అన్వేషించండి

Sriramanavami Vadapappu Recipe :శ్రీరామనవమి రోజు వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా? వడపప్పును ప్రాముఖ్యత ఇదే

Sriramanavami Vadapappu Significance : శ్రీరామనవమి రోజు వడపప్పును ప్రత్యేకంగా తయారు చేస్తారు. అసలు దీనినే నైవేద్యంగా ఎందుకు పెడతారు? శ్రీరాముడికి వడపప్పు అంటే ఇష్టమా?

Sriramanavami Naivedyam :  శ్రీరాముడి పుట్టినరోజునే శ్రీరామనవమి(Srirama Navami 2024)గా పండుగా చేసుకుంటాము. ఈరోజు స్వామివారికి సీతమ్మతో అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేస్తారు. ఇంతటీ పుణ్యదినానా.. శ్రీరాముడికి నైవేద్యంగా పానకం, వడపప్పు పెడతారు. శ్రీరామనవమికి నైవేద్యంగా వడపప్పును ఎందుకు పెడతారు? దానిని ఎలా వండుతారు? వడపప్పును తయారు చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రెసిపీని ఎలా తయారు చేయాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

పెసరపప్పు - 1 కప్పు

కొబ్బరి తురుము - 3 స్పూన్స్

ఉప్పు - రుచికి తగినంత

మామిడి ముక్కలు - 3 టేబుల్ స్పూన్స్

పచ్చిమిర్చి - 3

నిమ్మరసం - 1 స్పూన్

కొత్తిమీర - అరకప్పు

తయారీ విధానం

పెసరపప్పును వంటను ప్రారంభించే గంట ముందు నానబెట్టుకోవాలి. గోరువెచ్చని నీటిలో నానబెడితే పప్పు మరింత త్వరగా నానుతుంది. ఇప్పుడు పెసరపప్పును కడిగి ఓ మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. దానిలో కొబ్బరి తురుము కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. దానిలో పచ్చిమిర్చి ముక్కలు, మామిడి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర తురుము, నిమ్మరసం  వేసి అన్ని మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. అంతే శ్రీరాముడుకి ఇష్టమైన వడపప్పు రెడీ. 

శ్రీరామనవమి వడపప్పు ప్రాముఖ్యత

శ్రీరాముడికి బెల్లం అంటే ఇష్టం కాబట్టి పానకం (Srirama Navami Panakam) పెడతారు. మరి వడపప్పు(Srirama Navami Special Vadapappu)ను ఎందుకు పెడతారంటే.. వివిధ కథలు వినిపిస్తాయి. రాముడు వనవాసం చేసే సమయంలో ఋషులు రాముడికి వడపప్పును నైవేద్యంగా పెట్టేవారని చెప్తారు. ఆరోగ్యపరంగా చెప్పాలంటే.. వడపప్పులోని పప్పుధాన్యాలు ప్రోటీన్​కు మంచి సోర్స్​గా చెప్పవచ్చు. దీనిలో పీచు పదార్థాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. 

శ్రీరామనవమి పానకాన్ని ఇలాగే చేయాలి.. ఆలయాల్లో పంచే ట్రెడీషనల్ పానకం రెసిపీ ఇదే

ఆరోగ్య ప్రయోజనాలు

నిజం చెప్పాలంటే పండుగల సమయంలో చేసే ప్రత్యేక వంటకాలన్నీ.. ఆయా సమయంలో వాతావరణానికి అనుకూలమైన ఫుడ్స్ ఎక్కువగా ఉంటాయి. దేవతలకు ఇష్టమైన ప్రసాదంగా చేసుకుని.. వాటిని తాము కూడా సేవిస్తారు కాబట్టి కొన్ని వంటలను దేవుళ్లకి ఇష్టమైనవి చెప్తారు. అలా దేవుడికి నైవేద్యంగా పెట్టి వారు కూడా సేవించడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుందని భావిస్తారు. అలాంటి వాటిలో వడపప్పు కూడా ఒకటి.సమ్మర్​లో చలువ చేస్తుందని చాలామంది పెసరపప్పు చేసుకుంటారు. 

పెసరపప్పులో శరీరానికి అవసరమైన విటమిన్లు అన్నీ ఉంటాయి. కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో అవయవాల పనితీరును మెరుుగుపరుస్తాయి. ఇది ప్రోటీన్​కు మంచి సోర్స్​గా చెప్పవచ్చు. పెసరపప్పులో ప్రోటీన్​, ఫైబర్​ అధికంగా ఉంటుంది. ఇవి శరీరం నుంచి టాక్సిన్లను బయటకి పంపి.. ఆరోగ్యంగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. మెరుగైన జీర్ణ వ్యవస్థను అందిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. రక్తపోటును తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే సమ్మర్లో పెసరపప్పును తీసుకుంటారు. ఇది శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది. 

Also Read : వనవాసానికి వెళ్లేముందు తల్లిదండ్రులు, రాజగురువుతో రాముడి సంభాషణ ఇదే! 

శ్రీరామ నవమి రోజు ఈ పనులు చేస్తే.. రాముడి ఆశీస్సులు లభిస్తాయ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
ట్విన్ టవర్స్ పై అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైటెక్ సిటీలో పేలుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పరుగో పరుగుAmbani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
ట్విన్ టవర్స్ పై అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
Coimbatore : రూ.1, రూ.2 నాణేలతో భార్యకు భరణం-షాకైన కోర్టు, ఆ తర్వాతేమైందంటే..
రూ.1, రూ.2 నాణేలతో భార్యకు భరణం-షాకైన కోర్టు, ఆ తర్వాతేమైందంటే..
Embed widget