అన్వేషించండి

Romantic Relationship : పెరుగుతోన్న Situationship కల్చర్.. అన్ని పనులు కానిచ్చేస్తారు కానీ, వాటికి మాత్రం నో అట

Situationship Boundaries : రిలేషన్​షిప్​ని సీరియస్​గా తీసుకోవడం ఎందుకని.. సిచ్యుయేషన్​షిప్​ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ఈ షిప్​నే ఎక్కువమంది సీరియస్​గా తీసుకుని ఫాలో అవుతున్నారట. 

Situationship Relastionshp : రిలేషన్​షిప్స్ రోజురోజుకి మారిపోతున్నాయి. మనుషుల స్వభావాలు మారేకొద్ది కొత్త కొత్త రిలేషన్​​షిప్స్​ తెరపైకి వస్తున్నాయి. అలాంటి వాటిలో ​సిచ్యుయేషన్(Situationship) కూడా ఒకటి. ఒకప్పుడు దీనిని సీరియస్​ రిలేషన్​ వద్దనుకునేవారు ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పడు అసలైన రిలేషన్​షిప్​ని పక్కకు నెట్టేసి.. దీనిపైనే ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. అసలు ఈ Situationship కల్చర్ ఏంటి? దీనిలో రూల్స్ ఉంటాయా? ఈ షిప్​కి డిమాండ్ ఎందుకు పెరుగుతుందో ఇప్పుడు చూసేద్దాం. 

సిచ్యుయేషన్​షిప్ అంటే ఏమిటి?

సింపుల్​గా చెప్పాలంటే సిచ్యుయేషన్​షిప్​ అంటే రొమాంటిక్ రిలేషన్​షిప్​ అని చెప్పొచ్చు. సాధారణంగా రిలేషన్​షిప్​లో ఉంటే రొమాంటిక్​ రిలేషన్​తో పాటు.. కమిట్​మెంట్, ఎమోషనల్​ బాండింగ్​ ఉంటుంది. కానీ సిచ్యుయేషన్​షిప్​లో ఆ కమిట్​మెంట్​, ఎమోషనల్​ కనెక్టివిటీ ఉండదు. ఆమె లేదా అతనిని మీ బాయ్​ఫ్రెండ్​ లేదా గర్ల్​ఫ్రెండ్ అని చెప్పలేరు. జస్ట్ రొమాంటిక్​ డిజైర్స్​ని ఎలాంటి కమిట్​మెంట్​ లేకుండా తీర్చుకోవడాన్నే సిచ్యుయేషన్​షిప్ అంటారు. 

బౌండరీలు ఇవే.. 

సిచ్యుయేషన్​షిప్​లో మీతో ఉండే పార్టనర్​ని.. పార్టనర్​గా చెప్పుకోలేరు. వారితో మీకు ఎలాంటి గర్ల్​ఫ్రెండ్, బాయ్​ఫ్రెండ్ ట్యాగ్ ఉండదు. వారితో మీకు ఎలాంటి ఎమోషనల్ రిలేషన్​ ఉండదు. ఎలాంటి లేబుల్స్​ లేకుండా సిచ్యుయేషన్​ షిప్​లోకి వెళ్లి.. వచ్చేయాలి అంతే. 

ఒప్పందం ఉన్నట్టా? లేనట్టా?

సిచ్యుయేషన్​షిప్​లో మ్యూచువల్ అగ్రిమెంట్స్​ ఏమి ఉండవనే అంగ్రిమెంట్ ఉంటుంది. అంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి కమిట్​మెంట్ ఉండదు. ఎలాంటి కమిట్​మెంట్​ ఉండదనేదానిపై అగ్రిమెంట్ ఉంటుంది. వాడుకబాషలో చెప్పాలంటే.. మీరు శారీరకంగా కలిసి ఉన్నా.. వారితో మీకు ఎలాంటి ఫ్యూచర్​ ఉండదు. ఈ ఉండదు అనే ఒప్పందాన్నే మీరు ఒప్పుకొని సిచ్యుయేషన్​ షిప్​లోకి వెళ్తారు.

