అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Sriramanavami Panakam Recipe : శ్రీరామనవమి పానకాన్ని ఇలాగే చేయాలి.. ఆలయాల్లో పంచే ట్రెడీషనల్ పానకం రెసిపీ ఇదే

Bellam Panakam Recipe : శ్రీరామనవమి సమయంలో అందరూ కచ్చితంగా చేసుకునే వాటిలో పానకం కూడా ఒకటి. అయితే దీనిని టెంపుల్ స్టైల్​ల ట్రెడీషనల్​గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Srirama Navami Food Recipes : శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి.. పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో జన్నించాడు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిగా చేసుకుంటారు. శ్రీరాముని పుట్టినరోజైన చైత్ర శుద్ధ నవమి నాడు.. సీతారామ కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. ఇంట్లో పూజ చేసుకున్నా.. కళ్యాణంలోనైనా.. పూజ చేస్తుంటే స్వామి వారికి అరటిపండ్లు, వడపప్పు, పానకం వంటివి నైవేద్యంగా పెడతారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పానకం గురించే. ఈ డ్రింక్​ని శ్రీరామనవమి సయమంలో రెండు కారణాలతో పంచుతారు. అయితే ఈ పానకం ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏమిటి? పానకంతో కలిగే ఉపయోగాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

బెల్లం - 75 గ్రాములు

నీరు - 300 గ్రాములు

ఉప్పు - చిటికెడు

పచ్చ కర్పూరం - అర చిటికెడు

తులసి ఆకులు - 12

యాలకుల పొడి - అర టీస్పూన్

శొంఠి పొడి - అర స్పూన్ 

నిమ్మరసం - 1 స్పూన్

మిరియాల పొడి - అర టీస్పూన్

తయారీ విధానం 

శ్రీరామనవమి సమయంలో చేసే పానకాన్ని దాదాపు అందరూ సేవిస్తారు. అయితే కాలాలు మారేకొద్ది ఈ పానకాన్ని చేసే విధానం మారిపోయింది. టేస్ట్ పేరుతో దానిలో వేయాల్సిన పదార్థాలు వేయకుండా.. కొన్ని పదార్థాలు వేయవలసిన దానికంటే ఎక్కువగా వేసేసి తయారు చేస్తున్నారు. అందుకే ఈసారి మీరు ఆలయాల్లో పంచే పానకాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా బెల్లాన్ని తురుమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో నీటిని తీసుకోవాలి. 

బెల్లం నీటిలో కరిగిపోయేవరకు దానిని బాగా తిప్పాలి. దానిలో మిరియాల పొడి, శొంఠిపొడి, యాలకుల పొడి, పచ్చకర్పూరం వేసుకుని బాగా కలపాలి. అవి అన్ని మిక్స్ అయిన తర్వాత ఆ నీటిని మరో గిన్నెలోకి వడకట్టాలి. ఇప్పుడు ఆ నీటిలో ఉప్పు, నిమ్మరసం, తులసి ఆకులను వేసి బాగా కలపాలి. అంతే హెల్తీ, ట్రెడీషనల్ పానకం రెడీ. దీనిని శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టి.. అనంతరం అందరూ దీనిని తీసుకోవచ్చు. పానకాన్ని పవిత్ర నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు ఈ రెసిపీని కచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇలా చేసిన పానకాన్నే దేవాలయాల్లో భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అందుకే దీనిని కేవలం శ్రీరామనవమికే కాకుండా.. వివిధ పండుగల సమయంలో దీనిని తయారు చేసుకుంటారు. 

ఈ పానకం చేసేప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు పానకం ఎంత చేయాలనుకుంటున్నారు అనే దానిని బట్టి పదార్థాల కొలతలను తీసుకోవాలి. దీనిలో ఏది ఎక్కువ తీసుకున్నా.. తక్కువ తీసుకున్నా పానకం రుచి మారిపోతుంది. ఉప్పు కూడా తక్కువగా వేసినప్పుడే దాని రుచి పెరుగుతుంది. ముఖ్యంగా పచ్చ కర్పూరం విషయంలో కచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. దీనిని ఎక్కువగా అస్సలు వేయకూడదు. తులసి ఆకులు కూడా లేతగా ఉండేవి తీసుకుంటే మంచిది. ఇలా తయారు చేసుకున్న పానకాన్ని నైవేద్యంగా పెట్టి.. అందరూ ప్రసాదంగా తీసుకోవచ్చు. 

పానకంతో ఆరోగ్య ప్రయోజనాలు

అయితే ఈ పానకాన్ని పవిత్రమైన నైవేద్యంగానే కాకుండా వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం దీనిని తయారు చేసుకుని తాగవచ్చు. సమ్మర్​లో హీట్​ స్ట్రోక్​ని రక్షించడంలో ఈ పానకం బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మీకు మంచి రిఫ్రెష్​ ఇస్తుంది. పైగా తులసి ఆకులు, మిరియాల పొడి వంటి పదార్థాలు అన్ని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. శరీరంలో వేడిని తగ్గించి చలువనిస్తాయి. కాబట్టి కేవలం పండుగ సమయంలోనే కాకుండా.. వేడిని తగ్గించుకోవడం కోసం ఈ డ్రింక్​ని తయారు చేసుకుని తాగవచ్చు. 

Also Read : టేస్టీ, హెల్తీ ఆంధ్రా స్టైల్ కందిపచ్చడి.. నెయ్యి వేసుకుని తింటే ప్లేట్​మీల్స్ ఈజీగా లాగించేస్తారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget