Mental Health: ఫోన్‌తో అధిక సమయం గడుపుతున్నారా? ఈ వయసు వారిలో ఆత్మహత్యా ఆలోచనలు కలిగే అవకాశం
ఫోన్ వల్ల జీవితం చాలా సులభంగా మారుతుంది కానీ, ఆరోగ్యంపై మాత్రం చెడు ప్రభావం పడుతుంది.
ఫోన్ అత్యవసర వస్తువుల జాబితాలో చేరిపోయింది. ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ కనిపించాల్సిందే. పక్కన మనుషులు ఉన్నా కూడా ఫోన్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారంతా. ఎవరైతే నిత్యం నెలల తరబడి ఫోన్ లో అధిక సమయం గడుపుతారో వారి మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు కొత్త అధ్యయనం తేల్చింది. వారు ఆలోచన విధానం కూడా మారుతున్నట్టు గుర్తించింది. ఇది వారి మానసిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు పరిశోధకులు.
అమెరికాలోని వర్జెంటీనాలో ఉంది సేలియన్ ల్యాబ్స్. ఇందులో మానసిక ఆరోగ్యంపై అనేక పరిశోధనలు జరుగుతుంటాయి. ఆ ల్యాబ్ కు చెందిన పరిశోధకులు ఫోన్ వాడకం మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ పరిశోధనలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిందని, చుట్టు జనాలున్నా కూడా సామాజిక ఒంటరితనాన్ని పెంచిందని తేలింది. ముఖ్యంగా 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువతపై ఈ ప్రభావం అధికంగా ఉందని, ఆ యువత మానసిక ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోందని తేలింది. ఈ పరిశోధన ప్రకారం వీరు రోజుకు ఏడు నుంచి 10 గంటల పాటూ ఫోన్‌ను వాడుతున్నట్టు తేలింది.
ప్రియమైన వారికి దూరంగా...
ఇంటర్నెట్ రాక ముందు పిల్లలు 18 ఏళ్ల వచ్చే సమయానికి తమ కుటుంబసభ్యులతో, స్నేహితులతో కనీసం 15000 నుంచి 25000 గంటలు గడిపేవారు. కానీ ఇంటర్నెట్ వచ్చాక మాత్రం ఆ సమయం చాలా తగ్గిపోయింది. కేవలం 1500 నుంచి 5000 గంటలు మాత్రమే గడుపుతున్నట్టు పరిశోధనలో తేలింది. వారు సమయమంతా ఫోన్ లోనే గడుపుతుండడంతో కుటుంబసభ్యులతో, తమ స్నేహితులతో గడిపే సమయం చాలా తగ్గిపోయినట్టు గుర్తించారు.
ఆత్మహత్యా ఆలోచనలు
ఫోన్ అధికంగా వాడే వారిలో త్వరగా ఆత్మహత్యా ఆలోచనలు కూడా కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు పరిశోధనకు నాయకత్వం వహించిన తారా త్యాగరాజన్. సమాజంతో కలిసి జీవించడం చాలా ముఖ్యమని, సామాజిక-భావోద్వేగ అభివృద్ధికి కీలకమైన జీవిత నైపుణ్యాలు నలుగురితో కలిసి జీవించినప్పుడే తెలుస్తాయని ఆమె అభిప్రాయ పడ్డారు. సమాజానికి దూరంగా జీవించే వారిలో ఆత్యహత్యా ఆలోచనలు త్వరగా వస్తాయని చెప్పారు.
2010 తరువాతే స్మార్ట్ ఫోన్ వాడకం తీవ్రంగా మారింది. కరోనా వచ్చాక మరింతగా పెరిగిపోయింది. అందుకే 2010కి ముందు యువ వయస్కుల్లో మానసిక ఆరోగ్యం చాలా బాగున్నట్టు గుర్తించారు. ఆ తరువాత యుక్త వయస్సుకు వచ్చిన వారిలో మాత్రం మానసిక ఆరోగ్యం అంత పటిష్టంగా లేదని చెప్పుకొచ్చారు తారా.
Also read: టమాటోలను పొడి చేసుకుని దాచుకోవచ్చు, ఎన్నాళ్లయినా చెక్కుచెదరదు
Also read: డయాబెటిస్ ఉన్న వారు మామిడి పండ్లు తినొచ్చా? రోజుకు ఎన్ని తింటే సేఫ్