ఆ లైన్​ క్రాస్ చేయొద్దు.. 

సిచ్యుయేషన్​షిప్​లో అవతలి వ్యక్తిని తమ పర్సనల్, ఫిజికల్ విషయాల్లో కొన్ని బౌండరీలు పెడతారు. వారు మిమ్మల్ని అవి దాటొద్దని చెప్తే.. మీరు వాటికి కచ్చితంగా కట్టుబడి ఉండాలి. వారి అవసరాలను, పరిస్థితిని అర్థం చేసుకుని.. బౌండరీలు మెయింటైన్ చేయాలి. 

మిక్స్డ్​ సిగ్నల్స్

కొన్నిసార్లు మీ పార్టనర్​ ఇచ్చే సంకేతాలను మీరు ఎలా తీసుకోవాలో అర్థం కాకపోవచ్చు. కాబట్టి మీరు కన్​ఫ్యూజ్ అవుతున్నారు లేదా అవతలి వ్యక్తి కన్​ఫ్యూజ్ అవుతున్నారు అనుకున్నప్పుడు మీరు వారితో ఆ విషయాలపై చర్చించుకోవాలి. దీనివల్ల మీ సిచ్యుయేషన్​షిప్ సీరియస్​ కాకుండా ఉంటుంది. 

ఎమోషనల్​గా

సాధారణంగా ఫిజికల్​గా ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే ఎమోషనల్​గా ఎక్కువగా కనెక్ట్​ అవుతారంటారు. కానీ ఈ సిచ్యుయేషన్​షిప్​లో మీరు అవతలి వారిపై ఎలాంటి ఎమోషన్​ని పెంచుకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి చెప్పకూడదు. వాటిని పెంచుకోకూడదనే ఉద్దేశమే ఈ సిచ్యుయేషన్ షిప్. ఈ రిలేషన్​లో మీ ఫీలింగ్స్​ని అవతలి వ్యక్తికి చెప్పినా.. వారు మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లేదా వారు మీతో కమిట్​మెంట్​కి సిద్ధంగా ఉండకపోవచ్చు. 

ఇలాంటి కమిట్​మెంట్స్​ లేకుండా.. శారీరకంగా ఎంజాయ్ చేయాలనుకునేవారు, శారీరక అవసరాలను తీర్చుకోవాలనుకునేవారు సిచ్యుయేషన్​షిప్​కే ఓటేస్తున్నారు. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్​ గ్రోత్​కి ఇది చాలా మంచిదని భావిస్తున్నారు. అందుకే సీరియస్ రిలేషన్​షిప్​లోకి వెళ్లలేకపోతున్నారట. 

సిచ్యుయేషన్​షిప్​ అనేది చాలా కన్ఫ్యూజింగ్, మానసికంగా మిమ్మల్ని కొన్నిసార్లు హిట్ చేస్తుంది. కాబట్టి మీరు ఈ తరహ రిలేషన్​లోకి వెళ్లేముందు జాగ్రత్తగా ఉండాలి. మీ ఫీలింగ్స్, బౌండరీలు, అంచనాలు ఏంటో అవతలివారితో చర్చింకుని.. వారి అవసరాలను అర్థం చేసుకుని.. ఇద్దరూ వాటిని క్రాస్ చేయరు అనుకున్నప్పుడే ఈ రొమాంటిక్ రిలేషన్​లోకి వెళ్లొచ్చు. లేదంటే లైట్ తీసుకోవడమే. 

Also Read : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Errolla Srinivas: బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Year Ender 2024: ఈ ఏడాది కన్నుమూసిన భారతీయ వ్యాపార దిగ్గజాలు - ఓసారి స్మరించుకుందాం
ఈ ఏడాది కన్నుమూసిన భారతీయ వ్యాపార దిగ్గజాలు - ఓసారి స్మరించుకుందాం
Embed widget