారించడం ఎలా?

టీనేజీ రాగానే అందరినీ మొటిమలు సమస్య ఇబ్బంది పెడుతుంది. అదొక వ్యాధిలాగా మారిపోయి ఎక్కువగా వచ్చేస్తాయి. చీము కారడం కూడా జరుగుతుంది. దీన్నే హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. చర్మంలో పిగ్మెంటేషన్ అధికంగా ఏర్పడటానికి కారణం మెలనిన్. ఇది అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ఆ ప్రాంతం ముదురు రంగులోకి మారడం లేదా మచ్చలు ఏర్పడటం జరుగుతుంది. ఒత్తిడి, సూర్యరశ్మి, హార్మోన్ల మార్పుల వల్ల ఇవి వస్తాయి. కలబంద మొక్కలోని రెండు రసాయనాలు అలోయిన్, అలోసిన్ పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

అలోసిన్ మెలనిన్ ఉత్పత్తికి కారణమయ్యే ఎంజైమ్ టైరోసినేస్ విడుదలని నిరోధించడం ద్వారా మెలనిన్ ఏర్పడటాన్ని ఆపుతుంది. కలబంద చర్మం మీద ముడతలు రాకుండా చేసి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో కలబంద గుజ్జును ఉపయోగిస్తారు. కలబంద ఆకుల మధ్యలోంచి జిగటగా ఉండే గుజ్జును తీసి మొటిమలపై రాయాలి. ఇలా రోజు రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. అలాగే నిద్రపోయి మరుసటి రోజు ఉదయం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజుల పాటూ చేస్తుంటే మొటిమలు తగ్గుతాయి. 

కలబందలో గ్లిసరిన్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అవి మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి కాంతివంతంగా ఉంచేందుకు సహాయపడతాయి. చర్మ సౌందర్యానికే కాదు జుట్టుకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కలబంద ఆకుల్లోని గుజ్జు తీసి జుట్టు కుదుళ్ళకి పెట్టుకుంటే జుట్టు రాలే సమస్యతో పాటు చుండ్రు సమస్య కూడా నివారించవచ్చు. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలంగా మారి జుట్టు ఒత్తుగా చూడటానికి కూడా అందంగా కనిపిస్తుంది.

Also Read: నెయ్యి నుంచి వెన్న కావాలా? అయితే ఇలా చేస్తే సరి

Also Read: 'విటమిన్- డి' సప్లిమెంట్స్ కరోనాని నిజంగానే అడ్డుకుంటాయా? క్లినికల్ ట్రయల్స్ ఏం చెప్తున్నాయ్

Published at : 10 Sep 2022 04:22 PM (IST) Tags: Skin Care Tips Beauty tips aloe vera benefits Aloe Vera Aloe Vera Skin Care Tips Hypepigmentation

సంబంధిత కథనాలు

పెద్ద పేగు క్యాన్సర్ చాలా డేంజర్ - ఈ నాలుగూ పాటిస్తే సమస్యలు పరార్!

పెద్ద పేగు క్యాన్సర్ చాలా డేంజర్ - ఈ నాలుగూ పాటిస్తే సమస్యలు పరార్!

Weight Loss: ఎంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదని బాధపడుతున్నారా? అందుకు కారణాలివే!

Weight Loss: ఎంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదని బాధపడుతున్నారా? అందుకు కారణాలివే!

Mother Care Tips: కాబోయే అమ్మలకి ఆలియా ఆరోగ్య సూత్రాలు

Mother Care Tips: కాబోయే అమ్మలకి ఆలియా ఆరోగ్య సూత్రాలు

Type 2 Diabetes: మధుమేహులకి గుడ్ న్యూస్ - ఈ ప్రోటీన్ సప్లిమెంట్‌తో అదుపులోకి షుగర్ లెవల్స్

Type 2 Diabetes: మధుమేహులకి గుడ్ న్యూస్ - ఈ ప్రోటీన్ సప్లిమెంట్‌తో అదుపులోకి షుగర్ లెవల్స్

Viral News: వామ్మో, గిన్నిస్ రికార్డు కోసం కోడి కాళ్లను ఒక్క నిమిషంలో కసకస నమిలేసింది

Viral News: వామ్మో, గిన్నిస్ రికార్డు కోసం కోడి కాళ్లను ఒక్క నిమిషంలో కసకస నమిలేసింది

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!