Okra: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు బెండకాయలు తినకూడదా?
బెండకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే వాటితో కొంత ముప్పు కూడా ఉంది.
Okra: అప్పట్లో బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని చెప్పుకునేవారు. ఇది ఎంతవరకు నిజమో మాత్రం తెలియదు. పిల్లలకు చాలా మంది పెద్దలు బెండకాయ వేపుడు తినిపిస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో ఎలాంటి శాస్త్రీయ అధ్యయనాలు నిజమని చెప్పలేదు. బెండకాయ తినడం వల్ల లాభాలు మాత్రం ఉన్నాయనడంలో సందేహం లేదు. డయాబెటిస్ బారిన పడిన వారికి బెండకాయ ఉత్తమ ఆహారం. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోజూ బెండకాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వైద్యులు కూడా మధుమేహం వ్యాధిగ్రస్తులను బెండకాయ తినమని సూచిస్తారు. అయితే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు మాత్రం బెండకాయకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు బెండకాయ తక్కువగా తినాలి. కిడ్నీలో రాళ్లు, పిత్తాశయంలో రాళ్లు పేరుకుపోయిన వారు బెండకాయను తినకపోవడం మంచిది. ఈ సమస్యలు ఉన్నవారు బెండకాయలు తింటే ముప్పు మరింత పెరుగుతుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు బెండకాయను తినకపోవడమే మంచిది.
సైనస్ సమస్య చెప్పుకోవడానికి చిన్నదే కానీ, వాతావరణం చల్లగా మారినప్పుడల్లా ఆ వ్యాధితో ఉన్నవారు ఎంతో ఇబ్బంది పడతారు. ఈ సమస్యతో బాధపడే వారు కూడా బెండకాయలను దూరంగా ఉంచాలి. బెండకాయలో జిడ్డుగా ఉండే పదార్థం అధికంగా ఉంటుంది. ఇది శ్లేష్మాన్ని అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. కాబట్టి సైనస్ ఉన్నవారు బెండకాయను తక్కువగా తింటే మంచిది. ముఖ్యంగా చల్లని వాతావరణంలో బెండకాయకు దూరంగా ఉండడమే ఉత్తమం. దీనిలో ఉండే పీచు పదార్థం వల్ల కూడా వారిలో డయేరియా వచ్చే అవకాశం ఉంది.
బెండకాయలోని జిగట పదార్థం అధికంగా ఉంటుంది. ఆ జిగట పదార్థం అధికంగా శరీరంలో చేరితే కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి జిగటను తొలగించాకే వాటిని వేయించుకొని తినాలి. అలా అని వేయించేటప్పుడు అధికంగా నూనె వాడితే మరింతగా కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ నూనెలోనే బెండకాయను వేయించుకొని తినాలని గుర్తుపెట్టుకోండి. లేకపోతే అధిక బరువు సమస్య ఇంకా పెరుగుతుంది. ఊబకాయంతో బాధపడేవారు అధిక బరువు సమస్యతో బాధపడేవారు బెండకాయను ఎంత తక్కువగా తింటే మంచిది. దీన్ని పులుసు రూపంలో తినవచ్చు. కానీ వేపుడు రూపంలో తినక పోవడమే ఉత్తమం.
అయితే ఈ సమస్యలు ఏవీ లేని వారు మాత్రం బెండకాయలను కచ్చితంగా తినాలి ఎందుకంటే ఇది మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది దీనిలో విటమిన్లు కనిచాలు పుష్కలంగా దొరుకుతాయి దీని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల లిఫ్టింగ్ అనే ప్రోటీన్ శరీరానికి అందుతుంది ఈ ప్రోటీన్ వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది బెండకాయలోని పుల్లట్లు అనేక రకాల క్యాన్సర్లు కూడా రాకుండా అడ్డుకుంటాయి ఫూలేటి లోపం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ మెడ క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం అధికం కాబట్టి బెండకాయ తింటే ఆ క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు డయాబెటిక్ రోగులు బెండకాయలు తినడం వల్ల ప్రయోజనం ముందే చెప్పాము బెండ తినడం వల్ల శరీరంలోని రక్తంలోని చక్కెర స్థాయిలో అదుపులో ఉండడంతో పాటు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది అలాగే రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బెండ సహకరిస్తుంది కాబట్టి వారంలో రెండు మూడు సార్లు బెండకాయలు తింటే ఎంతో ఆరోగ్య కరం
Also read: పెద్దలకు మద్యం అలవాటు ఉంటే వారి పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.