పిక్క బలం పెరిగితే గుండె బలం తగ్గుతుందా? కొత్త పరిశోధనలో ఏం తేలింది?
జిమ్ లో లెగ్ డే అంటే అసలు ఇష్టం లేదా? ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలని చూస్తారా? ఇప్పుడు అలా తప్పించుకునేందకు మంచి సైంటిఫిక్ సాకు గురించి ఇక్కడ తెలుసుకుందాం.
2023లో యూరోపియన్ సొసైటి ఆఫ్ కార్డియాలజీ నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన సైంటిఫిక్ కాంగ్రేస్, హార్ట్ ఫెయిల్యూర్ లో హార్ట్ ఎటాక్ తర్వాత కాళ్లలో బలం, హార్ట్ ఫేయిల్యూర్ కు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి చర్చించారు.
హార్ట్ ఎటాక్ ను మయోకార్డియాల్ ఇన్ ఫ్రాక్షన్ అంటారు. హార్ట్ ఫేయిల్యూర్‌కి ఇది మొదటి కారణం. హార్ట్ ఎటాక్ సర్వైవర్స్ లో దాదాపుగా ఆరు నుంచి తొమ్మిది శాతం మంది హార్ట్ ఫేయిల్యూర్ బారిన పడతారని నిపుణుల అంచనా.
గుండెపోటు బారిన పడిన తర్వాత గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గించడంలో కాళ్లలో బలం ఏ మేరకు పనిచేస్తుందనే అంశాన్ని హైపొథెసిస్ ను నిపుణులు పరిశీలించారు. ఈ హైపోథెసిస్ ను పరిక్షించేందుకు 2007, 2020 మధ్య తీవ్రమైన మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ గురై హాస్పిటల్ లో చేరిన 932 మంది ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. వీరందరికి ఇది రకు ఎప్పుడూ కూడా హార్ట్ ఫేయిల్యూర్ సమస్య లేదు.
ఇదే గ్రూప్ కు చెందిన వారిలో 67 మంది హార్ట్ ఫేయిల్యూర్ బారిన పడ్డారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కాళ్ల కండరాలు బలంగా ఉన్న వారిలో హార్ట్ ఫేయిల్యూర్ రేటు చాలా ఎక్కువగా ఉంది. పిక్కబలం తక్కువగా ఉన్నవారితో పోలిస్తే హార్ట్ ఫేయిల్యూర్ వల్ల గుండె ఆగి పోయే ప్రమాదం పిక్క బలం ఎక్కువగా ఉన్న వారిలో 41 శాతం అధికంగా ఉన్నట్లు తేలిందట. మరో అవాక్కయ్యే విషయం ఏమిటంటే పిక్క బలం పెరగడం మూలంగా శరీరం బరువులో 5 శాతం పెరగడం వల్ల హార్ట్ ఫేయిల్యూర్ ప్రమాదం 11 శాతం పెరిగిందట.
ఈ ఆశ్చర్యకరమైన ఫలితాల విశ్లేషణ తర్వాత పిక్కబలానికి హార్ట్ ఫేయిల్యూర్ కు మధ్య సంబంధం ఉందనే అనుమానం మరింత బలపడింది. కేవలం బలమైన కండరాలు కలిగి ఉండడం మీద మాత్రమే దృష్టి నిలపడం కంటే ఓవరాల్ హెల్త్ గురించిన అవగాహన కలిగి ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇందులో నిజమెంత?
గుండె పోటు తర్వాత గుండెలో మయోకార్డియల్ రీమోడలింగ్ లేదా కార్డియాక్ రీమోడలింగ్ అనే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో ఫైబరస్ కణజాలం చేరుతుంది. ఇది హార్ట్ డైలేట్ అయ్యేందుకు కారణం అవుతుంది. అంటే గుండె పరిమాణం పెరుగుతుంది. ఎక్సర్సైజ్ బేస్ డ్ కార్డియాక్ రీహాబిలిటేషన్ వల్ల ఈ రీమోడలింగ్ ప్రక్రియను మార్చేస్తుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుందని జపాన్ కిటాసాటో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ లోని రీహాబిలిటేషన్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ కెంటారో కమిమా వివరణ ఇచ్చారు.
గుండె పోటు తర్వాత హార్ట్ ఫేయిల్యూర్ కు ప్రధాన కారణం కార్డియాక్ రీమోడలింగ్ అని ఆయన నొక్కి వక్కాణిస్తున్నారు. కండరాల ఫైబర్స్ నుంచి విడుదలయ్యే పెప్టైడ్స్, ఆమైనో ఆసిడ్ చైన్స్ , మయోకిన్స్ ఇలాంటి సందర్భాల్లో కీలక పాత్ర పోషిస్తాయనేది ఆయన వాదన.
వర్కవుట్ వల్ల కార్డియాక్ రీమోడలింగ్ ను తగ్గించే సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు స్కెలిటల్ కండరాలు మయోకిన్ల విడుదలకు కారణం అవుతాయని కొత్త అధ్యయనాలు చెబుతున్నయని, ఇవి సైటోకిన్లుగా పనిచేసి బీపీ అదుపులో ఉంచేందుకు, అథెరోస్క్లీరోసిస్ ను అదుపులో ఉంచేందుకు వయసు పెరగడం వల్ల వచ్చే వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయి. స్కెలిటైల్ మజిల్ మాస్ నిర్వహణ సరిగ్గా ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం ఈ మయోకిన్స్ వల్ల తగ్గుతుందనేది డాక్టర్ కెంటారో అభిప్రాయం.
ఏది ఏమైనా రోజులో ఎన్నిసార్లు వ్యాయామం చేస్తున్నారు, ఎంత ఇంటెన్స్ తో చేస్తున్నారు అనే దాని కంటే కూడా వారంలో 150 నిమిషాల పాటు తప్పకుండా వ్యాయామం చెయ్యడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వారంలో కేవలం ఒక గంట పాటు మాత్రమే వ్యాయామం చెయ్యడం వల్ల గుండె ఆరోగ్యానికి పెద్దగా ఒరిగేదేమీ లేదట.
Also read : ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌తో హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును ముందే తెలుసుకోవచ్చట!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.