అన్వేషించండి

Vitamin D: 'విటమిన్- డి' సప్లిమెంట్స్ కరోనాని నిజంగానే అడ్డుకుంటాయా? క్లినికల్ ట్రయల్స్ ఏం చెప్తున్నాయ్

విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కరోనాకి అడ్డుకట్ట వేయొచ్చానే దానిలో ఎంతవరకు నిజం ఉంది.

మన శరీరం కాల్షియం, ఫాస్ఫేట్‌ను గ్రహించి కండరాలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచాలంటే విటమిన్ డి (Vitamin D) కావాలి. అలాగే ఎముకలను బలంగా ఉంచుతుంది. అనారోగ్యానికి గురిచేసే బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడటానికి ఇది దోహదం చేస్తుంది. విటమిన్ డి తక్కువగా ఉన్నవారు తీవ్రమైన కోవిడ్ ఇన్ఫెక్షన్ తో చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో చాలా మంది కోవిడ్ నుంచి రక్షణగా ఉండేందుకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కోవిడ్ బారిన పడకుండా రక్షిస్తుందని కొంతమంది నమ్మారు. అవి శరీరానికి  అవసరం అని భావించి అధికంగా తీసుకోవడం ప్రారంభించారు. అయితే నిజంగానే విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కోవిడ్ నుంచి రక్షణ పొందవచ్చా? నిపుణులు ఏమని చెప్తున్నారు?

ఇది కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు కొట్టి పారేశారు. విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడం వలన అటువంటి ప్రయోజనం ఏమి ఉండదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం విటమిన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పటికీ కోవిడ్-19 లేదా మరేదైనా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా నిరోధించలేమని రెండు కొత్త పెద్ద క్లినికల్ ట్రయల్స్ నిరూపించాయి. యుకే నుంచి వచ్చిన ఒక నివేదిక మహమ్మారి విస్తృతంగా ఉన్నప్పుడే దీనిపై పరిశోధనలు జరిపారు.

విటమిన్ డి తగినంత స్థాయిలో లేని 3,100 మందికి విటమిన్ సప్లిమెంట్స్ తక్కువ లేదా అధిక మోతాదులో అందించారు. ఈ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కరోనా వైరస్ లేదా ఇతర శ్వాసకోస ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుందో లేదో పరిశీలించారు. అదే సమయంలో మరో ప్రదేశంలో కూడా దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. COVID నివారణపై విటమిన్ డి ఏదైనా ప్రభావం చూపిస్తుందో లేదో పరీక్షించడానికి దాదాపు 34,000 మంది నార్వేజియన్లకు కాడ్ లివర్ ఆయిల్ లేదా ప్లేసిబోను అందించారు.

ఏం తేలింది? 
విటమిన్ డి సప్లిమెంట్స్ అధిక మోతాదు, తక్కువ మోతాదులో ఇవ్వడంతో పాటు కాడ్ లివర్ ఆయిల్ వల్ల కూడా కరోనా వైరస్ ప్రమాదాన్ని తగ్గించలేదని నిర్ధారించారు. విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళలో కోవిడ్ నివారించే పరిస్థితులు కనిపించలేదని అధ్యయనాలు వెల్లడించాయి. విటమిన్ డి కంటే టీకాలు వేయడం వల్ల కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని స్పష్టం చేశారు. ఇవే కాదు యునైటెడ్ స్టేట్స్, కెనడాలో జరుగుతున్న మరో రెండు క్లినికల్ ట్రయల్స్ కూడా కోవిడ్ ని నియంత్రించడంలో విటమిన్ డి సప్లిమెంట్స్ ఎటువంటి ప్రభావం చూపలేవని వెల్లడించాయి.

పరిశోధన ప్రకారం విటమిన్ డి లోపం రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. విటమిన్ సి మాదిరిగా కాకుండా విటమిన్ డి కొవ్వులో కరిగే గుణాన్ని కలిగి ఉంటుంది. ఎక్కువ కాలం పాటు సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల అది విషపూరితం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also read: చచ్చి సాధించేది ఏమీ లేదు, బతికి సాధించండి

 Also read: జ్వరం వచ్చినప్పుడు గుడ్లు, చేపలు, మాంసం తినవచ్చా?

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Embed widget