వేసవిలో పైనాపిల్‌ను ఇలా తీసుకుంటే చాలా మంచిది పైనాపిల్‌లో విటమిన్ సి, అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి స్కిన్‌కి మంచి రక్షణను ఇస్తాయి. వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తూ కొలాజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనికోసం పైనాపిల్ ముక్కను చర్మంపై నేరుగా స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మృతకణాలు తొలగి మెరిసే ఛాయ మీ సొంతమవుతుంది. జుట్టు రాలకుండా ఉండేందుకు పైనాపిల్‌తో ప్యాక్స్, జ్యూస్‌లు తీసుకోవచ్చు. పైనాపిల్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని అందిస్తుంది. పైనాపిల్ గుజ్జులో ఆలివ్ ఆయిల్ కలిపి.. పెదాలకు అప్లై చేస్తే మృదువుగా మారుతాయి. ఎముకలను బలంగా చేయడంలో కూడా పైనాపిల్ మంచి ఫలితాలు ఇస్తుంది. ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. (Images Source : Unsplash)