News
News
X

నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? త్వరగా ముసలోళ్లు అయిపోతారు!

స్లీప్ క్వాలిటి తగ్గడం వంటి ఏజింగ్ లక్షణాలు కనిపిస్తాయి. తరచుగా కలిగే నిద్రాభంగం వల్ల కూడా మెదడు వయసు పెరిగిపోతుంది.

FOLLOW US: 
Share:

రాత్రిళ్లు ఓటీటీల్లో వెబ్ సీరిస్‌లు, మొబైల్‌లో రీల్స్ చూస్తూ జాగారం చేస్తున్నారా? అయితే, మీ మెదడు ముసల్ది అయిపోతుంది జాగ్రత్త. ఔనండి, ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో నిపుణులు చెప్పిన విషయాలు తెలిస్తే.. తప్పకుండా షాకవుతారు. 

కేవలం ఒక్క రాత్రి నిద్రలేకుండా ఉండడం వల్ల మీ మెదడు వయసు సంవత్సరాల్లో పెరిగిపోవచ్చట. - ‘జర్నల్ ఆఫ్ న్యూరో సైన్సెస్’లో ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయన వివరాల ప్రకారం.. ఒక్క రాత్రి నిద్రలేమి వల్ల మెదడు వయసు ఒకటి రెండు సంవత్సరాల పాటు పెరుగుతుందని చెబుతున్నారు. అయితే మరో రాత్రి మంచి నిద్రతో దీన్ని రివర్స్ చెయ్యవచ్చని కూడా ఈ అధ్యయనం వివరిస్తోంది. తాత్కాలికంగా కలిగే నిద్రలేమితో మెదడులో శాశ్వత మార్పులేమీ గుర్తించలేదు.

తీవ్రమైన నిద్రలేమి మెదడు స్వరూపాన్ని మార్చేస్తుందట. అయితే యువతలో నిద్రలేమి వల్ల మెదడుతో జరిగే మార్పులను రివర్స్ చెయ్యడం సాధ్యపడుతుందని, మంచి నిద్రతో మెదడు తిరిగి యథాస్థితికి చేరుతుందని, నిద్రలేమి మెదడు మీద చూపే ప్రభావాన్ని వివరించేందుకు మా ఆధ్యయనం కొత్త రుజువులు చూపించిందని వర్సిటికి చెందిన ఈవా మారియా ఎల్మెన్ హోర్ట్స్ అంటున్నారు.

నిద్ర లేమి ప్రభావం మెదడు మీద రకరకాలుగా ఉంటుంది. స్లీప్ క్వాలిటి  తగ్గడం వంటి ఏజింగ్ లక్షణాలు కనిపిస్తాయి. తరచుగా కలిగే నిద్రాభంగం వల్ల కూడా మెదడు వయసు పెరిగిపోతుంది. అయినప్పటికీ తిరిగి మంచిగా నిద్ర పోయినపుడు ఆ పరిస్థితి నుంచి తిరిగి మెదడు కోలుకుంటుందట. ఆరోగ్యవంతులైన 19 నుంచి 39 సంవత్సరాల మధ్య వయసు గల 134 మంది వాలంటీర్ల ఎంఆర్ఐలను కూడా ఇందులో విశ్లేషించారు.

మొత్తం నిద్రలేమి విషయంలో.. అంటే 24 గంటల కంటే ఎక్కువ సమయం పాటు మేలుకొని ఉన్నపుడు మెదడు వయసు ఒకటి రెండు సంవత్సరాలు పెరగటాన్ని గమనించారట. అయితే మెదడులోని అద్భుత విషయం ఏంటంటే ఒక రాత్రి మంచి నిద్రతో తిరిగి యథాస్థితికి చేరిందని ఈ అధ్యయనం నిర్వహించిన నిపుణులు వెల్లడించారు. రాత్రి మూడు గంటల పాటు నిద్రపోయినపుడు లేదా 5 గంటల చొప్పున 5 రాత్రులు వరుసగా నిద్రపోయినా కూడా మెదడు వయసులో పెద్ద మార్పులు రాలేదట.

ఆరోగ్యం మీద, పనితీరు మీద నిద్ర ప్రభావం చాలా ఉంటుందని తెలిసిన విషయమే. ఇది కేవలం ఆరోగ్యం మీద మాత్రమే కాదు పనితీరు, పని సామర్థ్యం, మూడ్ అన్నింటి మీద నిద్ర లేమి ప్రభావం ఉంటుంది. ఇలా జరగడానికి మెదడులో జరిగే ఏ మార్పులు కారణమో తెలుసుకునేందుకు జరిగిన అధ్యయనం వివరాలు జర్నల్ ఆఫ్ న్యూరో సైన్సెస్ లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో నిద్ర ప్రాముఖ్యతపై కొత్త విషయాలు వెల్లడించారు. నిద్ర లేమి తాత్కాలికంగా మెదడు వయసు పెంచేస్తుందని ఈ అధ్యయనం వివరిస్తోంది. కాబట్టి ఒకరోజు నిద్ర లేకపోతే తర్వాత రాత్రైనా పూర్తిస్థాయిలో నిద్రపోగలిగితే జరిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చని ఈ అధ్యయనం చెబుతోంది. 24 గంటలకు మించి నిద్రపోకుండా గడిపిన వారిలోనే ఇలా మెదడు మీద నేరుగా ప్రభావం ఉంటున్నట్టు కనుగొన్నారు.  వారాల తరబడి నిద్రలేమితో బాధ పడేవారు తప్పకుండా పరిష్కార మార్గాలను అనుసరించడం వల్ల నష్టాన్ని నివారించడం సాధ్యమే.

Also read: రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవాలా? అయితే రాత్రి పడుకునే ముందు ఈ నాలుగు పనులు చేయండి

Published at : 06 Mar 2023 12:47 PM (IST) Tags: Sleep Sleepless Sleeping Problems Brain brain aging

సంబంధిత కథనాలు

Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్

Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్

Gut Health:స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందా? అందుకు కారణం ఇదే

Gut Health:స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందా? అందుకు కారణం ఇదే

Womans Health: మహిళలూ మీ వయసు నలభై దాటిందా? ఈ రోగాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

Womans Health: మహిళలూ మీ వయసు నలభై దాటిందా? ఈ రోగాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

Sore Curd: పులిసిన పెరుగు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

Sore Curd: పులిసిన పెరుగు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

Food Habits: మీ ఆహారపు అలవాట్లు ఇలా ఉంటే రోగాల భయమే ఉండదు

Food Habits: మీ ఆహారపు అలవాట్లు ఇలా ఉంటే రోగాల భయమే ఉండదు

టాప్ స్టోరీస్

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు -  మళ్లీ ఎప్పుడంటే ?

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు