Wake Up Early Tips : ఉదయం నిద్రలేవడం కష్టంగా ఉందా? ఈ టిప్స్ మీకు గ్యారంటీగా హెల్ప్ చేస్తాయి
Morning Tips : ఉద్యోగం కోసం, చదువు కోసం వెళ్లేవారు కచ్చితంగా ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది. కానీ ఈ వాతావరణంలో మార్నింగ్ నిద్రలేవకపోతున్నారా? అయితే మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

Simple Tips to Wake Up Early : నిద్ర అందరికీ ఇష్టం ఉంటుంది. కానీ నిద్రకే కొందరితో ఇబ్బంది ఉంటుంది. అది పక్కన పెడితే రాత్రి ఎంత లేట్‌గా పడుకున్నా.. లేదా త్వరగా పడుకున్నా సరే.. ఉదయం పట్టే నిద్ర నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ ఏమి చేస్తాం.. తప్పనిసరి పరిస్థితుల్లో లేవాల్సి వస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో, చలికాలంలో ఉదయం నిద్ర లేవడం అంటే సాహాసమనే చెప్పాలి. ఎంత ట్రై చేసినా బెడ్ నుంచి లేవాలి అనిపించదు. ఒకవేళ అలారం మోగినా అబ్బా ఇంకాసేపు పడుకుందాములే అనిపిస్తుంది. కానీ ఉద్యోగాలకు, చదువులకు, ఇతర పనులకు వెళ్లేవాళ్లు కచ్చితంగా లేవాల్సి వస్తుంది. అలా వెళ్లాల్సిన వారు ఉదయం నిద్ర లేవాలనిపించకపోతే.. ఈ చిట్కాలు ట్రై చేయండి.
ఉదయం నిద్ర లేచేందుకు ట్రై చేయాల్సిన చిట్కాలు
ఉదయం త్వరగా లేవాలనుకుంటే.. మీరు డిన్నర్ త్వరగా పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే మీరు భోజనం చేయడం ఆలస్యం చేస్తే.. అది మీ నిద్రను దూరం చేసి.. ఉదయం నిద్రలేవడంలో ఇబ్బందులు కలిగిస్తుంది. అలాగే హెవీ మీల్స్ తీసుకోకుండా.. తేలికపాటి ఆహారం తీసుకుని పడుకుంటే మంచిది. అలాగే మీరు ప్రతిరోజూ త్వరగా లేవాలనుకుంటే.. రోజూ ఒకే టైమ్‌కి లేవడం స్టార్ట్ చేయండి. ఇలా కంటిన్యూగా చేయడం వల్ల తర్వాత రోజుల్లో మీకు రెగ్యులర్ టైమ్‌కి మెలకువ వచ్చేస్తుంది. దీనివల్ల రాత్రి నిద్ర కూడా త్వరగా వస్తుంది. స్లీప్ సైకిల్ రెగ్యులర్ అవుతుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవడంలో ఇబ్బందులు ఉండవు. అలాగే రాత్రి నిద్రపోయేప్పుడు రూమ్ డార్క్‌గా, ఉదయాన్నే విండోలు, తలుపులు అన్ని తీసి ఇంట్లోకి వెలుతురు వచ్చేలా చూసుకోండి. దీనివల్ల మీరు త్వరగా యాక్టివ్ అవుతారు.
మీరు నిద్రలేవాలనుకునే టైమ్‌కి అరగంట ముందు అలారం పెట్టుకోండి. ఒకవేళ మీరు స్నూజింగ్ చేసినా ఎక్కువ సమయం మిగిలి ఉంటుంది. అయితే మీరు మొదటిసారి అలారం మోగినప్పుడే లేవడం మంచిదని చెప్తున్నారు నిపుణులు. రాత్రి నిద్రకు ముందు టీ లేదా కాఫీ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది నిద్రను దూరం చేస్తుంది. దీనివల్ల ఉదయం లేవడం కష్టంగా ఉంటుంది. నిద్రకు ముందు ఫోన్ చూడడం, నిద్రలేచిన వెంటనే ఓ గంటపాటు ఫోన్ చూడకుండా ఉంటే మంచిది. ఇలా చేయడం వల్ల స్లీపింగ్ సైకిల్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది.
ఉదయాన్నే నిద్రలేస్తే కలిగే ప్రయోజనాలివే
ఉదయం నిద్ర లేవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ అందుతాయి. ప్రతిరోజూ త్వరగా లేవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. బరువు పెరగకుండా ఉంటారు. త్వరగా నిద్రలేవడం వల్ల ఎక్కువ సమయం ఉంటుంది. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాత్రి త్వరగా నిద్రపోవడం, ఉదయం త్వరగా లేవడం వల్ల నిద్రకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. మంచి నిద్ర పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుర్తించుకోవాలి.






















