Tomatoes for Blood Pressure: టమోటాలతో హైబీపికి చెక్ పెట్టొచ్చా? ఇది నమ్మడం కష్టమే, కానీ..
High blood pressure: అధిక రక్తపోటు మీ గుండెతో పాటు మీ మూత్రపిండాలు, మెదడును దెబ్బతీస్తుంది. సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండకూడదు. మీరు హైబీపీతో బాధపడుతున్నట్లయితే మీ ఆహారంలో టమాటాలు చేర్చుకోండి.
![Tomatoes for Blood Pressure: టమోటాలతో హైబీపికి చెక్ పెట్టొచ్చా? ఇది నమ్మడం కష్టమే, కానీ.. Suffering from high BP eat tomatoes it will reduce easily Tomatoes for Blood Pressure: టమోటాలతో హైబీపికి చెక్ పెట్టొచ్చా? ఇది నమ్మడం కష్టమే, కానీ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/18/c5e48b0b300c1a4ed9f2e0507154f97e1705569419595880_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Control high blood pressure: అధిక రక్తపోటు అనేది జీవనశైలికి సంబంధించిన వ్యాధి. మనం తీసుకునే ఆహారం పట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా హైబీపీ సమస్యను ఎదుర్కొవల్సి వస్తుంది. రక్తపోటు సాధారణ స్థాయి ఉంటే.. దానిని మించి అధిక రక్తపోటు అని పిలుస్తారు. మీ రక్తపోటు స్థాయి 120/80mmHg కంటే ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంతకీ రక్తపోటు ఎలా పెరుగుతుంది? ఎలా తగ్గుతుంది? ముందుగా రక్తపోటు అంటే ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. అధిక రక్తపోటు అంటే.. రక్తం సిరల లోపల రక్తపోటు పెరిగినప్పుడు, గుండె పంపింగ్‌లో ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. అయితే అధిక బీపీతో బాధపడేవారు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తీసుకునే సమతుల్య ఫుడ్ ద్వారా దీనిని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.
టమాటో హైబీపీని తగ్గిస్తుంది
ఓ అధ్యయనం.. టమోటాలు తినడం వల్ల రక్తపోటు తగ్గుతుందని పేర్కొంది. ఇందులో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ మొదలైన వాటితో పాటు లైకోపీన్ ఉంటుంది. దీని కారణంగా దాని రంగు ఎరుపుగా మారుతుంది. ఈ లైకోపీన్ గుండెకు చాలా మేలు చేస్తుంది. బీపీ రోగులకు ఎంతో మంచిది. రోజుకు 110 గ్రాముల కంటే ఎక్కువ టమోటాలు తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనం కనుగొంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తింటే అధిక బీపీ నుంచి బయటపడవచ్చు. టమాటల్లో ఉండే.. లైకోపీన్ వాసోకాన్‌స్ట్రిక్టర్‌గా పని చేసే యాంజియోటెన్సిన్ ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.
గుండె రోగులకు మేలు చేస్తుంది
పొటాషియం, ఫోలేట్, విటమిన్ సి తదితర పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. టొమాటోలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు సెల్యులార్ దెబ్బతినకుండా కాపాడతాయి. దీర్ఘకాలిక హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. హృద్రోగులు టమోటాలను సమతుల్య ఆహారంలో తీసుకోవాలి.
రక్తపోటు లక్షణాలు
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, అధిక రక్తపోటుకు నిర్దిష్ట లక్షణాలు ఏమీ ఉండవు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు. దీన్ని గుర్తించాలంటే బీపీని చెక్ చేసుకోవాలి. అయితే, హై బీపీ ఉన్నవారు కచ్చితంగా నీరసంగా ఉండటం, శరీరం చెమటలు పట్టడం వంటి సమస్యలను చూస్తారు.
అధిక బీపీని కంట్రోల్ చేసుకోవాలంటే.. మీలో ఈ మార్పులు చేసుకోవాలి:
- బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
- ఉప్పు, కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవడం.
- మద్యం, ధూమపానానికి దూరంగా ఉండండి.
- తాజా పండ్లు, కూరగాయలు తినండి.
- ఒత్తిడి, కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
టొమాటోలతోపాటు ఇతర లైకోపీన్-రిచ్ ఫుడ్స్ (జామ, పుచ్చకాయ, బొప్పాయి వంటివి) తినడం వల్ల సమ్మేళనం యొక్క యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను పొందవచ్చు. ఇవి మీ శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడికి దూరం చేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులతో సహా దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉంది. ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకున్నట్లయితే హైబీపీ నుంచి బయటపడవచ్చు.
Also read: బ్రెయిన్ రీస్టార్ట్ మెకానిజాన్ని రివీల్ చేసిన కొత్త అధ్యయనం.. నిద్రతోనే ఇది సాధ్యం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)