Cashew: పాలలో జీడిపప్పు నానబెట్టుకుని తింటే ఈ సమస్యలన్నీ దూరం!
జీడిపప్పు తింటే కొవ్వు ఎక్కువగా చేరుతుందని భయపడి వాటికి దూరంగా ఉంటారు. కానీ వాటిని నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది.
జీడిపప్పు ఎంతో రుచిగా ఉంటాయి. కానీ వాటిని తినడానికి చాలా మంది భయపడతారు. అందుకు కారణం వాటిని తీసుకుంటే కొవ్వు ఎక్కువగా వస్తుందని అనుకుంటారు. కానీ ఇందులో డైటరీ ఫైబర్, ప్రోటీన్లు, మెగ్నీషియం, మాంగనీస్, పాస్ఫరస్, జింక్, కాపర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. విటమిన్ కె, బి6, థయామిన్ కూడ సమృద్ధిగా ఉన్నాయి. అందుకే జీడిపప్పు రోజూ తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఆహారంలో వివిధ రూపాల్లో చేర్చుకోవచ్చు. వీటిని నానబెట్టుకుని తింటే మరిన్ని ప్రయోజనాలు పొందుతారు.
ఇప్పటి వరకు బాదం, వాల్ నట్స్, ఎండు ద్రాక్ష వంటి వాటిని నానబెట్టుకుని తినడం చూస్తూనే ఉంటాం. కానీ నానబెట్టిన జీడిపప్పు తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే పాలలో నానబెట్టిన జీడిపప్పు తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు అభివృద్ధి చెందుతాయి. మలబద్ధకం నుంచి బయటపడేందుకు సహాయపడుతుంది.
ఎముకలు గట్టి పడతాయి
రోజంతా పాలలో నానబెట్టి జీడిపప్పు తీసుకుంటే ఎముకలు గట్టి పడతాయి. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా విటమిన్ కె, మెగ్నీషియం, విటమిన్ బి6, మాంగనీస్ ఇందులో లభిస్తాయి. ఇవి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పులను ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
పొట్ట శుభ్రపడుతుంది
ఈరోజుల్లో మలబద్ధకం అనేది సాధారణ సమస్యగా మారింది. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే పాలలో జీడిపప్పు నానబెట్టుకుని తినొచ్చు. ఇందులోని ఫైబర్ ఈ సమస్య నుంచి బయటపడేస్తుంది. రాత్రి పాలలో నానబెట్టి ఉదయాన్నే నిద్రలేచి తింటే పొట్ట ఈజీగా శుభ్రపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
పాలలో నానబెట్టిన జీడిపప్పు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల త్వరగా జలుబు దరిచేరదు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు.
ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణగా
జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. వీటిని పాలలో నానబెట్టి తింటే ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి శరీరాన్ని కాపాడుతుంది. చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది.
నానబెట్టిన జీడిపప్పు ఎలా తీసుకోవాలి?
ఒక గ్లాసు పాలలో 3-5 జీడిపప్పులు రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ పాలని జీడిపప్పుతో కలిపి మరిగించాలి. తర్వాత వాటిని పాలతో కలిపి తింటూ తాగడమే. పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సయిదనేట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మృదువైన చర్మాన్ని అందిస్తుంది. జీడిపప్పు ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా తినకూడదు. మితంగా తీసుకోవాలి. ఎందుకంటే పాలు, జీడిపప్పులో కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి త్వరగా బరువు పెంచుతాయి. అందుకే తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. మహిళలకు ఇవి మేలు చేస్తాయి. మహిళల్లో ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉంటే జీడిపప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన హార్మోన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ప్రపంచంలోనే అత్యంత పురాతన శాఖాహార రెస్టారెంట్ ఇదే - ఫుడ్ వెయిట్ ప్రకారమే బిల్లు