అన్వేషించండి

Reduce Belly Fat : పొట్ట ఎక్కువగా ఉందా? ఈ అలవాట్లతో బెల్లీ ఫ్యాట్​ను తగ్గించుకోవచ్చట.. నిపుణుల సలహాలు ఇవే

Tips to Reduce Bellyfat : సన్నగా ఉన్నా.. లావుగా ఉన్నా కొందరిలో బెల్లీ ఫ్యాట్ కామన్​గా ఉంటుంది. అయితే కొన్ని అలవాట్లతో దానిని తగ్గించుకోవచ్చని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. అవేంటంటే..

Effective Ways to Control Belly Fat : పొట్ట ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. దానిలోని కొవ్వు వివిధ ఆరోగ్య సమస్యలను ఇస్తుంది. అలాగే మీ ఫిజికల్ అప్పీరియన్స్​లో కూడా ఇది పెద్ద మార్పులు తీసుకువస్తుంది. కాబట్టి దీనిని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పైగా బెల్లీ ఫ్యాట్​ అనేది శరీరంలోని ఫ్యాట్​కి ఎగ్జాంపుల్​. ఇది గుండె సమస్యలను, బీపీ, షుగర్ వంటి సమస్యలను ప్రభావితం చేసి.. మరిన్ని ఇబ్బందులను కలిగిస్తుంది. కాబట్టి దానిని వీలైనంత తొందరగా తగ్గించుకునేందుకు ట్రై చేయాలి. 

శరీరంలోని కొవ్వును తగ్గించుకునేందుకు కొన్ని అలవాట్లు హెల్ప్ చేస్తాయట. వీటి వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు.. జీవక్రియ, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు దూరమవుతాయంటున్నారు. అయితే లైఫ్​స్టైల్​లో తీసుకునే ఆహారంలో తీసుకునే జాగ్రత్తలు, అలవాట్లు పొట్టకొవ్వును తగ్గించడంలో సహాయిం చేస్తాయట. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో.. నిపుణులు ఇచ్చే సూచనలు ఏంటో చూసేద్దాం. 

హెల్తీ బ్రేక్​ఫాస్ట్

చాలామంది బ్రేక్​ఫాస్ట్​ను స్కిప్ చేస్తారు. కానీ దీనిని రెగ్యూలర్​గా, తీసుకోవాల్సిన విధంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ రిచ్ ఫుడ్స్​ను బ్రేక్​ఫాస్ట్​గా తీసుకోవాలి. గుడ్లు, మిల్లెట్స్, ఓట్స్, రాగులు, పండ్లు, బాదం వంటివి కడుపు నిండుగా ఉంచుతాయి. వీటివల్ల స్నాక్స్ జోలికి వెళ్లరు. ఇవి రోజంతా మీరు యాక్టివ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. కండరాల పనితీరును మెరుగుపరిచి.. ఇమ్యూనిటీని పెంచుతాయి. రోజంతా మీరు యాక్టివ్​గా ఉండేలా చేస్తాయి. దీనివల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది.

కార్డియో చేయాలి.. 

గుండె జబ్బులు రాకుండా, శరీరంలోని కొవ్వును తగ్గించడంలో కార్డియో మంచి ప్రయోజనాలు అందిస్తుంది. ఇది కేలరీలను బర్న్ చేస్తూ.. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తుంది. దీనిని రెగ్యూలర్​గా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పొట్ట కూడా తగ్గుతుంది. 

వెయిట్స్

జిమ్​కెళ్లి కసరత్తులతో పాటు.. వెయిట్స్ లిఫ్ట్ చేయడం చేస్తూ ఉండాలి. ఇవి మెటబాలీజం పెంచుతాయి. దీనివల్ల శరీరంలోని కొవ్వు మీరు ఖాళీగా ఉన్నా కూడా కరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కండరాలను స్ట్రాంగ్ చేయడానికి సహాయం చేస్తుంది. కాబట్టి మీ వ్యాయామాల్లో స్క్వాట్​లు, డెడ్​లిఫ్ట్​లు, బెంచ్​ ప్రెస్​లు, లైన్స్, ఓవర్​హెడ్ ప్రెస్​లు వంటివి చేయాలి. ఇవి మీ బలాన్ని కూడా పెంచి.. కొవ్వును ఈజీగా కరిగించేస్తాయి. 

ఫైబర్ ఫుడ్స్

మీ డైట్​లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్, బాదం వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకుంటే ఎక్కువసేపు మీ కడుపు నిండుగా ఉంటుంది. జీర్ణక్రియకు హెల్ప్ చేస్తాయి. అన్​ హెల్తీ స్నాక్స్​ వైపు మనసు వెళ్లకుండా సహాయం చేస్తుంది. ఇవి ఆకలిని కంట్రోల్ చేసి.. కేలరీలను తగ్గించుకోవడం సహాయం చేస్తాయి. కొవ్వు తగ్గించుకోవాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. 

హైడ్రేషన్

శరీరానికి అవసరమైనంత నీటిన అందిస్తూ ఉండాలి. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలి. ఇది మెటబాలీజంను పెంచడానికి, కొవ్వు తగ్గించడంలో సహాయం చేస్తుంది. పైగా హైడ్రేటెడ్​గా ఉండడం వల్ల కడుపు నిండుగా ఉండే ఫీలింగ్ వస్తుంది. అతి తినడం తగ్గుతుంది. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోండి. హెర్బల్ టీలను తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఇవన్నీ కూడా హైడ్రేటెడ్​గా ఉంచుతూ బరువును తగ్గేలా కొవ్వును కోల్పోయేలా చేస్తాయి. 

వాటిపై దృష్టి పెట్టాలి..

ఏమి ఫుడ్ తీసుకుంటున్నామనేది కచ్చితంగా తెలిసి ఉండాలి. ఏ ఫుడ్​ని ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో తెలిస్తే.. కచ్చితంగా మీరు కొవ్వు తగ్గించుకునే ప్రక్రియ ఈజీ అవుతుంది. కడుపు నిండుగా ఉన్నా క్రేవింగ్స్​ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థమవుతుంది. కాబట్టి ఏ ఫుడ్​ని ఎంత తీసుకోవాలో.. ఎప్పుడో తీసుకోవాలో కనీస అవగాహన తెచ్చుకోవాలి అంటున్నారు. 

స్ట్రెస్

శరీరంలో కొవ్వు పెరగడానికి ఒత్తిడి కూడా ఓ కారణమని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. వివిధ కారణాలవల్ల స్ట్రెస్ పెరిగి శరీరంలో అనేక మార్పులు, సమస్యలు తీసుకువస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు వెతుక్కోండి. యోగా, బ్రీతింగ్ ఎక్సర్​సైజ్​లు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

వీటిని అలవాట్లుగా మార్చుకుంటే కొవ్వు కచ్చితంగా తగ్గుతుంది. మీ లైఫ్​స్టైల్​లో చేసే కొన్ని మార్పులతో హెల్తీగా ఉండడం కంటే ఇంకేమి కావాలి చెప్పండి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ హెల్తీ రోటీన్లను మీ లైఫ్​ స్టైల్​లో చేర్చేసుకోండి.

Also Read : పిల్లలు లావుగా ఉంటే మధుమేహమొచ్చే అవకాశలెక్కువట.. నిపుణుల సూచనలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Jani Master: త్వరలో అసలు నిజాలు బయటకు వస్తాయి... జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి కేసుపై మాట్లాడిన జానీ మాస్టర్
త్వరలో అసలు నిజాలు బయటకు వస్తాయి... జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి కేసుపై మాట్లాడిన జానీ మాస్టర్
Embed widget